marriage wishes
-
బుమ్రా 'ప్యా'ర్కర్కు సంజన క్లీన్ బౌల్డ్..
ముంబై: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ప్రేయసి సంజన గణేశన్ సంధించిన 'ప్యా'యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా.. తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను ఇవాళ గోవాలో వివాహం చేసుకున్న నేపథ్యంలో సన్నిహితుల శుభాకాంక్షలతో ఈ జంట తడిసి ముద్దవుతోంది. వీరి జంట వివాహం చేసుకోబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిమానుల కోసం బుమ్రా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను షేర్ చేయడంతో అతని సన్నిహితులు, పలువురు క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు వీరికి విషెస్ చెబుతున్నారు. Many congratulations on the start of this beautiful journey. Wishing you both a lifetime of happiness.❤️ https://t.co/MdkdKbwFjj — BCCI (@BCCI) March 15, 2021 Bumrah bowled over by Sanjana 💥 Here's wishing love, laughter and a happily ever after for @Jaspritbumrah93 and @SanjanaGanesan 👩❤️👨 #OneFamily #MumbaiIndians pic.twitter.com/tbJ3YXhN2I — Mumbai Indians (@mipaltan) March 15, 2021 Congratulations @Jaspritbumrah93 and @SanjanaGanesan 💐 Best wishes for a wonderful life together! https://t.co/go7ELMkPJM — ICC (@ICC) March 15, 2021 -
సింగర్ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయనీ సునీత ఇటీవల మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సునీతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహమని తెలిసిందే. దీంతో ఎదిగిన పిల్లల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లి చేసుకొవడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీటర్ వేదికగా సునీత-రామ్‌లకు ఆయన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అలా.. రామ్‌తో పరిచయం ఏర్పడింది: సునీత) Happy Married Life to You Two @OfficialSunitha & @ramveerapaneni pic.twitter.com/OEPMKxZnxl — Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2021 -
కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్
సాక్షి, హైదరాబాద్: నూతన వధూవరులను వీడియో కాలింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ శుక్రవారం ఉమారాణిని పెళ్లి చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. (ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకు వచ్చాం..) -
ఆయన మ్యారేజ్ లైఫ్ బాగుండాలి: హీరోయిన్
మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్ లు అందుకున్న హీరోయిన్ మెహరీన్. ఆమె ఓ పెళ్లికి వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం మహానుభావుడు. ఆ మూవీకి అసోసియేట్ డైరెక్టర్‌గా రాము పనిచేశారు. ఆయన పెళ్లి వేడుకకు హాజరైన ఈ నటి ఆయన వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 'తాను నటించిన మూవీ మహానుభావుడు మూవీకి పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్లలో ఒకరైన రాము వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటూ' నటి మెహరీన్ ట్వీట్ చేశారు. Ramu Garu - One of the finest Associate Director I’ve worked with on one of my best film #Mahanubhavudu Wishing him a very Happy & Prosperous Married Life! 🎉 pic.twitter.com/cxcoLm0eDY — Mehreen Pirzada (@Mehreenpirzada) 28 April 2018 -
నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్
ముంబై: నవ దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసులకు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కరణ్-బిపాసా శనివారం సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ కు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు సినిమా తారలు హాజరయ్యారు. రిసెప్షన్ కు వెళ్లలేకపోయిన వారు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు. ప్రియాంక చోప్రా: కంగ్రాట్యులేషన్స్ బిపాసా-కరణ్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. మీకు వివాహ శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసుండాలని ఆకాంక్షిస్తున్నాను. అభిషేక్ బచ్చన్: బిపాసా-కరణ్ లకు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఒక్కటవడం ఆనందదాయకం. వివాహితుల క్లబ్ లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నా. శిల్పాషెట్టి: పరస్పర విశ్వాసం, ప్రేమ, స్నేహం, సెలబ్రేషన్ తో బిపాసా-కరణ్ వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా. మధు బండార్కర్, షమితా షెట్టి, ఫరాఖాన్, విశాల్ పాండ్యా, రమేశ్ తౌరణి తదితరులు బిపాసా-కరణ్ దంపతులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.