
మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన బిపాషా బసు తొలి సినిమా 'అజ్‌నబీ'తోనే స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ తన స్టార్‌డమ్‌ను పదిలంగా కాపాడుకుందీ హీరోయిన్. తాజాగా బిపాషా, భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్లు వాటిని సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఇందులో బిపాషా వదులుగా ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ధరించింది.
దీంతో నెటిజన్లు ఆమె గర్భవతా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. త్వరలోనే జూనియర్ బిపాషా రాబోతుందంటూ శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. మరికొందరు మాత్రం లూజ్‌గా ఉన్న డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిపాషా బసు, కరణ్ సింగ్ ఇద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment