మీటింగ్ నుంచి తిరిగి వెళ్తుండగా దారుణం
నాలుగైదు రౌండ్లు పేలి్చన దుండగుడు
తల, ఛాతీ, పొట్టలో గాయాలు, పరిస్థితి విషమం
పోలీసుల అదుపులో అనుమానితుడు
ప్రేగ్: స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై హత్యాయత్నం జరిగింది. ఆయన బుధవారం మధ్యాహ్నం హండ్లోవా నగరంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ భవనం బయట గుమిగూడిన అభిమానులకు అభివాదం చేస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో ఆయనపై నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు.
తీవ్రంగా గాయపడ్డ ఫికోను హుటాహుటిన బాన్‌స్క్ బై్రస్టికాలోని ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రధాని అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తూటాలు పొట్టలోంచి దూసుకుపోయినట్టు చెబుతున్నారు. ఫికో తలకు, ఛాతీకి కూడా గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
ఘటన జరిగిన వెంటనే అనుమానితున్ని ప్రధాని బాడీగార్డులతో పాటు అభిమానులు నిర్బంధించినట్టు సమాచారం. దీన్ని దేశ ప్రజాస్వామ్యంపైనే దాడిగా అధ్యక్షురాలు జుజానా కపుటోవా అభివరి్ణంచారు. దుండగునిగా భావిస్తున్న 71 ఏళ్ల అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అతను రచయిత అని, ప్రత్యర్థి పారీ్టకి చెందిన రాజకీయ కార్యకర్త అని రకరకాలుగా వార్తలొస్తున్నాయి. దుండగుడు తన లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాడికి కారణం తెలియరాలేదు.
దాడి సమయంలో స్లొవాకియా పార్లమెంటు సమావేశాలు జరుగుతు న్నాయి. ఘటనపై స్పీకర్ ప్రకటన అనంతరం సభ వాయిదా పడింది. మూడు వారాల్లో యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఫికో పారీ్టతో కూడిన అతివాద పక్షాల కూటమిదే పై చేయి అవుతుందని భావిస్తున్న వేళ ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.
రష్యా అనుకూలుడు
ఫికో రష్యా అనుకూలునిగా పేరుబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు. గత సెప్టెంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రష్యా అనుకూల, అమెరికా వ్యతిరేక ప్రచారంతో తన జాతీయవాద సంకీర్ణ కూటమికి విజయం సాధించిపెట్టి మూడోసారి ప్రధాని అయ్యారు. వెంటనే ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లొవాకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరపడుతుందని, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రతను ఆయన ప్రమాదంలోకి నెడతారని విమర్శకులు అంటున్నారు.
ఫికో విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజధానిలో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగింది. ఫికో, దేశాధ్యక్షుడు కపుటోవా రాజకీయ ప్రత్యర్థులు. ఫికో రాజకీయ మిత్రుడైన పీటర్ పలెగ్రినీ ఇటీవలే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెను ముప్పుకు ఫికోపై దాడి తాజా ఉదాహరణ అని పలెగ్రినీ అన్నారు. రాజకీయ అభిప్రాయాలను పోలింగ్ బూత్‌ల్లో కాకుండా ఇలా తూటాల ద్వారా వ్యక్తం చేస్తూ పోతే దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషి మట్టిపాలవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. చెకస్లొవాకియా 1992లో చెక్ రిపబ్లిక్, స్లొవాకియాగా విడిపోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment