boolywood
-
‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’
ముంబయి: ‘ఆయన పుట్టిన రోజునాడు నా ప్రేమనంతా ఇవ్వడంతోపాటు, గౌరవాన్ని కూడా ఇచ్చేస్తాను’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గర్ల్ప్రెండ్గా వార్తల్లో చెక్కర్లు కొడుతున్న రష్యన్ భామ లులియా వాంతుర్ చెప్పింది. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సంబంధాన్ని గురించి సల్మాన్ ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ లులియా మాత్రం అప్పుడు సల్మాన్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. సోమవారం రాత్రి సాన్ సూయి స్టార్ డస్ట్ అవార్డు కార్యక్రమానికి రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న ఈ అమ్మడు సల్మాన్‌కు త్వరలోనే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. ఈ నెల (డిసెంబర్) 27న కండల వీరుడు సల్మాన్ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పుట్టిన రోజున సల్మాన్‌కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ అక్కడి మీడియా ప్రశ్నించగా తొలుత కాస్తంత సిగ్గుపడినట్లు చేసిన ఈ భామ అనంతరం ‘ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్‌కు ఇచ్చేస్తాను’ అంటూ చెప్పింది. ఆ రోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.. చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఆరోజు అందరం కలిసే వేడుక జరుపుకుంటామని కెమెరాకు పోజివ్వకుండానే వెళ్లిపోయింది. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో సల్మాన్ కూడా ఉన్నాడు. ఆయన ముందే బాడీగార్డ్ చిత్రంలో తేరి మేరి ప్రేమ్ కహానీ అనే పాటను కూడా లులియా వినిపించి అబ్బురపరిచింది. -
ప్రతిరోజూ మహిళలకు అంకితం చేయండి: అమితాబ్
ప్రతిరోజునూ మహిళలకు అంకితం చేయండని ప్రముఖ బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఫరాహ్ ఖాన్, కరణ్ జోహార్ వంటి సినీ దిగ్గజాలు ట్విట్టర్లో స్పందించారు. కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే మహిళలకు అంకితం చేయబడింది? కానీ మహిళలు ప్రతి రోజూ తమ జీవితాన్ని అంకితం చేస్తారు అని అమితాబ్ బచ్చన్ ట్వీటగా.. మేమంతా ప్రతిరోజూ సాధికరతతో ముందుకొస్తున్నాం.. మాకు ఒక్కరోజే అంకితం చేయడమా.. ఒక్కరోజే కాదు మేమంతా ప్రతిరోజూ జరుపుకుంటాం.. ఆ శక్తి మాకు ఉంది అంటూ నటి సోనాక్షి సిన్హా అన్నారు. "మనదేశంలో మహిళలను దుర్గా శక్తితో సమానంగా భావిస్తారు. మీరంతా(పురుషులు) వారి సహకారంతో కష్టాలను దాటుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. అందరు అనుకునేదానికంటే కూడా మేం చాలా శక్తిమంతమైనవాళ్లం' అని ప్రముఖగాయని లతా మంగేష్కర్ అన్నారు. మరోపక్క నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం ఎత్తివేయాలని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేశారు. -
అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు
ముంబై: కరణ్ సింగ్ గ్రోవర్తో కలసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి ఇబ్బందీ పడలేదని బాలీవుడ్ బామ బిపాషా బసు చెబుతోంది. బిపాషా, కరణ్ నటించిన హర్రర్, రోమాంటిక్ సినిమా 'అలోన్' బిపాషా, కరణ్ ఘాటైన సన్నివేశాల్లో నటించారు. ఇటీవల విడుదలైన అలోన్ ట్రైలర్ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. భూషన్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమాలో బిపాషా అవిభక్త కవలలుగా నటించారు. అలోన్‌తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా అనిపించలేదని బిపాషా చెప్పారు. కేరళలో షూటింగ్ చిత్రీకరణకు వెళ్లేముందు అతనితో ఏర్పడిన స్నేహమే దీనికి కారణమి అంది. కాగా అవిభక్త కవలలుగా నటించడానికి కష్టపడ్డానని బిపాషా చెప్పింది. -
షారుక్ ఖాన్ బకరా!
‘నన్నేమైనా బకరా అనుకున్నావా...’ అని కొన్ని సందర్భాల్లో అంటుంటాం. ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడేమోననే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా అనడం సహజం. ఇప్పుడు బాలీవుడ్లో షారుక్ ఖాన్ కూడా ‘బకరా’ అయ్యారు. అయితే, ఆయన్ని ఎవరూ మోసం చేయలేదు. ‘యే హై బక్రాపూర్’ అనే సినిమాలో ఓ మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టారు. ఒక మధ్యతరగతి కుటుంబం, ఓ మేక చుట్టూ తిరిగే కథతో జానకి విశ్వనాథన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ ఎస్. అరుణాచలం నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టడంవల్ల ఆయనేమైనా ఫీలవుతారేమోనని దర్శక, నిర్మాతలు సందేహించారు. టైమ్ బాగాలేక షారుక్ అడ్డం తిరిగి, సినిమా విడుదలను అడ్డుకుంటారేమోనని భావించారు. దాంతో షారుక్ ఖాన్ మేనేజర్, ఆయన ఇతర బృందానికి ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నారు. షారుక్ గౌరవానికి భంగం కలిగేలా ఏదైనా సీన్ ఉందని ఆ బృందం భావిస్తే, మార్చేస్తారట. ఏదేమైనా ఆ మేక మాత్రం సెలబ్రిటీ అయ్యిందని చెప్పొచ్చు.. -
సల్మాన్ ఎందుకు వద్దంటున్నాడు..?
పస్తుతం బాలీవుడ్లో నంబర్‌వన్ హీరోయిన్ ఎవరు? అంటే... టక్కున వచ్చే సమాధానం దీపికా పదుకొనే. ఈ పొడవు కాళ్ల సుందరిని తమ సినిమాల్లో కథానాయికగా నటింపజేయాలని బాలీవుడ్ దర్శక, నిర్మాతలే కాదు, హీరోలు కూడా ప్రస్తుతం ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. ఓ హీరో మాత్రం ‘దీపికానా? నో.. నో.. నో.. నా సినిమాలో ఆ అమ్మాయిని హీరోయిన్గా అంగీకరించలేను’ అని సూటిగా చెప్పేసి బాలీవుడ్లో పెద్ద చర్చకే తెరలేపారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఆయన కథానాయకుడిగా సూరజ్ బరజాత్య ఓ చిత్రం చేయనున్నారు. ఆ సినిమాలో కథానాయికగా దీపికాను అనుకున్నారు. ఆ విషయం సల్మాన్ చెవిన పడగానే... వెంటనే అభ్యంతరం తెలియజేశారట. షారుక్ ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు దీపిక. రీసెంట్ సెన్సేషన్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’లో కూడా షారుక్, దీపికానే హీరోహీరోయిన్లు. ‘షారుక్‌ఖాన్ ప్రొడక్ట్ దీపిక’ అని బాలీవుడ్లో అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక షారుక్కీ సల్మాన్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే... దీపికను సల్మాన్ పక్కన పెట్టినట్లు బాలీవుడ్ టాక్. అయితే... సల్మాన్ మాత్రం ఈ విషయంపై వివరణ ఇస్తూ ‘దీపిక ప్రజెంట్లో చాలా బిజీ హీరోయిన్. నా సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంది. ఆమెను కథానాయికగా తీసుకుంటే డేట్స్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే వద్దన్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు’’ అని చెప్పారు. మరి ఈ అంశంపై మున్ముందు ఇంకెన్ని వార్తలొస్తాయో వేచి చూడాలి.