బుమ్రా 'ప్యా'ర్కర్‌కు సంజన క్లీన్‌ బౌల్డ్‌.. | Wishes For Newly Married Couple Bumrah And Sanjana Ganesan | Sakshi
Sakshi News home page

బుమ్రా 'ప్యా'ర్కర్‌కు సంజన క్లీన్‌ బౌల్డ్‌..

Mar 15 2021 6:29 PM | Updated on Mar 15 2021 9:09 PM

Wishes For Newly Married Couple Bumrah And Sanjana Ganesan - Sakshi

ముంబై: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ప్రేయసి సంజన గణేశన్‌ సంధించిన 'ప్యా'యార్కర్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా.. తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను ఇవాళ గోవాలో  వివాహం చేసుకున్న నేపథ్యంలో సన్నిహితుల శుభాకాంక్షలతో ఈ జంట తడిసి ముద్దవుతోంది. వీరి జంట వివాహం చేసుకోబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట హల్‌చల్‌ చేసిన నేపథ్యంలో ఇవాళ ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిమానుల కోసం బుమ్రా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను షేర్ చేయడంతో అతని సన్నిహితులు, పలువురు క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు వీరికి విషెస్‌ చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement