'నా పెళ్లిని హాట్ టాపిక్ చేయవద్దు'
గత కొన్ని రోజుల కిందట సాగర తీరంలో రొమాన్స్ చేస్తూ బాలీవుడ్ తార బిపాషాబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ దిగిన ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హాలిడే ట్రిప్స్‌లో హాట్‌హాట్ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు చేసుకుంటారా? అనే చర్చ జరిగింది. తాజాగా బిపాషాబసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల వివాహం జరిగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కనీసం వారికి ఎంగేజ్ మేంట్ అయినా అయ్యుంటుంది అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై బిపాషా కాస్త ఘాటుగానే స్పందించింది. తన పెళ్లి, జీవితం గురించి కొన్ని వివరాలు చెబుతూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి ఇప్పుడే నిర్ణయానికి రాలేదని, ఇది తన జీవితమని అంటోంది. తనను ప్రేమించేవాళ్లకు ఇది తన విజ్ఞప్తి అంటూ ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయవద్దని కోరింది.
తాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానంది. తమ వ్యవహారాన్ని హాట్ టాపిక్ గా మారుస్తున్నారని చెప్పింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చియించుకుంటే ఆ విషయాన్ని మీకు కచ్చితంగా చెబుతాను అని పేర్కొంది. అయిస్తే కాస్త ఓపిక పట్టాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ఈ అమ్మడు. తనకు సహకరించేవారికి ధన్యవాదాలు అంటూ ట్విట్ లో రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ నటి. గతంలో జాన్ అబ్రహాంతో ఓ రేంజ్‌లోనే ప్రేమ కథ నడిపి, అతడి నుంచి విడిపోయింది బిపాషా. జాన్‌తో ఉన్నట్లు కాకపోయినా ఆ తర్వాత హర్మన్ బవేజాతో కొన్ని రోజులు ప్రేమకథ నడిపి అతడికి గుడ్ బై చెప్పేసింది. ఇకపోతే కరణ్‌సింగ్ గ్రోవర్ తన మొదటి భార్య జెన్నిఫర్ వింగెట్ నుంచి 2014లో విడిపోయారు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే బిపాసాతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే.
Wait for me 2announce my wedding when I want to n if I want to.Please stop treating it frivolously.
— Bipasha Basu (@bipsluvurself) March 6, 2016
For years I have dealt with this constant discussion.Please be patient. After all it's my life:) Thank you all.
— Bipasha Basu (@bipsluvurself) March 6, 2016