ఆన్లైన్ లాటరీ స్కాం బాధితుల్లో బాలీవుడ్ కరణ్ సింగ్ గ్రోవర్ చేరారు.
ముంబై: ఆన్లైన్ లాటరీ స్కాం బాధితుల్లో బాలీవుడ్ కరణ్ సింగ్ గ్రోవర్ చేరారు. 5.6 లక్షల రూపాయలు మోసపోయినట్టు కరణ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరణ్కు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందంటూ ఓ ఈమెయిల్ వచ్చింది. ఈ డబ్బు తీసుకునే ప్రక్రియలో భాగంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లించాలని లాటరీ నిర్వాహకులు కోరారు. కరణ్ వారికి 5.60 లక్షలు చెల్లించారు. అయితే తనకు లాటరీ డబ్బును పంపలేదని, సంప్రదించేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అందుబాటులోకిరాలేదని కరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ చిత్రం అలోన్లో కరణ్, బిపాసా బసు సరసన నటించారు.