పెళ్లిపై స్పందించిన సల్మాన్‌ ప్రియురాలు! | Salman Khan Rumored Girlfriend Iulia Vantur Open Up On Her Marriage | Sakshi
Sakshi News home page

‘పెళ్లి కాదు ముఖ్యం.. భావాలు, సంబంధాలు’

Published Fri, May 8 2020 2:53 PM | Last Updated on Fri, May 8 2020 3:34 PM

Salman Khan Rumored Girlfriend Iulia Vantur Open Up On Her Marriage - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కండవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న లులియా వంతూర్‌ తన వివాహ విషయంపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, మీరు త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా అని అడగ్గా.. ఒక్కసారిగా పెద్దగా నవ్వి ఈ విషయాన్ని దాటేశారు. ఆ తర్వాత ‘వివాహం మాత్రమే  కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే  మనుషులు ఒకరిపై ఒకరికి ఎలాంటి భావనలు కలిగి ఉంటారు. వారు ఎంతకాలం కలిసి గడుపుతారన్న విషయం ముఖ్యమైనది. అందువల్ల కొన్ని సంబంధాలకు కొంత సమయం ఇవ్వాలన్నది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు. (పిల్ల‌ల నుంచే నేర్చుకుంటున్నా: న‌టుడు)

అంతేగాక ఈ మధ్య ఆమె తల్లిదండ్రులు తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని పదే పదే అడగడం ప్రారంభించారని కూడా చెప్పారు. ‘వారు అడిగిన మరుసటి రోజే నేను పెళి చేసుకోవచ్చు. కానీ ఆ పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఈ సమాధానం నా తల్లిదండ్రులు వింటే వారు ఇక దీనిపై నన్ను ప్రశ్నించరనే అభిప్రాయపడుతున్నాను’ అని తెలిపారు. కాగా లులియా వంతూర్‌, సల్మాన్‌ ఖాన్‌లు కొంతకాలంగా పన్వెల్‌లోని తమ ఫామ్‌హౌజ్‌లో సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే భాయిజాన్‌, లులియాను పెళ్లి చేసుకుబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటీ వరకు భాయిజాన్‌ ఈ విషయంపై స్పష్టతను ఇవ్వలేదు.  ఇక తన పెళ్లెప్పుడు అని అడిగినప్పుడల్లా తనకు పెళ్లి వద్దు కానీ.. పిల్లలు కావాలంటూ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమాధానం చెప్పకనే చెప్పాడు.

చిరు చిత్రంలో సల్మాన్‌?.. ఇదిగో క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement