Bipasha Basu
-
బిపాషా బసు బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..శిశువులకు ఎందుకొస్తుంది..?
పుట్టుకతో గుండె లోపం గురించి విని ఉంటాం. ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. మునపటి రోజుల్లో ఎక్కడో గానీ కనిపించేది కాదు. అదీగాక పోషకాహార లోపం కారణంగా వచ్చేదని భావించేవారు. కానీ ఇప్పుడూ స్టార్ హోదాలో చెలామణి అవుతున్న సినీతారల పిల్లలు కూడా ఈ వ్యాధిని బారినపడటం ఒకింత బాధకరం, ఆశ్చర్యం కలిగించే అంశం ఇది. ఇటీవల సినీ తార బిపాషా సైతం తన కూతురు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. పుట్టిన మూడు నెలల వయసులోనే చికిత్స చేయించినట్లు తెలిపింది. అలాగే మన టాలీవుడ్ హిరో మహేష్ బాబు కూడా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక సందర్భంలో తన కొడుకు కూడా పుట్టిన వెంటనే ఇలాంటి సమస్యతో బాధపడ్డాడని చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టుకతో గుండెలోపం స్టార్ పిల్లలు దగ్గర నుంచి కామన్ మ్యాన్ పిల్లలు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సమస్యల బారినపడుతున్నారు. ఎందువల్ల వస్తుంది ఎలా గుర్తించగలరు అనేదాని గురించే ఈ కథనం!. పుట్టుకతో వచ్చే గుండె సమస్యను వైద్య పరిభాషలో 'వెంట్రిక్యులర్ సెప్ట్ డిఫెక్ట్(వీఎస్డీ)'గా పిలుస్తారు. దీనివల్ల పుట్టినప్పుడే గుండెల్లో రంధ్రాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది. కొందరూ చిన్నారులకు పెద్ద అవ్వడంతో పూడుకుపోయే అవకాశాలు ఉంటాయి. మరి కొందరికి ఆ ఛాన్స్ తక్కువగా ఉండటమే గాక పిల్లలు కూడా సమస్యను గట్టిగా ఫేస్ చేస్తుంటారు. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన మొదట కొన్ని రోజులు, వారాలు లేదా నెలలో ఈ సమస్య బయటపడుతుంది. గుండెల్లో ఏర్పడిన రంధ్ర పరిమాణాన్ని బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ సమస్యతో ఉన్న చిన్నారుల్లో కనిపించే లక్షణాలు సరిగా తినలేకపోవడం శారీరక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస ఆడకపోవడం త్వరితగతిన అలసిపోవడం స్టెతస్కోప్‌తో హృదయాన్ని వింటున్నప్పుడు హూషింగ్ శబ్దం తదితర లక్షణాలు శిశువుల్లో కనిపిస్తాయి. ఎందువల్ల వస్తుందంటే.. గర్భధారణ సమయంలో శిశువు గుండె ఏర్పడినప్పుడే ఈ సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఎడమ, కుడివైపు వేరుచేసే కండరాల గోడ పూర్తిగాఏర్పడకపోవడంతో ఈ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాల పరిమాణం కూడా వేరుగా ఉంటుంది. ఇకి ఇది ఎందువల్ల వస్తుందనేదిచెప్పలేం అన్నారు వైద్యులు. ఇందుకు జన్యులోపం, పర్యావరణ కారకాలు రెండు కావొచ్చని చెబుతున్నారు. చాలామంది శిశువులకు ప్రధానంగా పుట్టకతోనే గుండెల్లో రంధ్రాలు లేదా ఇతర హృద్రోగ సమస్యలకు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలో మొదటి మూడు నుంచి ఆరు నెలలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండక పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురవ్వదు. శిశువు అవయవాలు ఏర్పడే క్రమంలో వీలైనంత మంచి ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?) -
పుట్టుకతోనే నా కూతురికి అంత పెద్ద కష్టం.. హీరోయిన్ కంటతడి
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుకు పెద్ద కష్టం వచ్చింది. గతేడాది నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తన పాపయికి దేవి అని నామకరణం చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన గారాలపట్టికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలతో జన్మించిందని వెల్లడించింది హీరోయిన్. దీంతో మూడు నెలల వయసులోనే తనకు సర్జరీ చేశారంటూ కంటతడి పెట్టుకుంది. శనివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చిన బిపాషా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, తల్లిగా తను ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. ఈ నరకం ఎవరికీ రాకూడదు 'దేవి పుట్టిన మూడు రోజులకు తన గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని తెలిసింది. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్(వీఎస్డీ) ఉంది, దాన్ని సరి చేయాలంటే సర్జరీ చేయాలన్నారు. అసలు వీఎస్డీ అంటే ఏంటో కూడా తెలియదు. చాలా బాధపడ్డాం. ఈ బాధనంతా పంటికింద అదిమిపెట్టి నవ్వుతూ కనిపించాం. ఇటువంటి నరకం ఏ తల్లికీ రాకూడదు. కనీసం ఈ విషయాన్ని మేము మా కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు. తన రాకను ఎంతో ఘనంగా వేడుక చేసుకోవాలనుకున్నాం. కానీ ఈ విషయం తెలిసి మా మనసు ముక్కలైంది. మొదటి ఐదు నెలలు మాకు చాలా కష్టంగా కొనసాగాయి. ఈ గండం నుంచి గట్టెక్కాలనుకున్నా అయితే దేవి మాత్రం మొదటిరోజు నుంచే ఎంతో హుషారుగా కనిపించేది. తనకు మూడు నెలల వయసున్నప్పుడు స్కానింగ్‌కు తీసుకెళ్లాం. అంత చిన్న పసిపాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చెప్పలేనంత బాధేసింది. కరణ్(బిపాషా భర్త) సిద్ధంగా లేడు, కానీ నేను మాత్రం తను వీలైనంత త్వరగా ఈ గండం నుంచి గట్టెక్కాలనుకున్నాను. ఆరు గంటలపాటు ఆపరేషన్ జరిగింది. అప్పుడు నా జీవితమే ఆగిపోయినట్లనిపించింది. చివరకు ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాం' అంటూ కంటతడి పెట్టుకుంది బిపాషా బసు. కరణ్‌తో పెళ్లి కాగా తెలుగులో టక్కరి దొంగ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న బిపాషా హిందీలో రాజ్, జిస్మ్ వంటి చిత్రాలతో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. 2015లో వచ్చిన 'ఎలోన్' సినిమాలో కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఇష్క్ మొదలైంది. ఆ తర్వాత థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డేంజరస్'లోనూ వీరు కలిసి నటించారు. కొంతకాలంపాటు డేటింగ్ చేసిన వీరిద్దరు 2016లో పెళ్లిపీటలెక్కారు. వీరికి గతేడాది నవంబర్ 12న పాప జన్మించింది. తె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2018లో వచ్చిన వెల్కమ్ టు న్యూయార్క్ సినిమాలో మాత్రం అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) చదవండి: సర్కారు నౌకరి.. టీజర్ చూశారా? -
లగ్జరీ ఆడి కారు కొన్న హీరోయిన్, వీడియో వైరల్
సెలబ్రిటీ దంపతులు బిపాషా బసు- కరణ్ సింగ్ గ్రోవర్ కొత్త కారు కొన్నారు. తమ కూతురితో కలిసి ఈ కారులో షికారు చేయనున్నారు. తెలుపు రంగులో ఉన్న కారుపై కేక్ కట్ చేసి, దాని ముందు ఫోటోలు దిగిన బిపాషా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. కొత్త కారు కొన్న ఆనందంలో మునిగి తేలుతున్న నటికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కారు విషయానికి వస్తే బిపాషా దంపతులు ఆడి క్యూ 7 మోడల్‌ను కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారు ధర దాదాపు రూ.90 లక్షల మేర ఉండవచ్చని తెలుస్తోంది. ఇకపోతే 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన ఎలోన్ సినిమాలో బిపాసా, కరణ్ జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొంతకాలం పాటు డేటింగ్ చేసిన వీరు 2016లో పెళ్లిపీటలెక్కారు. వీరికి గతేడాది నవంబర్ 12న పాప పుట్టింది. ఆమెకు దేవి బసు సింగ్ గ్రోవర్ అని నామకరణం చేశారు. బిపాషా సినిమాల విషయానికి వస్తే ఆమె తెలుగులో టక్కరి దొంగ సినిమాలో మహేశ్‌బాబుతో జోడీ కట్టింది. హిందీలో రాజ్, జిస్మ్ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది బిపాషా. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) చదవండి: 29 ఏళ్ల ప్రేయసితో డేటింగ్.. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి -
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పాప పాదాలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ' దేవి బసు సింగ్ గ్రోవర్' అంటూ రాశారు. గతంలోనే ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిపాసా బసు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేసింది. తాజాగా నవంబర్ 12న బిపాసా బేబీకి జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (చదవండి: తల్లి కాబోతున్న బిపాషా బసు?!) బిపాసా, కరణ్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టులోనే ప్రకటించారు. కాగా ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన 'ఎలోన్' సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో డేటింగ్ కొనసాగించారు. ఆ తర్వాత ఈ జంట సుయాష్ రాయ్, నటాషా సూరి, సోనాలి రౌత్, నితిన్ అరోరా నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డేంజరస్'లోనూ కూడా కలిసి నటించారు. గతవారమే ఆలియా భట్‌కు పాప పుట్టిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) -
తల్లి కాబోతున్న బిపాషా బసు?!
తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది బిపాషా బసు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా వీరిద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారిద్దరూ. ఇదిలా ఉంటే తాజాగా బిపాషా తల్లి కాబోతుందంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీంతో అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. మరి బిపాషా దీనిపై ఏమంటుందో చూడాలి! View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) చదవండి: నాకేదైనా అయితే ఆ మాఫియాను వదలకండి, వెంటాడండి.. ఓటీటీలో సందడి చేయనున్న స్టార్ హీరో మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
త్వరలో తల్లి కాబోతున్న బిపాషా బసు?
మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన బిపాషా బసు తొలి సినిమా 'అజ్నబీ'తోనే స్టార్డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ తన స్టార్‌డమ్‌ను పదిలంగా కాపాడుకుందీ హీరోయిన్. తాజాగా బిపాషా, భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్లు వాటిని సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఇందులో బిపాషా వదులుగా ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ధరించింది. దీంతో నెటిజన్లు ఆమె గర్భవతా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. త్వరలోనే జూనియర్ బిపాషా రాబోతుందంటూ శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. మరికొందరు మాత్రం లూజ్‌గా ఉన్న డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిపాషా బసు, కరణ్ సింగ్ ఇద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. -
Bipasha Basu Love Story: బ్రేకప్ నరకమే, కానీ..
ప్రేమ జీవితపు కాలపు గ్యారెంటీ, వారెంటీ ఇవ్వదు.. ఈ కథకు బిపాషా బసు, జాన్ అబ్రహమ్లే నాయికా, నాయకులు! ఇద్దరూ మధ్యతరగతి విలువలతో పెరిగి జీవన ప్రయాణంలోని అనుభవాలతో పరిణతి సాధించిన వాళ్లే! ఇద్దరూ నిజాయితీని ఆస్తిగా భావిస్తారు. . అందం.. హ్యాండ్సమ్నెస్లో ఎవరికివారే సాటి. ఆమెను చూస్తే మహిళలకు గుండె ధైర్యం పెరుగుతుంది.. మగవాళ్ల గుండె జారుతుంది. అతను.. పురుషులకు అద్భుతంగా కనిపిస్తాడు.. స్త్రీలకు కనికట్టు చేస్తాడు. ఈ పర్ఫెక్ట్నెస్తోనే వాళ్ల మధ్య ప్రేమ ఇమడలేకపోయింది. ఇద్దరినీ చెరో ఒడ్డుకి చేర్చింది. ‘జిస్మ్’ సినిమా సెట్స్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బిపాషా బోల్డ్‌నెస్‌ను గౌరవించాడు అతను. పనిపట్ల జాన్‌కున్న సీరియస్‌నెస్‌ను ఆమె ఆరాధించింది. పరస్పరం ఉన్న ఇష్టాన్ని వ్యక్తపర్చుకున్నారు. స్క్రీన్ మీద ఈ జంటకు అభిమానులు పెరిగారు. వీళ్లు కలిసి నటించిన సినిమాల్లో కొన్నయితే కథతో సంబంధం లేకుండా కేవలం వీళ్ల కెమిస్ట్రీ పండే హిట్ అయ్యాయి. రియల్ లైఫ్‌లోనూ వీళ్ల ప్రేమ వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. ఆ ఇద్దరు కూడా ఏ రోజూ వాళ్ల వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. ‘మేం మామూలు ఫ్రెండ్స్ అంతే’ అనే ఫేక్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. ముఖ్యంగా బిపాషా.. జాన్‌తో తాను సహజీవనం చేస్తున్నాననే చెప్పింది. అయిదేళ్లు గడిచాకా.. ఒకసారి ‘కాఫీ విత్ కరణ్ షో’కి బిపాషా, జాన్‌లను పిలిచాడు కరణ్. ఆ ఇద్దరికీ కంపాటబులిటీ టెస్ట్ పెట్టాడు విడివిడిగా. ఇద్దరూ ఇంచుమించు పదికి తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు. ఆ షోలో ఒకరి పరోక్షంలో ఒకరు తమ సహచరి/ సహచరుడి అభిరుచులు, అలవాట్లు, సర్దుబాట్ల గురించి చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. ఇంప్రెస్ చేశాయి. ఆ ప్రేమ జంటకు వీరాభిమానులను చేశాయి. షో యూట్యూబ్ స్ట్రీమింగ్కు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను చేర్చాయి. తొమ్మిదేళ్లు కావొచ్చాయి.. కెరిర్లో ఇద్దరూ బిజీ అయిపోయారు. అయినా బిపాషా జాన్‌తో పెళ్లే ముఖ్యమనుకుంది. ఆ ప్రేమను కాపాడుకోవడమే పరమావధిగా తీసుకుంది. జాన్‌ను అడుగుతూనే ఉంది ‘పెళ్లెప్పుడు చేసుకుందాం?’ అంటూ. అతణ్ణించి స్పష్టమైన సమాధానం రాలేదు. కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడులే.. చేయనీ. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాడు కదాని ఊరుకుంది. మరింత కాలం సాగింది ముందుకు. ఇద్దరికీ ఫిట్నెస్ అంటే పిచ్చి. ఇద్దరూ కలిసి ఒకే జిమ్‌కు వెళ్లేవారు. ఒకరోజు ఆ జిమ్‌కి ఒక అమ్మాయి వచ్చింది. ఎన్ఆర్ఐ. పేరు.. ప్రియ రంచల్. పరిచయాలు అయ్యాయి. రోజూ ముగ్గురు కలిసే జిమ్ చేయడం స్టార్ట్ చేశారు. బిపాషా వెళ్లిపోయాక కూడా జాన్ ఇంకొచెం సేపు ఉండి జిమ్ చేయసాగాడు. ప్రియ కూడా తన అదనపు సమయాన్ని వెచ్చించ సాగింది. అక్కడ ఆకర్షణ పెరుగుతూంటే బిపాషాతో జాన్ గడిపే వ్యవధి తగ్గిపోతూ రాసాగింది. బిపాషా అతని కోసం ఎదురు చూడ్డం అలవాటు చేసుకుంది. రోజురోజుకూ ఆమె ఎదురు చూసే టైమ్ పెరగసాగింది. అన్యోన్యత ముభావాన్ని నేర్చుకుంది. కలిసి మాట్లాడుకోవడమే కరువైంది. ఒకే ఇంట్లో అపరిచితులైపోయారిద్దరూ. తామిద్దరికీ ‘పెళ్లి’ ముడి లేదని అర్థమైపోయింది బిపాషాకు. జాన్ కూడా గ్రహించాడు ఆ సహజీవనానికి అర్థంలేదని. పెద్దగా వాదోపవాదాలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు లేకుండానే మీడియా ముందు తమ బ్రేకప్ను ప్రకటించింది ఆ జంట. ఫీల్డ్‌లో.. బయటా అంతా షాక్. పెళ్లి కబురు వినిపిస్తారనుకుంటే ఇదేంటిలా విడిపోతున్నామంటున్నారు? అని. తమ ఇంట్లోని పిల్లలే బ్రేకప్ మాట చెప్పినంత బాధపడ్డారు. తమ ఇంటి జంటే విడిపోయినంత నొచ్చుకున్నారు. ఇద్దరి పట్లా టన్నుల కొద్దీ సానుభూతి పెంచుకున్నారు. ఇలా జరక్కుండా ఉంటే బాగుండు అనుకున్నారు. అయితే ఆ ఎడబాటు వాళ్లు ప్రకటించుకున్నంత సులభంగా.. స్నేహపూర్వకంగా జరగలేదు. బిపాషా ఒక వార్తా దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తేలింది. ‘ఏ ప్రేమా స్నేహంగా బ్రేకప్ చెప్పుకోదు. స్నేహమే ఉంటే బ్రేకప్ దాకా ఎందుకు వస్తుంది? మాదీ అంతే. ఆ ఇంట్లో నేను అనాథనైపోయాననిపించింది. మా అనుబంధం పట్ల జాన్‌కు సీరియస్‌నెస్ లేదని, అతనికి నన్ను పెళ్లిచేసుకునే ఆలోచనే లేదని తేలింది. నా కెరీర్ కన్నా ప్రేమే ముఖ్యమనుకున్నా. దానికోసం కెరీర్‌నూ పట్టించుకోలేదు. ఆఖరికి ఆ ప్రేమ కూడా లేదని తెలిసింది. మోసపోయాననే ఫీలింగ్ వెంటాడింది. నిజాయితీ లేని చోట ఉండలేకపోయా’ అని చెప్పింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో జాన్ కూడా స్పందించాడు..‘ బిపాషా అడిగినప్పుడు పెళ్లి పట్ల నేనంత సీరియస్‌గా లేని మాట నిజమే. కాని నిజాయితీ లేని, అబద్ధాలాడే నేపథ్యం నుంచి వచ్చినవాడినైతే కాదు. బ్రేకప్ నరకమే. అన్నేళ్ల సహజీవనం ఎన్నో జ్ఞాపకాలను మిగిలుస్తుంది. మరిచిపోవడం అంత సులభం కాదు. కానీ తప్పదు.. ముందుకు సాగాలి కదా’ అని జాన్ చెప్తున్నప్పుడు అతని గొంతు జీరబోయింది బాధతో. బ్రేకప్ అయిన తర్వాత జానే ముందుగా పెళ్లిచేసుకున్నాడు ప్రియా రంచల్ని. తర్వాత బిపాషా పెళ్లాడింది టీవీ, సినీ స్టార్ కరణ్ సింగ్ గ్రోవర్‌ను. - ఎస్సార్ చదవండి: టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? -
బిపాషా బసు, డినో మోరియా ప్రేమ కథ తెలుసా?
బిపాషా బసు.. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ‘తెల్లరంగు’ అబ్సేషన్ను అవతలికి నెట్టిన నటి. డినో మోరియా... మోడల్స్ ర్యాంప్ మీదే కాదు తెర మీదా మెప్పించగలరని చూపించిన నటుడు. కలిసి ఉన్నా లేకపోయినా స్నేహితులుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి.. ఒకరికోసం ఒకరు నిలబడాలని నిరూపించిన జత ఇది. ప్రేమను విఫలం చేసుకున్న వ్యక్తులుగా చిత్రీకరించే కంటే మైత్రిని కాపాడుకున్న జంటగా వీళ్లను వర్ణించడం సబబు. బిపాషా ఫ్రమ్ కోల్‌కతా, డినో ఫ్రమ్ బెంగళూరు.. దాదాపు ఇద్దరూ ఒకేసారి ముంబై చేరారు మోడలింగ్ కోసం. కెరీర్ మొదటి నుంచీ ఈ ఇద్దరు మంచి స్నేహితులు. బాధనూ, సంతోషాన్నీ కలిసే పంచుకున్నారు. అరకొర అవకాశాలతో ఆర్థిక ఇబ్బందులు పడ్తున్నప్పుడు డబ్బు ఆదా చేయడం కోసం.. ముంబైలోని ‘జై హింద్ ’ హోటల్లో పది రూపాయలకే దొరికే తాలీనీ కలిసే తిన్నారు. ‘పది రూపాయల ఆ తాలీలో అన్నం నేను తింటే చపాతీలు డినో తినేవాడు. ఒక్కోసారి సంగం అన్నం, సగం రొట్టెలను పంచుకునే వాళ్లం. ఇలా ఒకటి, రెండు రోజులు కాదు కొన్ని నెలలు గడిపాం’ అంటుంది బిపాషా. కష్టసుఖాల్లో జంటగా చేసిన ఆ ప్రయాణమే వాళ్లిద్దరినీ ప్రేమికులుగా మార్చింది. 1997నాటి ఈ ముచ్చట అప్పటి పేజ్ త్రీకే కళను తెచ్చింది. ఏ పత్రికలోని ప్రేజ్ త్రీని తిరగేసినా... ఈ జంట ఫొటోలు.. ఆ ప్రేమ కబుర్లే. మోడలింగ్ ఫీల్డ్ ఈ ఇద్దరినీ ‘క్రేజీ కపుల్’గా పిలుచుకుంది. రాజ్... మోడలింగ్‌లో వస్తున్న పేరు, ప్రతిష్ఠలను ఆస్వాదిస్తూ బిపాషా ఆనందంగానే ఉంది. అంతకుమించి ఆశలు, లక్ష్యాలు ఏమీ పెట్టుకోదల్చుకోలేదు ఆమె. కానీ డినోనే అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అతని విషయంలోనే కాదు బిపాషా విషయంలోనూ. ‘నీ టాలెంట్‌ను మోడలింగ్‌కే పరిమితం చేయకు. సిల్వర్ స్క్రీన్ మీదా కనిపించాలి నువ్వు. సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయత్నించు. నేనూ ఆ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటన్నా’ అంటూ బిపాషాను ప్రోత్సహించాడు. అనుకున్నట్టుగానే ఆ ప్రయాణమూ కలిసే మొదలుపెట్టారు. అయితే బిపాషా తొలి సినిమా ‘అజ్నబీ’తోనే స్టార్డమ్ తెచ్చేసుకుంది. కాని డినో మోరియా స్ట్రగుల్ కొనసాగింది. ఇండస్ట్రీ తీరు తెన్నులను ఔపోసన పట్టి తగ్గట్టుగానే తనను తాను మలచుకుంది బిపాషా. వెండితెర వెలుగులో తన ప్రియ సఖి వెలిగిపోవడం డినోకు ఆనందాన్నిచ్చినా.. ఎందుకో తామిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు అతని మనసు గ్రహించింది. ఈ లోపే ఈ ఇద్దరూ కలిసి నటించే ఆపర్చునిటీ వచ్చింది. అదే ‘రాజ్’ మూవీ. సూపర్ హిట్ అయింది. సిల్వర్‌స్క్రీన్ మీదా వీళ్ల కెమిస్ట్రీకి తిరుగులేదని తేలింది. ‘రాజ్’తో బిపాషా ఇటు దర్శక, నిర్మాతలకే కాదు అటు హీరోలకు, అశేష ప్రేక్షక జనానికీ అభిమాన తార అయిపోయింది. కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేనంత బిజీగా మారిపోయింది. అదే సినిమా డినోకూ అంతే పేరు సంపాదించి పెట్టినా అతను ఊహించినన్ని అవకాశాలను షెడ్యూల్ చేయలేకపోయింది. ఆ కారణం వలనో.. బిపాషా కూడా కెరీరే ముఖ్యంగా ప్రవర్తించడం వలనో ఏమో కాని.. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. వాళ్లు నిలబడ్డ ప్రేమ తీరంలోని ఇసుక జారిపోవడం మొదలైంది. ఇది 2002 నాటి సంగతి. ఏడేళ్ల వాళ్ల అనురాగం తెలియకుండానే కరిగిపోయింది. బ్రేకప్‌తో ఎండ్ అయిపోంది. ... అయినా ఆ ఇద్దరూ గొడవపడలేదు. ఆమె సక్సెస్‌ను చూసి అతను ఈర్ష్యపడలేదు. టాప్ హీరోల్లో ఒకడిగా లేనందుకు అతణ్ణి ఆమె చులకన చేయలేదు. ఆత్మీయుడిగానే భావించింది. అతనూ అంతే. ఇద్దరిలో ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు స్వాంతనగా నిలుస్తారు. ఒకరి అభిప్రాయాలను, నిర్ణయాలను మరొకరు గౌరవించుకుంటూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు ఇప్పటికీ. ‘మా ఇద్దరి ప్రేమ గతం.. ఫ్రెండ్షిప్ వర్తమానం. గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని సమస్యాత్మకంగా మలచుకోవడం మా ఇద్దరి నైజం కాదు. యవ్వనంలో జరిగిన అద్భుతం మా ప్రేమ. పరిణతి చేర్చిన గమ్యం ఇప్పటి మా స్నేహం. బిపాషా.. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. తను నన్నెప్పుడూ అత్యంత ఆప్తుల్లో ఒకడిగానే చూస్తుంది. నాకూ తను అంతే’ అంటాడు డినో మోరియా. - ఎస్సార్