
వరుస విజయాలతో కథానాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan). ఈయన కథానాయకుడుగా నటిస్తున్న 25వ చిత్రంలో నటుడు రవిమోహన్ ప్రతి నాయకుడిగాను, అధర్వ ముఖ్య పాత్రలోను, నటి శ్రీ లీల కథానాయకిగానూ నటిస్తున్నారు. సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి 'పరాశక్తి' (Parasakthi)అనే టైటిల్ నిర్ణయించారు. ఇది దివంగత నటుడు శివాజీ గణేషన్(Sivaji Ganesan) కథానాయకుడు నటించిన తొలి చిత్ర టైటిల్ కావడం గమనార్హం.

1952లో విడుదలైన ఈ చిత్రం తమిళ సినీ చరిత్రను ఒక అధ్యాయంగా నిలిచిపోయింది. అలాంటి చిత్రం పేరు శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రానికి నిర్ణయించడంపై శివాజీ గణేషన్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ చిత్ర టైటిల్‌ను ఏవీఎం సంస్థ నుంచి పొందినట్లు శివకార్తికేయన్ చిత్ర వర్గం ఆధారాలతో సహా వెల్లడించింది. అయినప్పటికీ పరాశక్తి టైటిల్ మరో చిత్రానికి వాడుకోరాదంటూ ముఖ్య నగరాల్లో పోస్టర్లలతో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారం వివాదంగా మారింది.
చిత్ర బృందం ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఇదే టైటిల్ నటుడు సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తాజా చిత్రం తెలుగు వెర్షన్‌కు పెట్టారు. అయితే ఈ టైటిల్ వివాదానికి దారి తీయడంతో ఆయన తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది.