wounded
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు -
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు !
Popular Actor Nassar Wounded In Cinema Shooting: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. అయితే తాజాగా ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో బుధవారం (ఆగస్టు 17) ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న నాజర్ గాయాలపాలయ్యారని సమాచారం. నాజర్‌కు గాయాలు కాగా వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చదవండి: నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్ -
అమ్మా ఆకలేస్తోంది.. సెకన్లలో పాప మృతి, మరో ఇద్దరు చిన్నారులు..
నిజామాబాద్ అర్బన్ : అమ్మా ఆకలేస్తోంది.. పాలు కావాలంటూ చిన్నారులు మారం చేశారు. పిల్లలకు పాలు తాగించేందుకు తల్లి సిలిండర్ వెలిగించింది.. మంటలు చెలరేగి ఐదేళ్ల పాప మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు, భార్యభర్తలు గాయాల పాలయ్యారు. వివరాల ప్రకారం.. పాల వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన సునీల్‌యాదవ్, ధన్వంతరిబాయి దంపతులు నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని సారంగాపూర్ డెయిరీ ఫారం వద్ద ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు బబ్లూ, జగ్గు, నమ్కిబాయి (5) ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి బబ్లూ, జగ్గు పాలుతాగుతామని తల్లిని అడిగారు. తల్లి మినీ సిలిండర్ పై పాలను వేడి చేస్తోంది. సిలిండర్‌కు చెందిన గ్యాస్ పైపులైన్ స్టౌవ్ వద్ద మంటలు అంటుకొని తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముగ్గురు పిల్లలకు అంటుకున్నాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న భార్యభర్తలు పిల్లలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో నమ్కిబాయి చికిత్స పొందుతూ మరణించింది. మిగితా ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బొలేరో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు
కారేపల్లి: మిర్చి తోట ఏరుటకు వచ్చిన కూలీలతో ఉన్న బొలేరో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని గుడితండా–చీమలపాడు రహదారి మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన 15 మంది మహిళా కూలీలు సోమవారం కారేపల్లి మండలంలోని గుడితండా గ్రామంలో మిర్చి ఏరుటకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో గుడితండా–చీమలపాడు బీటీ రోడ్డు మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మరో వాహనంలో ఇల్లందు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. -
రిమోట్ కారు పేలి...
టేకులపల్లి : రిమోట్ కారు పేలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం శ్రీను, రజిత దంపతుల కుమారుడు అరవింద్ అదే గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్నారు. శుక్రవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చి తన రిమోట్ కారుతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో రిమోట్ కారు పేలి ముక్కలైంది. అరవింద్ ఎడమ చేయికి, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. రిమోట్ కారు పేలినపుడు బాంబు పేలినట్లు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
సాక్షి, మిడుతూరు: క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మృతురాలి తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి కూతరు తరళిత, కుమారుడు రితీష్ ఉన్నాడు. -
ఆటో బోల్తా ; నలుగురికి గాయాలు
చేర్యాల : ఆటో బోల్తా పడి నలుగురికి తీ వ్ర గాయాలైన సంఘటన మండలంలోని ఐనాపూర్ – పోసానిపల్లి రహదారిలో సో మవారం చోటు చేసుకుంది. కొమురవెల్లికి చెందిన కడెం రేణుక, కడెం కొండయ్య, కడెం యా దవ్వ, కడెం పోచమ్మతో పాటు కుటుంబ సభ్యులు నాగపురిలోని తమ బంధువు అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరారు. పోసానిపల్లి–ఐనాపూరు ప్రాంతానికి చేరుకోగానే ఆటోకు ఎదురుగా టాటా సుమో వేగంగా దూసుకొచ్చింది. ఈక్రమంలో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కడెం రేణుక తలకు తీవ్రగాయమై చేయి విరిగింది. కడెం కొండయ్య కాళ్లు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కడెం యాదవ్వ, కడెం పోచమ్మకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సిద్ధిపేటకు తరలించారు. -
ఆటో బోల్తాపడి ఇద్దరి దుర్మరణం
ఐదుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం కన్నీరు మున్నీరైన మృతుల బంధువులు జనగామ – మద్దూరు రహదారిపై గానుగుపహాడ్ స్టేజీ వద్ద ఘటన జనగామ రూరల్ : ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని జనగామ–మద్దూరు రహదారిపై గానుగుపహాడ్ గ్రామం వద్ద మంగళవారం జరిగింది. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ట్రాలీఆటో నర్మెట మండలం కన్నెబోయినగూడెం వద్ద సామగ్రిని దింపేందుకు వెళ్లింది. తిరుగుప్రయాణంలో డ్రైవర్ జనగామ వైపు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారిలో నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన ధారవత్ టీక్యా(50), ఆల కుంట్ల ఎల్లమ్మ, ఇదే గ్రామశివారు ఇప్పలగడ్డ తండాకు చెందిన బానోతు తారమ్మ, నర్మెటకు చెందిన శివరాత్రి కనకలక్ష్మి(32), ఆమె కూతురు శివరాత్రి శిరీష, బంధువు సంధ్య(అంక్షాపూర్), జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఎల్లయ్య ఉన్నారు. ఆటో గానుగుపహాడ్ స్టేజీ(జెండాబోడు గడ్డ) దాటాక మూలమలుపు వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరికి తీవ్ర గాయాలు కావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శివరాత్రి కనకలక్ష్మి, ధారవత్ టీక్యా మృతిచెందారు. ఎల్లమ్మ, శిరీష, సంధ్య, తారమ్మ, ఎల్లయ్యల తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో తారమ్మ, ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్‌కు తరలించారు. ఇద్దరి మృతితో వారి బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. మృతులు టీక్యాకు భార్య విజయ, కుమార్తె మంజుల, కుమారుడు గోపాలకృష్ణ ఉండగా, కనకలక్ష్మికి భర్త కనకయ్య, కుమార్తె శిరీష(క్షతగాత్రురాలు), కుమారుడు రవి ఉన్నారు. -
ఆర్టీసీ బస్సుకు జేసీబీ తగిలి తొమ్మిది మందికి గాయాలు
ములుగు : హన్మకొండ నుంచి ములుగుకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు రోడ్డు పక్కన మిషన్ భగీరథ పనులు చేస్తున్న జేసీబీ హైడ్రాలిక్ బకెట్ ప్రమాదవశాత్తు తగలడంతో బస్సులోని ప్రయాణì కులకు గాయాలైన సంఘటన మండలంలోని పందికుంట సమీపంలో మంగళవారం జరిగింది. ఆర్టీసీ బస్సు(ఏపీ 28జెడ్ 2308) హన్మకొండ నుంచి ప్రయాణికులతో ములుగు వైపు బయల్దేరింది. పందికుంట సమీపంలో మిషన్ భగీరథ పైపుల కోసం కందకాలు తవ్వుతున్న జేసీబీ డ్రైవర్ గమనించకుండా ఒక్కసారిగా వెనక్కి తిప్పడంతో బకెట్ బస్సుకు తాకింది. దీంతో మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన బొచ్చు ఈశ్వరమ్మ, ఎం. పద్మ, బండారుపల్లికి చెందిన ముఖ్తార్‌పాషా, ముత్యాల ఉప్పరయ్య, జాకారానికి చెందిన తోట మల్లయ్య, కండక్టర్ తిప్పాని అనిత, ములుగుకు చెందిన అఫ్పియా, షకీల్‌కు గాయాలు కాగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై మల్లేశ్‌యాదవ్ పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చెన్నారావుపేట : రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రంలోని బ్రిడ్జి వద్ద నెక్కొండ–నర్సంపేట ప్రధాన రహదారిపైన మంగళవారం జరిగింది. నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామానికి చెందిన భూక్య మంగీలాల్ ద్విచక్రవాహనంపై ఖానాపురం మండలం మంగళవారిపేటకు వెళ్లి తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని 108లో నర్సంపేట ఏరియా ఆ స్పత్రికి తరలించి ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తరలించారు. -
ఐఎస్ అగ్రనేతపై అమెరికా బాంబులు
బాగ్దాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధికార ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డాడు. ఇరాక్, అమెరికా కమాండో బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో అతడు పూర్తిస్థాయిలో గాయాలపాలయ్యాడు. దీంతో అతడికి రక్త స్రావం కూడా ఎక్కువగా జరగడంతో రక్తమార్పిడి చేస్తున్నట్లు సమాచారం. అబూ మహ్మద్ అల్ అద్నానీ ఇస్లామిక్ స్టేట్ లో అత్యున్నత స్థాయి హోదాను అనుభవించేవారిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అతడు ఇరాక్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ సంస్థకు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న అద్నానీ గొంతు ప్రపంచానికి సుపరిచితమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన పలు హెచ్చరికల టేపులు, సందేశాల టేపుల్లో మాట్లాడింది అద్నానీ. తాజాగా, అతడిపై జరిగిన విషయాన్ని ఇరాక్ జాయింట్ ఆపరేషన్స్ కమాండర్ ఒకరు తెలియజేస్తూ గత నెల రోజులుగా తాము అద్నానీ కదలికలను గమనిస్తున్నామని చెప్పారు. గురువారం జరిపిన వైమానిక దాడుల్లో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలిసిందని, రక్తం కూడా చాలా పోవడంతో రక్త మార్పిడి కూడా చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. 2005లో ఒకసారి అద్నానీ అరెస్టు చేసి తీసుకెళ్లిన అమెరికా 2010లో విడుదల చేసింది. అయినా, తీరు మార్చుకోని అద్నానీ పాశ్చాత్య దేశాలకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. -
యూఎస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి
యూఎస్‌లోని హ్యూస్టన్ శివారు ప్రాంతం బుధవారం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. హ్యూస్టన్ శివారులోని స్ప్రింగ్ ప్రాంతంలోని నివాసాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు ఉన్నారని చెప్పింది. వారి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. దీంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు పోలీసులు ముమ్మరం చేశారని మీడియా పేర్కొంది.