న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరభ్ వర్మ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. శనివారం ముగిసిన స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్‌గా చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో టాప్ సీడ్ సౌరభ్ 21–17, 21–12తో నాలుగో సీడ్ మినోరు కొగా (జపాన్)పై నెగ్గాడు. మహిళల డబుల్స్ విభాగంలో దండు పూజ–సంజన (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో టాప్ సీడ్ పూజ–సంజన జోడీ 14–21, 20–22తో జెన్నీ మూర్–విక్టోరియా (ఇంగ్లండ్) జంట చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment