అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్ షేర్ల పేరుతో ఫేక్ రైడ్ డ్రైవర్లు హల్‌చల్ చేస్తున్నారు. వీరు ప్రయాణికులను మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రైడ్‌షేర్ డ్రైవర్‌ల ముసుగులో ప్రయాణికులను మోసగిస్తున్న ఫేక్ రైడ్ డ్రైవర్లను స్థానిక వార్తా సంస్థ 11అలైవ్ గుర్తించింది. ఈ మోసగాళ్లు తక్కువ రేట్లను రైడ్లను అందిస్తారు. వివిధ చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తారు. అయితే వారికి డబ్బు కంటే కూడా మానవ అక్రమ రవాణా వంటి వేరే అక్రమ ఉద్దేశాలు ఉండవచ్చు.
ఈ వ్యవహారంపై అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రయాణికులను మోసగిస్తున్న పలువురు ఫేక్ డ్రైవర్లను అరెస్టు చేసింది. అయినప్పటికీ వీరి ఆగడాలు తగ్గడం లేదు. తొందరలో ఉండే ప్రయాణికులే లక్ష్యంగా వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
అధికారిక యాప్‌ల ద్వారా తమ రైడ్‌షేర్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే డ్రైవర్లను కలవాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతోపాటు పికప్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు తెలుసుకుని నిర్ధారించుకోవాలని సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment