అమెరికాలో మళ్లీ కాల్పుల మోత | 3 People Killed And 1 Wounded In Shooting At Atlanta | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

Published Sun, Dec 10 2023 9:03 PM | Last Updated on Sun, Dec 10 2023 9:34 PM

3 People Killed And 1 Wounded In Shooting At Atlanta - Sakshi

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్‌ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే  కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  డ్రగ్స్‌ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు.

బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.    

ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement