Bipasha Basu, Karan Singh Grover Buys Audi Q7 Car - Sakshi
Sakshi News home page

రూ.90 లక్షల కొత్త కారు కొన్న టక్కరి దొంగ హీరోయిన్‌

Published Wed, May 31 2023 5:16 PM | Last Updated on Wed, May 31 2023 5:25 PM

Bipasha Basu, Karan Singh Grover Buys New Car - Sakshi

సెలబ్రిటీ దంపతులు బిపాషా బసు- కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ కొత్త కారు కొన్నారు. తమ కూతురితో కలిసి ఈ కారులో షికారు చేయనున్నారు. తెలుపు రంగులో ఉన్న కారుపై కేక్‌ కట్‌ చేసి, దాని ముందు ఫోటోలు దిగిన బిపాషా అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. కొత్త కారు కొన్న ఆనందంలో మునిగి తేలుతున్న నటికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కారు విషయానికి వస్తే బిపాషా దంపతులు ఆడి క్యూ 7 మోడల్‌ను కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారు ధర దాదాపు రూ.90 లక్షల మేర ఉండవచ్చని తెలుస్తోంది. ఇకపోతే 2015లో భూషణ్‌ పటేల్‌ తెరకెక్కించిన ఎలోన్‌ సినిమాలో బిపాసా, కరణ్‌ జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొంతకాలం పాటు డేటింగ్‌ చేసిన వీరు 2016లో పెళ్లిపీటలెక్కారు.

వీరికి గతేడాది నవంబర్‌ 12న పాప పుట్టింది. ఆమెకు దేవి బసు సింగ్‌ గ్రోవర్‌ అని నామకరణం చేశారు. బిపాషా సినిమాల విషయానికి వస్తే ఆమె తెలుగులో టక్కరి దొంగ సినిమాలో మహేశ్‌బాబుతో జోడీ కట్టింది. హిందీలో రాజ్‌, జిస్మ్‌ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది బిపాషా.

చదవండి: 29 ఏళ్ల ప్రేయసితో డేటింగ్‌.. 83 ఏళ్ల  వయసులో నాలుగోసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement