
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

తాజాగా షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె చెప్పింది. షారుఖ్‌పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ, ప్రార్ధనలు ఆయనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. కేకేఆర్ ఫైనల్స్ ఆడేటప్పుడు స్టాండ్స్‌లో నుంచి జట్టును ఉత్సాహపరుస్తాడని జట్టు సహ-యజమాని జుహీ చావ్లా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment