మాజీ భర్తకు పెళ్లి విషెష్ చెప్పిన నటి
తన మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లిపై బాలీవుడ్ నటి జెన్నిఫర్ వింగెట్ మౌనం వీడింది. హారర్ క్వీన్ బిపాసా బసును పెళ్లాడబోతున్న కరణ్ కు ఆమె విషెస్ చెప్పింది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించింది. బిపాసా, కరణ్ శనివారం(ఏప్రిల్ 30) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపింది.
హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపాసా-కరణ్ పెళ్లి గురించి జెన్నిఫర్ ను అడగ్గా... 'ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనసులు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. వారికి దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రేమ అనేది ఓ అద్భుతం. ఎవరిపైన అయిన మనకు ప్రేమ పుడితే అది గొప్ప విషయమే' అని బదులిచ్చింది.
కాగా, జెన్నిఫర్ ను పెళ్లి చేసుచేసుకుని తప్పు చేశానని కరణ్ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన అతడు ఇప్పుడు బిపాసాతో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అయ్యాడు.