ప్రతిరోజూ మహిళలకు అంకితం చేయండి: అమితాబ్ | One day not enough to celebrate women: Bolly wood | Sakshi
Sakshi News home page

ప్రతిరోజూ మహిళలకు అంకితం చేయండి: అమితాబ్

Published Sun, Mar 8 2015 1:47 PM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

ప్రతిరోజూ మహిళలకు అంకితం చేయండి: అమితాబ్ - Sakshi

ప్రతిరోజూ మహిళలకు అంకితం చేయండి: అమితాబ్

ప్రతిరోజునూ మహిళలకు అంకితం చేయండని ప్రముఖ బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఫరాహ్ ఖాన్, కరణ్ జోహార్ వంటి సినీ దిగ్గజాలు ట్విట్టర్లో స్పందించారు. కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే మహిళలకు అంకితం చేయబడింది? కానీ మహిళలు ప్రతి రోజూ తమ జీవితాన్ని అంకితం చేస్తారు అని అమితాబ్ బచ్చన్ ట్వీటగా.. మేమంతా ప్రతిరోజూ సాధికరతతో ముందుకొస్తున్నాం.. మాకు ఒక్కరోజే అంకితం చేయడమా.. ఒక్కరోజే కాదు మేమంతా ప్రతిరోజూ జరుపుకుంటాం.. ఆ శక్తి మాకు ఉంది అంటూ నటి సోనాక్షి సిన్హా అన్నారు.  

"మనదేశంలో మహిళలను దుర్గా శక్తితో సమానంగా భావిస్తారు. మీరంతా(పురుషులు)  వారి సహకారంతో కష్టాలను దాటుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. అందరు అనుకునేదానికంటే కూడా మేం చాలా శక్తిమంతమైనవాళ్లం' అని ప్రముఖగాయని లతా మంగేష్కర్ అన్నారు. మరోపక్క నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం ఎత్తివేయాలని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement