బ్రేటిస్లావ : సినిమాటిక్ తరహాలో చోటుచేసుకున్న ఓ కారు ప్రమాదం ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రమాదం చూస్తే అతివేగం ఎంత ప్రమాదమో తెలుస్తోంది. అతివేగానికి నిర్లక్ష్యం కూడా తోడైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అద్దపడుతోంది. స్లోవేకియాలోని బ్రేటిస్లావ నగరంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోను స్లోవేకియా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
గత గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనలో.. అతివేగంగా దూసుకొస్తున్న బీఎమ్‌డబ్లూ కారు ఒక్కసారిగా గాల్లోకి లేచి టన్నెల్‌ను ఢీకొట్టింది. 360 డిగ్రీలు పల్టీ కొట్టి టన్నెల్ లోపల పడిపోయింది. కారు టన్నెల్ పై భాగాన్ని తాకడంతోనే భారీగా మంటలు చెలరేగాయి. సెకన్లలోనే కారు నుజ్జునుజ్జైంది. ఆ సమయంలో మరో వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదృష్టవశాత్తు డ్రైవర్(44) కూడా చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా కారునడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్లోవేకియా పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment