నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్ | B-Town congratulates Bipasha-Karan on their marriage | Sakshi
Sakshi News home page

నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్

May 1 2016 6:59 PM | Updated on Sep 3 2017 11:12 PM

నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్

నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్

నవ దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసులకు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ముంబై: నవ దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసులకు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కరణ్-బిపాసా శనివారం సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ కు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు సినిమా తారలు హాజరయ్యారు. రిసెప్షన్ కు వెళ్లలేకపోయిన వారు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు.

ప్రియాంక చోప్రా: కంగ్రాట్యులేషన్స్ బిపాసా-కరణ్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. మీకు వివాహ శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసుండాలని ఆకాంక్షిస్తున్నాను.

అభిషేక్ బచ్చన్: బిపాసా-కరణ్ లకు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఒక్కటవడం ఆనందదాయకం. వివాహితుల క్లబ్ లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నా.

శిల్పాషెట్టి: పరస్పర విశ్వాసం, ప్రేమ, స్నేహం, సెలబ్రేషన్ తో బిపాసా-కరణ్ వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా.

మధు బండార్కర్, షమితా షెట్టి, ఫరాఖాన్, విశాల్ పాండ్యా, రమేశ్ తౌరణి తదితరులు బిపాసా-కరణ్ దంపతులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement