atlanta airport
-
ఫేక్ ఉబర్ డ్రైవర్ల హల్ చల్..
అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గర ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్ షేర్ల పేరుతో ఫేక్ రైడ్ డ్రైవర్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ప్రయాణికులను మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైడ్‌షేర్ డ్రైవర్ల ముసుగులో ప్రయాణికులను మోసగిస్తున్న ఫేక్ రైడ్ డ్రైవర్లను స్థానిక వార్తా సంస్థ 11అలైవ్ గుర్తించింది. ఈ మోసగాళ్లు తక్కువ రేట్లను రైడ్లను అందిస్తారు. వివిధ చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తారు. అయితే వారికి డబ్బు కంటే కూడా మానవ అక్రమ రవాణా వంటి వేరే అక్రమ ఉద్దేశాలు ఉండవచ్చు. ఈ వ్యవహారంపై అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రయాణికులను మోసగిస్తున్న పలువురు ఫేక్ డ్రైవర్లను అరెస్టు చేసింది. అయినప్పటికీ వీరి ఆగడాలు తగ్గడం లేదు. తొందరలో ఉండే ప్రయాణికులే లక్ష్యంగా వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారిక యాప్‌ల ద్వారా తమ రైడ్‌షేర్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే డ్రైవర్లను కలవాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతోపాటు పికప్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు తెలుసుకుని నిర్ధారించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు -
అమెరికా అధికారుల కస్టడీలో భారతీయుడి మృతి
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల కస్టడీలో ఉన్న ఓ భారతీయుడు అక్కడే ఆస్పత్రిలో మరణించారు. అతుల్ కుమార్ బాబూభాయ్ పటేల్ (58)ని దేశంలోకి వచ్చేటప్పుడు తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవంటూ అధికారులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. మే పదో తేదీన ఈక్వెడార్ నుంచి వచ్చిన ఓ విమానంలో ఆయన అట్లాంటాలో దిగారు. రెండు రోజుల పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయనను అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్లోనే ఉంచేశారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మరణించారని అధికారులు తెలిపారు. పటేల్ వద్ద తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకపోవడం వల్లే ఆయనను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించలేదని ఇమ్మిగ్రేషన్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్లో ఉండగా ఆయనకు ప్రాథమిక వైద్యపరీక్షలు చేసినప్పుడు హైబీపీ, డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన డయాబెటిస్ చూస్తున్న ఓ నర్సు.. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. భారతీయ రాయబార కార్యాలయానికి పటేల్ మృతి గురించి సమాచారం అందించగా, వాళ్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. కస్టడీలో ఇలా మరణించడం చాలా అరుదుగా జరుగుతుందని ఇమ్మిగ్రేషన్ శాఖ చెబుతోంది.