Karan Sing grover
-
Christmas 2024: బిపాసా సెలబ్రేషన్స్,‘బుజ్జెమ్మ’ ఎంత బావుందో!
-
లగ్జరీ ఆడి కారు కొన్న హీరోయిన్, వీడియో వైరల్
సెలబ్రిటీ దంపతులు బిపాషా బసు- కరణ్ సింగ్ గ్రోవర్ కొత్త కారు కొన్నారు. తమ కూతురితో కలిసి ఈ కారులో షికారు చేయనున్నారు. తెలుపు రంగులో ఉన్న కారుపై కేక్ కట్ చేసి, దాని ముందు ఫోటోలు దిగిన బిపాషా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. కొత్త కారు కొన్న ఆనందంలో మునిగి తేలుతున్న నటికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కారు విషయానికి వస్తే బిపాషా దంపతులు ఆడి క్యూ 7 మోడల్‌ను కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారు ధర దాదాపు రూ.90 లక్షల మేర ఉండవచ్చని తెలుస్తోంది. ఇకపోతే 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన ఎలోన్ సినిమాలో బిపాసా, కరణ్ జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొంతకాలం పాటు డేటింగ్ చేసిన వీరు 2016లో పెళ్లిపీటలెక్కారు. వీరికి గతేడాది నవంబర్ 12న పాప పుట్టింది. ఆమెకు దేవి బసు సింగ్ గ్రోవర్ అని నామకరణం చేశారు. బిపాషా సినిమాల విషయానికి వస్తే ఆమె తెలుగులో టక్కరి దొంగ సినిమాలో మహేశ్‌బాబుతో జోడీ కట్టింది. హిందీలో రాజ్, జిస్మ్ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది బిపాషా. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) చదవండి: 29 ఏళ్ల ప్రేయసితో డేటింగ్.. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి -
బిపాసా... గోగోగో.. గోవా
బాలీవుడ్ హాట్ బ్యూటీ గర్ల్ బిపాసబసు తన బాయ్‌ఫ్రెండ్ కరన్ సింగ్ గ్రోవర్తో కలిసి గోవా బీచుల్లో షికార్ల కోసం వెళ్లిందట. ఇటీవల ఈ జంట బాగా సన్నిహితంగా ఉంటున్నారని బాలీవుడ్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తన రెండో భార్యతో విడిపోయిన కరన్ సింగ్ ఈ ఫిబ్రవరి 23న పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నాడు. అయితే, బిపాస అతను కలిసి ఈ మధ్య ఎలోన్ అనే హిందీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఈ సినిమాలో చాలా చక్కగా కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని కొందరు దర్శకులు కితాబిచ్చారట. ఫలితంగా వారిద్దరి మధ్య చనువు అతిగా పెరిగిందంటున్నారు కొందరు. దీంతో గోవా బీచుల్లో అర్థరాత్రి కరన్‌తో కేక్ కట్ చేయించేందుకు తన స్నేహితులు డిజైనర్ రాకీ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డియానే పాండే, మరో మోడల్ క్యాండిస్ పింటోతో కలిసి రయ్‌మని దూసుకెళ్లే కారులో రోడ్డు వెంట బీచులో షికారుకెళ్లిందట.. గతంలో ఈ అమ్మడు జాన్ అబ్రహాం, హార్మన్ భవేజాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే.