11-Year-Old Ukraine Boy Travels: రష్యా ఉక్రెయిన్‌పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. దీంతో వేలాది మంది పొరుగు దేశాలకు పారిపోయి తలదాచుకున్నవారు కొందరు. మరి కొంతమంది బంకర్లలో తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే గత వారం రష్యా దళాలు ఆగ్నేయ ఉక్రెయిన్‌లో జాపోరిజ్జియాను స్వాధీనం చేకున్నారు. అదే నగరానికి చెందిన ఒక ఉక్రెయిన్ కుటుంబం రష్యా దాడి నుంచి తప్పించుకునేందుకు తమ కొడుకుని స్లోవేకియాలోని తమ బంధువుల వద్దకు రైలులో ఒంటరిగా పంపించింది.
అంతేకాదు ఆ బాలుడు తన బంధువులను చేరుకునేలా అతని తల్లి చేతిపై ఒక ఫోన్ నెంబర్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, చిన్న కాగితం ముక్క, పాస్‌పోర్ట్ ఇచ్చి పంపించింది. అయితే ఆ బాలుడు ఒంటరిగా సుమారు వెయ్యి కి.మీ పయనించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ మేరకు సరిహద్దులోని అధికారులు ఆ బాలుడు స్లోవేకియాకు చేరుకున్నప్పుడు అతని వద్ద ఉన్న మడతపెట్టిన కాగితం ముక్కతో రాజధాని బ్రాటిస్లావాలోని అతని బంధువులను సంప్రదించి ఆ బాలుడిని అప్పగించారు.
అంతేకాదు ఆ బాలుడి తల్లి అతనిని జాగ్రత్తగా చూసుకున్నందుకు స్లోవాక్ ప్రభుత్వానికి పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం కూడా పంపింది. ఆ బాలుడు తన చిరునవ్వు, నిర్భయత, ధృఢ సంకల్పంతో అధికారుల మనసులను గెలుచుకున్నాడు. అంతేగాదు స్లోవేకియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఆ బాలుడిని "ది బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్" అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. ఆ బాలుడి కుటుంబంలోని ఒక బంధువుకి అనారోగ్యంతో ఉండటంతో అతని తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో వారు తమ కొడుకును ఒంటరిగా స్లోవేకియాకు పంపిచారు.
(చదవండి: పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం!)
Comments
Please login to add a commentAdd a comment