
అందాల ప్రియమణి.. తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. కానీ పెద్ద హీరోలతో ఒకటీరెండు చిత్రాలు మినహా ఎక్కువగా నటించలేదు. మీడియం రేంజ్ హీరోలతోనే ఎక్కువ మూవీస్ చేసిన ఈమె తెలుగు, తమిళ భాషల్లో బడా స్టార్ హీరోలతో జతకట్టనేలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో స్టార్ హీరోల సరసన నటించకుండా ఉండిపోవడానికి కారణమేంటన్న ప్రశ్న ప్రియమణికి తరచూ ఎదురవుతుంది. మైదాన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా అక్కడా ఇదే ప్రశ్న ఎదురైంది.
నా డామినేషన్ ఎక్కువ!
దీనికి ప్రియమణి స్పందిస్తూ.. 'టాప్ లిస్టులో ఉండే హీరోలకు జోడీగా నన్నెందుకు తీసుకోరనేది నాకూ అర్థం కాదు. ఇప్పటికీ దాని సమాధానం నా దగ్గర లేదు. ఈ ప్రశ్న దర్శకనిర్మాతలను అడిగితే బాగుంటుంది. అయినా ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. చాలామంది దగ్గర నేను విన్నదేంటంటే.. నన్ను సినిమాలో తీసుకుంటే నా పక్కన ఉన్నవాళ్లు కనబడకుండా డామినేట్ చేస్తానట! వారి పాత్రలను తినేస్తానట! అందుకనే స్టార్ హీరోకు జోడీగా లేదా వారి సినిమాల్లో నన్ను తీసుకోవడానికి ఆసక్తి చూపించరని చెప్తుంటారు.
సగం తెలిసినవాళ్లే, అయినా..
ఏదో అలా అంటారు కానీ, ఇది నిజం కాదులెండి.. సరైన కారణమేంటన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. అయినా ఏం పర్లేదు.. నేను చేస్తున్న పాత్రలతో సంతృప్తిగానే ఉన్నాను. అయితే నెంబర్ 1 హీరోలతో నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాళ్లతో పనిచేయకపోవడం వల్ల అవన్నీ మిస్ అయిపోతున్నానపిస్తుంది. దాదాపు సగం మంది స్టార్ హీరోలు నాకు పరిచయస్థులే..కనిపిస్తే హాయ్, బాయ్ అనైనా పలకరించుకుంటాం. వారి సినిమాల్లో నన్ను ఎందుకు సెలక్ట్ చేయట్లేదని కొన్నిసార్లు బాధగానూ అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది.
చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment