ప్రేగ్: యూరప్‌లోని చిన్న దేశం స్లొవేకియాలో ఎన్నికల ఫలితాలు అమెరికా, యూరప్ దేశాలకు కంగారు పుట్టిస్తున్నాయి. రష్యా అనుకూల మాజీ ప్రధాని రాబర్ట్ ఫికోకు చెందిన వామపక్ష స్మెర్(డైరెక్షన్)పార్టీ తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు మొదట్నుంచీ పొరుగునే ఉన్న స్లొవేకియా మద్దతుగా నిలుస్తోంది. ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ శరణార్థుల కోసం సరిహద్దులను తెరిచి ఉంచింది.
తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరించుకుంటామని, వలసలను అడ్డుకుంటామని, రష్యాపై ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రజలకు ఫికో హామీ ఇచ్చారు. గతంలో రెండు పర్యాయాలు ఫికో ప్రధానిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ ఫికోయే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. స్లొవేకియా ఎన్నికల ఫలితాల గెలుపు ప్రభావం జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్ వంటి దేశాల్లో మరికొద్ది రోజుల్లో జరగనున్న జాతీయ, ప్రాంతీయ ఎన్నికలపై పడుతుందన్నది పరిశీలకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment