గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కారు గాల్లో ఎగిరిపోతే? | Slovakian Company Introduced Aircar | Sakshi
Sakshi News home page

గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కారు గాల్లో ఎగిరిపోతే?

Published Sat, Jul 3 2021 8:12 AM | Last Updated on Sat, Jul 3 2021 9:12 AM

Slovakian Company Introduced Aircar - Sakshi

కారుకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేస్తాయి. కారు అట్లానే గాల్లోకి ఎగిరి.. హాయిగా చక్కర్లు కొడుతుంది. ఊరవతలో, మరో సిటీలోనో రోడ్డుపై అట్లా ల్యాండ్‌ అవుతుంది. ఎప్పట్లా మారిపోయి ఇంటికెళ్లిపోతుంది. ఇదేదో హాలీవుడ్‌ సినిమాలో సీన్‌లా ఉందికదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. స్లొవేకియాకు చెందిన క్లెయిన్‌ విజన్‌ కంపెనీ రూపొందించిన ‘ఎయిర్‌ కార్‌’ ఇటు కార్‌లా ప్రయాణించి, అటు చిన్న విమానంలా గాల్లో ఎగిరింది. 160 హెచ్‌పీ సామర్థ్యమున్న బీఎండబ్ల్యూ ఇంజిన్‌తో దీనిని రూపొందించారు. సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. ఇద్దరు ప్రయాణిం చొచ్చు. స్లొవేకియాలోని నిట్రా సిటీ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్‌కార్‌.. 8 వేల అడుగుల (సుమారు రెండున్నర కిలోమీటర్లు) ఎత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 35 నిమిషాల తర్వాత బ్రటిస్లావా నగరంలో ల్యాండ్‌ అయింది.

కారులా ప్రయాణిస్తున్నప్పుడు దీని రెక్కలు రెండు వైపులా పక్కకు ముడుచుకుంటాయి. గాల్లో ఎగిరే ముందు విచ్చుకుంటాయి. ఇదంతా మూడు నిమిషాల్లో జరిగిపోతుంది. ప్రస్తుతం ప్రయోగం చేసింది ప్రొటోటైప్‌ అని.. అసలు ఎయిర్‌కార్‌ను 300 హెచ్‌పీ ఇంజిన్‌తో రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. అది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని.. ఏడాదిలోపు దీనిని మార్కెట్‌లోకి తీసుకొ స్తామని వెల్లడించింది. ధర ఎంత ఉంటుందన్న వివరాలేమీ వెల్లడించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement