Slovakia
-
స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స
బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను బన్స్కా బి్రస్టికాలోని ఎఫ్.డి.రూజ్వెల్ట్ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్ తీశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్వెల్ట్ ఆసుపత్రి డైరెక్టర్ మిరియమ్ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
ప్రేగ్: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని, ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్ తరాబా మీడియాకు తెలిపారు.దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో నిన్న మధ్యాహ్నాం ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. సమావేశ ముగిశాక బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ప్రధాని ఫికోను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బన్స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రిలో ఫికోను సర్జరీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని, ప్రధాని కడుపులో బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024ఇక కాల్పులకు సంబంధించి స్పాట్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. నిందితుడ్ని జురాజ్ సింటులా(71)గా నిర్ధారించారు. అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబర్ట్ ఫికో గురించి.. 1964 చెకోస్లోవేకియాలో రాబర్ట్ ఫికో జన్మించారు.ఫికోకు భార్యా, కొడుకు ఉన్నారు. ఫికో రష్యా అనుకూలవాది. ఉక్రెయిన్ యుద్ధం నుంచి పుతిన్‌కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాలుగో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై.. 1992లో డెమొక్రటిక్ లెఫ్ట్ పార్టీ తరఫున తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. 1990లో.. యూరోపియన్ మానవ హక్కుల సంఘాలకు స్లోవేకియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1999లో.. స్మెర్(Direction – Social Democracy) పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ పార్టీకి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 2006 నుంచి 2010 దాకా, ఆపై 2012 నుంచి 2016, 2016 నుంచి 2018 ప్రధానిగా పని చేశారు. 2014లో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడారు.ఈయన హయాంలోనే స్లోవేకియా నాటోతో పాటు యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశంగా మారింది. అధికారంలో ఉండగా.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారనే విమర్శ ఒకటి ఫికోపై బలంగా వినిపిస్తుంది. జర్నలిస్టులపై దాడులు చేసేందుకు క్రిమినల్ గ్యాంగ్‌లను సైతం ప్రొత్సహించారనే అభియోగాలు ఆయనపై నమోదు అయ్యాయి కూడా. అధికారం కోసం సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాదంటూ ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శిస్తుంటాయి. స్లోవేకియా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ జాన్ కుసియాక్‌తో పాటు అతనికి కాబోయే భార్య హత్య కేసు దుమారం రేపడంతో.. 2018లో ఫికో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన ఫికో.. కిందటి ఏడాది జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా అనుకూలవాదం, అమెరికా వ్యతిరేక నినాదాలతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించడం ఆపేస్తానని చెబుతూ.. ఈ యుద్ధ సంక్షోభానికి నాటో, అమెరికాకే కారణమంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ హింస స్లోవేకియాకు కొత్తేం కాదు. అందుకే ఆ దేశ ప్రజలకు ప్రధానిపై జరిగిన దాడి పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు. -
స్లొవాకియా ప్రధానిపై కాల్పులు
ప్రేగ్: స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై హత్యాయత్నం జరిగింది. ఆయన బుధవారం మధ్యాహ్నం హండ్లోవా నగరంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ భవనం బయట గుమిగూడిన అభిమానులకు అభివాదం చేస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో ఆయనపై నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఫికోను హుటాహుటిన బాన్స్క్ బై్రస్టికాలోని ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రధాని అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తూటాలు పొట్టలోంచి దూసుకుపోయినట్టు చెబుతున్నారు. ఫికో తలకు, ఛాతీకి కూడా గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అనుమానితున్ని ప్రధాని బాడీగార్డులతో పాటు అభిమానులు నిర్బంధించినట్టు సమాచారం. దీన్ని దేశ ప్రజాస్వామ్యంపైనే దాడిగా అధ్యక్షురాలు జుజానా కపుటోవా అభివరి్ణంచారు. దుండగునిగా భావిస్తున్న 71 ఏళ్ల అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అతను రచయిత అని, ప్రత్యర్థి పారీ్టకి చెందిన రాజకీయ కార్యకర్త అని రకరకాలుగా వార్తలొస్తున్నాయి. దుండగుడు తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాడికి కారణం తెలియరాలేదు. దాడి సమయంలో స్లొవాకియా పార్లమెంటు సమావేశాలు జరుగుతు న్నాయి. ఘటనపై స్పీకర్ ప్రకటన అనంతరం సభ వాయిదా పడింది. మూడు వారాల్లో యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఫికో పారీ్టతో కూడిన అతివాద పక్షాల కూటమిదే పై చేయి అవుతుందని భావిస్తున్న వేళ ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.రష్యా అనుకూలుడు ఫికో రష్యా అనుకూలునిగా పేరుబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు. గత సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రష్యా అనుకూల, అమెరికా వ్యతిరేక ప్రచారంతో తన జాతీయవాద సంకీర్ణ కూటమికి విజయం సాధించిపెట్టి మూడోసారి ప్రధాని అయ్యారు. వెంటనే ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లొవాకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరపడుతుందని, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రతను ఆయన ప్రమాదంలోకి నెడతారని విమర్శకులు అంటున్నారు. ఫికో విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజధానిలో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగింది. ఫికో, దేశాధ్యక్షుడు కపుటోవా రాజకీయ ప్రత్యర్థులు. ఫికో రాజకీయ మిత్రుడైన పీటర్ పలెగ్రినీ ఇటీవలే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెను ముప్పుకు ఫికోపై దాడి తాజా ఉదాహరణ అని పలెగ్రినీ అన్నారు. రాజకీయ అభిప్రాయాలను పోలింగ్ బూత్‌ల్లో కాకుండా ఇలా తూటాల ద్వారా వ్యక్తం చేస్తూ పోతే దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషి మట్టిపాలవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. చెకస్లొవాకియా 1992లో చెక్ రిపబ్లిక్, స్లొవాకియాగా విడిపోవడం తెలిసిందే. -
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు. -
స్లొవేకియాలో రష్యా అనుకూలవాది గెలుపు
ప్రేగ్: యూరప్‌లోని చిన్న దేశం స్లొవేకియాలో ఎన్నికల ఫలితాలు అమెరికా, యూరప్ దేశాలకు కంగారు పుట్టిస్తున్నాయి. రష్యా అనుకూల మాజీ ప్రధాని రాబర్ట్ ఫికోకు చెందిన వామపక్ష స్మెర్(డైరెక్షన్)పార్టీ తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు మొదట్నుంచీ పొరుగునే ఉన్న స్లొవేకియా మద్దతుగా నిలుస్తోంది. ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ శరణార్థుల కోసం సరిహద్దులను తెరిచి ఉంచింది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరించుకుంటామని, వలసలను అడ్డుకుంటామని, రష్యాపై ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రజలకు ఫికో హామీ ఇచ్చారు. గతంలో రెండు పర్యాయాలు ఫికో ప్రధానిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ ఫికోయే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. స్లొవేకియా ఎన్నికల ఫలితాల గెలుపు ప్రభావం జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్ వంటి దేశాల్లో మరికొద్ది రోజుల్లో జరగనున్న జాతీయ, ప్రాంతీయ ఎన్నికలపై పడుతుందన్నది పరిశీలకుల అంచనా. -
ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ
కీవ్: అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ముందస్తు ప్రకటన లేకుండానే ఆమె ఇక్కడికి రావడం గమనార్హం. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్‌లోని ఉజ్హొరోత్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్స్కీతో సమావేశమయ్యారు. మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని పునరుద్ఘాటించారు. జిల్ బైడెన్, ఒలెనా జెలెన్స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు. యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా మీడియాతో మాట్లాడారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ కూడా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కెనడా ప్రధాని కూడా... రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. రష్యా దాడుల్లో ఈ పట్టణం ఇప్పటికే చాలావరకు ధ్వంసమయ్యింది. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. -
11 ఏళ్ల బాలుడు ఒంటరిగా వెయ్యి కి.మీ పయనించాడు! ఎందుకో తెలుసా
11-Year-Old Ukraine Boy Travels: రష్యా ఉక్రెయిన్‌పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. దీంతో వేలాది మంది పొరుగు దేశాలకు పారిపోయి తలదాచుకున్నవారు కొందరు. మరి కొంతమంది బంకర్లలో తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే గత వారం రష్యా దళాలు ఆగ్నేయ ఉక్రెయిన్‌లో జాపోరిజ్జియాను స్వాధీనం చేకున్నారు. అదే నగరానికి చెందిన ఒక ఉక్రెయిన్ కుటుంబం రష్యా దాడి నుంచి తప్పించుకునేందుకు తమ కొడుకుని స్లోవేకియాలోని తమ బంధువుల వద్దకు రైలులో ఒంటరిగా పంపించింది. అంతేకాదు ఆ బాలుడు తన బంధువులను చేరుకునేలా అతని తల్లి చేతిపై ఒక ఫోన్ నెంబర్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, చిన్న కాగితం ముక్క, పాస్‌పోర్ట్ ఇచ్చి పంపించింది. అయితే ఆ బాలుడు ఒంటరిగా సుమారు వెయ్యి కి.మీ పయనించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ మేరకు సరిహద్దులోని అధికారులు ఆ బాలుడు స్లోవేకియాకు చేరుకున్నప్పుడు అతని వద్ద ఉన్న మడతపెట్టిన కాగితం ముక్కతో రాజధాని బ్రాటిస్లావాలోని అతని బంధువులను సంప్రదించి ఆ బాలుడిని అప్పగించారు. అంతేకాదు ఆ బాలుడి తల్లి అతనిని జాగ్రత్తగా చూసుకున్నందుకు స్లోవాక్ ప్రభుత్వానికి పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం కూడా పంపింది. ఆ బాలుడు తన చిరునవ్వు, నిర్భయత, ధృఢ సంకల్పంతో అధికారుల మనసులను గెలుచుకున్నాడు. అంతేగాదు స్లోవేకియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఆ బాలుడిని "ది బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్" అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొంది. ఆ బాలుడి కుటుంబంలోని ఒక బంధువుకి అనారోగ్యంతో ఉండటంతో అతని తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో వారు తమ కొడుకును ఒంటరిగా స్లోవేకియాకు పంపిచారు. (చదవండి: పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం!) -
సింధు, శ్రీకాంత్ ముందుకు...
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటను భారత స్టార్ పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ తెలుగు తేజం మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 21–7, 21–9తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై అలవోకగా గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు కేవలం 24 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి కథను ముగించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ ర్యాంక్‌లో ఉన్న రెపిస్కా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించింది. తొలి గేమ్‌లో స్కోరు 5–4 వద్ద సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా 12 పాయింట్లు గెలిచి 17–4తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో గేమ్‌లోనూ ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తన జోరు కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ముందంజ వేసిన సింధు అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ చోచువోంగ్ (థాయ్ లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 4–3తో ఆధిక్యంలో ఉంది. చెమటోడ్చి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, భారత యువతార లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చోటు సంపాదించారు. రెండో రౌండ్ అడ్డంకిని దాటడానికి వీరిద్దరూ తీవ్రంగా శ్రమించారు. ప్రపంచ 63వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–18, 21–17తో గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయి రెండో గేమ్‌లో ఒకదశలో 6–9తో వెనుకంజలో ఉన్నాడు. ఈ దశలో శ్రీకాంత్ చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అదే ఉత్సాహంలో శ్రీకాంత్ రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 10–13తో వెనుకబడిన దశలో మళ్లీ విజృంభించాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–13తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గట్టెక్కాడు. 82 నిమిషాల్లో... ప్రపంచ 17వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 15–21, 21–18తో విజయం సాధించాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 13–10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని లక్ష్య సేన్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లూ గ్వాంగ్ జు (ౖచైనా)తో శ్రీకాంత్; కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)తో లక్ష్య సేన్ తలపడతారు. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సాత్విక్–చిరాగ్ ద్వయం 43 నిమిషాల్లో 27–25, 21–17తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో అనుష్క పారిఖ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 8–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కారు గాల్లో ఎగిరిపోతే?
కారుకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేస్తాయి. కారు అట్లానే గాల్లోకి ఎగిరి.. హాయిగా చక్కర్లు కొడుతుంది. ఊరవతలో, మరో సిటీలోనో రోడ్డుపై అట్లా ల్యాండ్ అవుతుంది. ఎప్పట్లా మారిపోయి ఇంటికెళ్లిపోతుంది. ఇదేదో హాలీవుడ్ సినిమాలో సీన్లా ఉందికదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. స్లొవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ కంపెనీ రూపొందించిన ‘ఎయిర్ కార్’ ఇటు కార్లా ప్రయాణించి, అటు చిన్న విమానంలా గాల్లో ఎగిరింది. 160 హెచ్‌పీ సామర్థ్యమున్న బీఎండబ్ల్యూ ఇంజిన్‌తో దీనిని రూపొందించారు. సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. ఇద్దరు ప్రయాణిం చొచ్చు. స్లొవేకియాలోని నిట్రా సిటీ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్‌కార్.. 8 వేల అడుగుల (సుమారు రెండున్నర కిలోమీటర్లు) ఎత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 35 నిమిషాల తర్వాత బ్రటిస్లావా నగరంలో ల్యాండ్ అయింది. కారులా ప్రయాణిస్తున్నప్పుడు దీని రెక్కలు రెండు వైపులా పక్కకు ముడుచుకుంటాయి. గాల్లో ఎగిరే ముందు విచ్చుకుంటాయి. ఇదంతా మూడు నిమిషాల్లో జరిగిపోతుంది. ప్రస్తుతం ప్రయోగం చేసింది ప్రొటోటైప్ అని.. అసలు ఎయిర్‌కార్‌ను 300 హెచ్‌పీ ఇంజిన్‌తో రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. అది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని.. ఏడాదిలోపు దీనిని మార్కెట్లోకి తీసుకొ స్తామని వెల్లడించింది. ధర ఎంత ఉంటుందన్న వివరాలేమీ వెల్లడించలేదు. -
లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్!
రెండో ప్రపంచ యుద్ధంలో మృత్యు కుహరాలుగా నిలిచిన నాజీ క్యాంపులు చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన సంగతి తెలిసిందే. శత్రుదేశాల ప్రజలు, సైనికులు, ముఖ్యంగా యూదులను విషవాయువులు నింపిన గ్యాస్ చాంబర్లలోకి తరలించి అత్యంత క్రూరంగా చంపేసే కేంద్రాలే నాజీ శిబిరాలు. అలాంటి ఓ క్యాంపులో నుంచి బయటపడడమే కాక, అక్కడి దారుణాలను ప్రపంచానికి వెల్లడించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడి చరిత్రకెక్కారు.. ఆల్ఫ్రెడ్ వెజ్లర్, రుడాల్ఫ్ వెబా. వీరిద్దరూ స్లొవేకియాకు చెందిన యూదులు. ఒకరికొకరికి పరిచయం లేదు. యుద్ధ సమయంలో జర్మనీ సైనికులకు చిక్కారు. వీరిని అప్పటి జర్మనీ ఆక్రమిత పోలాండ్లోని ఆస్చ్విజ్ డెత్ క్యాంపులోకి తరలించారు. అక్కడ కలసిన వీరు, జర్మన్ సైనికుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించారు. ఓ రోజు తప్పించుకొని, శిబిరానికి బయట కొద్ది దూరంలో ఉన్న ఓ కట్టెల కుప్ప మధ్యలో దాక్కున్నారు. ఇలా గంటా రెండు గంటలు కాదు ఏకంగా నాలుగు రోజులపాటు నాజీ సైనికుల కంటపడకుండా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడి, వందలాది మైళ్లు నడిచి స్లొవేకియాకు చేరుకున్నారు. నాజీ క్యాంపుల్లోని దారుణాలపై ఒక నివేదిక తయారుచేశారు. ఇది వెబా-వెజ్లర్ రిపోర్ట్‌గా పేరు పొందింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్ వేదికగా మీడియాకు విడుదల చేయడంతో నాజీల అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి. ఫలితంగా గ్యాస్ చాంబర్లలో యూదుల ఊచకోతకు అడ్డుకట్ట పడింది. ఆ విధంగా వెజ్లర్-వెబా(ఆస్చ్విజ్) రిపోర్ట్ లక్షల మంది ప్రాణాలు నిలిపింది. చదవండి: నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే.. -
స్లొవేనియా ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరభ్ వర్మ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. శనివారం ముగిసిన స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్‌గా చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో టాప్ సీడ్ సౌరభ్ 21–17, 21–12తో నాలుగో సీడ్ మినోరు కొగా (జపాన్)పై నెగ్గాడు. మహిళల డబుల్స్ విభాగంలో దండు పూజ–సంజన (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో టాప్ సీడ్ పూజ–సంజన జోడీ 14–21, 20–22తో జెన్నీ మూర్–విక్టోరియా (ఇంగ్లండ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
ఒళ్లు గగుర్పొడిచే కారు ప్రమాదం
-
వైరల్ : ఒళ్లు గగుర్పొడిచే కారు ప్రమాదం
బ్రేటిస్లావ : సినిమాటిక్ తరహాలో చోటుచేసుకున్న ఓ కారు ప్రమాదం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ప్రమాదం చూస్తే అతివేగం ఎంత ప్రమాదమో తెలుస్తోంది. అతివేగానికి నిర్లక్ష్యం కూడా తోడైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అద్దపడుతోంది. స్లోవేకియాలోని బ్రేటిస్లావ నగరంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోను స్లోవేకియా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. గత గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనలో.. అతివేగంగా దూసుకొస్తున్న బీఎమ్‌డబ్లూ కారు ఒక్కసారిగా గాల్లోకి లేచి టన్నెల్‌ను ఢీకొట్టింది. 360 డిగ్రీలు పల్టీ కొట్టి టన్నెల్ లోపల పడిపోయింది. కారు టన్నెల్ పై భాగాన్ని తాకడంతోనే భారీగా మంటలు చెలరేగాయి. సెకన్లలోనే కారు నుజ్జునుజ్జైంది. ఆ సమయంలో మరో వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదృష్టవశాత్తు డ్రైవర్(44) కూడా చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా కారునడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్లోవేకియా పోలీసులు పేర్కొన్నారు. -
ఫైనల్లో దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ దీపక్ పూనియా పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. స్లొవేకియాలో జరుగుతున్న ఈ పోటీల్లో దీపక్ ఫ్రీస్టయిల్ 86 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో దీపక్ 6–2తో ఇవాన్ నెడాల్కో (మాల్డోవా)పై గెలుపొందాడు. అంతకుముందు బౌట్లలో దీపక్ 7–0తో ప్యాట్రిక్ జురోవ్స్కీ (హంగేరి)పై, 11–0తో జాయోంగ్ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఆరిఫ్ ఓజెన్ (టర్కీ)తో దీపక్ తలపడతాడు. మరోవైపు 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన నవీన్ సిహాగ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో నవీన్ 1–12తో అఖ్మెద్ ఇద్రిసోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
సజన్‌కు రజతం
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. స్లొవేకియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సజన్ భన్వాల్ (77 కేజీలు) రజతం... విజయ్ (55 కేజీలు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సజన్ 0–8తో ఇస్లామ్ ఒపియెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో విజయ్ 16–8తో లిమాన్ (టర్కీ)పై గెలుపొందాడు. -
పిక్నిక్లా ఇల్లు కట్టుకునే టెక్నిక్?
ఫొటోలు చూశారుగా.... బుల్లి బుల్లి ఇళ్లు ఎంత అందంగా ఉన్నాయో.... వాటి చుట్టూ ఉన్న పరిసరాలూ అంతే అద్భుతంగా ఉన్నాయి. చిత్రమైన విషయమేమిటంటే... ఆ అద్భుతమైన ప్రకృతి అందాలను ఎంచక్కా ఆస్వాదించేందుకు ఈ ఇళ్లు సూట్ అవుతాయి అంటోంది స్లొవేకియాలోని స్మార్ట్డోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అవసరమైనప్పుడు... అవసరమైన చోట వీటిని అతితక్కువ సమయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఫొటోలో చూపినట్టుగా నీటిపై, మంచు ఉన్న చోట, పచ్చటి అడవుల్లో ఏర్పాటు చేసుకునేందుకు వేర్వేరు డోమ్‌లను తయారు చేసింది ఈ కంపెనీ. ట్రీ డోమ్‌లో పైకప్పుపై కాయగూరలు, పూల మొక్కలు పెంచుకోవచ్చు. స్నో డోమ్ బయటి వాతావరణం నుంచి మిమ్మల్ని రక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లతో వస్తుంది. దాదాపు 150 మిల్లీమీటర్ల మందమైన ప్రత్యేకమైన ఇన్సులేషన్ కారణంగా ఇందులో విద్యుత్తు వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. పైకప్పు పారదర్శకంగా, అలా లేకుండా కూడా లభిస్తాయి ఈ డోమ్‌లు. రెండు, మూడు డోమ్‌లను కలిపి పెద్ద ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడమూ సులువే. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి క్యాంపులు ఏర్పాటు చేసుకునే బాదరబందీ లేకుండా చేసేందుకు ఈ డోమ్‌లు ఉపయోగపడతాయని అంటోంది స్మార్ట్డోమ్. ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న స్కీ విలేజ్, న్యూజీలాండ్‌లోని హోబిట్ విలేజ్ల మాదిరి ప్రకృతిలో ఒదిగిపోయే చిన్న చిన్న గ్రామాల్లాంటి వాటిని సిద్ధం చేయడం ఈ కంపెనీ లక్ష్యమట. ఒక్కో డోమ్ ఖరీదెంతో త్వరలోనే ప్రకటిస్తారట. -
విమానాలు ఢీ : ఏడుగురు మృతి
బ్రటిస్లావా : స్లోవేకియాలో ఎయిర్ షో కోసం గురువారం ప్రాక్టీసు చేస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు విమానంలోని పలువురు ప్రయాణీకులు ప్యారాచుట్ల ద్వారా కిందకి దూకేశారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ రెండు విమానాల్లో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపింది. విమాన శిథిలాలు చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని పర్వత ప్రాంతంలో పడి ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం మూడు హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టిందని వివరించింది. ఎయిర్ షో నిర్వహించిన ల్లవ్వా పట్టణం రాజధాని బ్రటిస్లావాకు 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. -
కరెంట్ వైర్ తగిలి కూలిన హెలికాప్టర్
బ్రటిస్లావా: హెలికాప్టర్ ప్రోపెల్లర్ కరెంట్ తీగలకు తగిలి నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ఘటన తూర్పు స్లోవేకియా హర్బుసికా గ్రామ సమీపంలో హర్నాడ్ నదిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సోవేకియా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి శనివారం వెల్లడించారు. మృతులలో హెలికాప్టర్ పైలెట్, వైద్యుడు, ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు ఉన్నారని తెలిపారు. 10 ఏళ్ల బాలుడికి తలకు బలమైన గాయమైందని... అతడికి చికిత్స అందించేందుకు వెళ్తున్న క్రమంలో రెస్క్యూ హెలికాప్టర్‌కు ఈ ప్రమాదం జరిగిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి చెప్పారు. -
ముఖంపై 6 కిలోల కణితితో 10 ఏళ్ల సావాసం
స్లొవాకియాలో ముఖంపై ఆరు కిలోల బరువున్న కణితిని గత పదేళ్లుగా మోస్తున్న ఒ వ్యక్తికి ఆఖరికి ఆ కణితినుంచి విముక్తి లభించింది. అయిదు గంటల పాటు సర్జరీ చేసి ఆ కణితిని వైద్యులు తొలగించారు. స్టెఫాన్ జోలీక్ అనే ఆ వ్యక్తి ముఖంలో కొవ్వు ఫైబర్లు పెరిగి పెరిగి ఒక భయంకరమైన కణితిలా మారాయి. గడ్డం లా దవడ కింద ఆ కణితి వేలాడుతూ ఉండేది. దాని బరువు వల్ల అతని నడక, నిలబడే విధానం అన్నీ మారిపోయి నరక యాతన అనుభవించేవాడు. దీన్ని వైద్యులు మేడెలంగ్ వ్యాధి అంటారు. చివరికి వైద్యులు దీన్ని తొలగించడంతో ఆయన ఇప్పుడు హాయిగా తలతిప్పగలుగుతున్నాడు. బరువు మోయకుండా నడవగలుగుతున్నాడు. అన్నిటికన్నా మించి రోడ్డు పై వెళ్తూంటే అతడిని ఎవరూ వింతగా చూడటం లేదు. -
జొకోవిచ్, నాదల్ శుభారంభం
తొమ్మిదో సీడ్ నిషికోరికి షాక్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో ఉన్న నొవాక్ జొకోవిచ్... తొమ్మిదోసారి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను అలవోకగా ఓడించారు. రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2, 6-4తో సౌసా (పోర్చుగల్)పై నెగ్గాడు. గంటా 50 నిమిషాల ఈ పోరులో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్) 6-0, 6-3, 6-0తో రాబీ జినెప్రి (అమెరికా)ను చిత్తుగా ఓడించాడు. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేయడంతోపాటు... నెట్‌వద్ద 10 పాయింట్లు సాధించాడు. మరోవైపు ఆసియా ఆశాకిరణం, తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) తొలి రౌండ్లోనే అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు. అన్‌సీడెడ్ మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) 7-6 (7/4), 6-1, 6-2తో నిషికోరిపై సంచలనం సృష్టించాడు. 30వ సీడ్ పోస్పిసిల్ (కెనడా) కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. గబాష్విలి (రష్యా) 6-4, 6-2, 6-3తో పోస్పిసిల్ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) 4-6, 6-4, 6-2, 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై; 26వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) 6-3, 7-6 (10/8), 6-3తో దామిర్ జుమ్హుర్ (బోస్నియా అండ్ హెర్జిగోవినా)పై; 29వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-1, 6-1, 6-3తో పావిక్ (క్రొయేషియా)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. షరపోవా దూకుడు మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్, నిరుటి రన్నరప్ మరియా షరపోవా (రష్యా) రెండో రౌండ్లోకి చేరుకుంది. తొలి రౌండ్లో షరపోవా 6-1, 6-2తో పెర్వాక్ (రష్యా)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7-5, 6-0తో రజానో (ఫ్రాన్స్)పై; 12వ సీడ్ పెనెట్టా (ఇటలీ) 6-2, 6-2తో యాచ్లిట్నర్ (ఆస్ట్రియా)పై; 16వ సీడ్ లిసికి (జర్మనీ) 6-1, 7-5తో ఫెర్రో (ఫ్రాన్స్)పై నెగ్గారు. అయితే 17వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-3, 3-6, 2-6తో పౌలీన్ పర్మాంటీర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. సానియా జోడికి ఐదో సీడ్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే)కి ఐదో సీడింగ్ లభించింది. తొలి రౌండ్లో ఈ జంట డానియెలా హంతుచోవా (స్లొవేకియా)-షహర్ పీర్ (ఇజ్రాయెల్) ద్వయంతో ఆడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జంట కార్లోవిచ్-స్టీవెన్ రాబర్ట్ జోడితో ఆడుతుంది.