Bipasha Basu And Karan Singh Grover Blessed With A Baby Girl Today, Deets Inside - Sakshi
Sakshi News home page

Bipasha Basu: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు

Published Sat, Nov 12 2022 3:30 PM | Last Updated on Sat, Nov 12 2022 4:23 PM

Bipasha Basu and Karan Singh Grover blessed with a baby girl Today - Sakshi

బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పాప పాదాలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ' దేవి బసు సింగ్ గ్రోవర్' అంటూ రాశారు. గతంలోనే ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిపాసా బసు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేసింది. తాజాగా నవంబర్ 12న బిపాసా బేబీకి జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  

(చదవండి: తల్లి కాబోతున్న బిపాషా బసు?!)
 
బిపాసా, కరణ్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టులోనే ప్రకటించారు. కాగా ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన 'ఎలోన్‌' సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో డేటింగ్‌ కొనసాగించారు. ఆ తర్వాత ఈ జంట సుయాష్ రాయ్, నటాషా సూరి, సోనాలి రౌత్, నితిన్ అరోరా నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డేంజరస్'లోనూ కూడా కలిసి నటించారు. గతవారమే ఆలియా భట్‌కు పాప పుట్టిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement