షారుక్ ఖాన్ బకరా! | hrukh Khan anyway! | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్ బకరా!

Published Mon, Mar 24 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

షారుక్ ఖాన్ బకరా!

షారుక్ ఖాన్ బకరా!

 ‘నన్నేమైనా బకరా అనుకున్నావా...’ అని కొన్ని సందర్భాల్లో అంటుంటాం. ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడేమోననే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా అనడం సహజం. ఇప్పుడు బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ కూడా ‘బకరా’ అయ్యారు. అయితే, ఆయన్ని ఎవరూ మోసం చేయలేదు. ‘యే హై బక్రాపూర్’ అనే సినిమాలో ఓ మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టారు.


ఒక మధ్యతరగతి కుటుంబం, ఓ మేక చుట్టూ తిరిగే కథతో జానకి విశ్వనాథన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ ఎస్. అరుణాచలం నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకకి షారుక్ ఖాన్ పేరు పెట్టడంవల్ల ఆయనేమైనా ఫీలవుతారేమోనని దర్శక, నిర్మాతలు సందేహించారు. టైమ్ బాగాలేక షారుక్ అడ్డం తిరిగి, సినిమా విడుదలను అడ్డుకుంటారేమోనని భావించారు. దాంతో షారుక్ ఖాన్ మేనేజర్, ఆయన ఇతర బృందానికి ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నారు. షారుక్ గౌరవానికి భంగం కలిగేలా ఏదైనా సీన్ ఉందని ఆ బృందం భావిస్తే, మార్చేస్తారట. ఏదేమైనా ఆ మేక మాత్రం సెలబ్రిటీ అయ్యిందని చెప్పొచ్చు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement