
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.
రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు.