
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ గతేడాది జవాన్, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.
కేకేఆర్ విజయంతో బాలీవుడ్ బాద్‌షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్ వాచ్‌పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్‌గా గుర్తించారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.
ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దట్ ఇజ్ కింగ్ ఖాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్‌తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment