‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’ | Will gift all my love and respect to Salman on his bday: Iulia | Sakshi
Sakshi News home page

‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’

Published Tue, Dec 20 2016 11:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’

‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’

ముంబయి: ‘ఆయన పుట్టిన రోజునాడు నా ప్రేమనంతా ఇవ్వడంతోపాటు, గౌరవాన్ని కూడా ఇచ్చేస్తాను’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ గర్ల్‌ప్రెండ్‌గా వార్తల్లో చెక్కర్లు కొడుతున్న రష్యన్‌ భామ లులియా వాంతుర్‌ చెప్పింది. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్‌ సంబంధాన్ని గురించి సల్మాన్‌ ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ లులియా మాత్రం అప్పుడు సల్మాన్‌ పేరును నేరుగా ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. సోమవారం రాత్రి సాన్‌ సూయి స్టార్‌ డస్ట్‌ అవార్డు కార్యక్రమానికి రెడ్‌ కార్పెట్‌ స్వాగతం అందుకున్న ఈ అమ్మడు సల్మాన్‌కు త్వరలోనే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది.

ఈ నెల (డిసెంబర్‌) 27న కండల వీరుడు సల్మాన్‌ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పుట్టిన రోజున సల్మాన్‌కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ అక్కడి మీడియా ప్రశ్నించగా తొలుత కాస్తంత సిగ్గుపడినట్లు చేసిన ఈ భామ అనంతరం ‘ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్‌కు ఇచ్చేస్తాను’ అంటూ చెప్పింది. ఆ రోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.. చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఆరోజు అందరం కలిసే వేడుక జరుపుకుంటామని కెమెరాకు పోజివ్వకుండానే వెళ్లిపోయింది. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో సల్మాన్‌ కూడా ఉన్నాడు. ఆయన ముందే బాడీగార్డ్‌ చిత్రంలో తేరి మేరి ప్రేమ్‌ కహానీ అనే పాటను కూడా లులియా వినిపించి అబ్బురపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement