critical
-
రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం
ముంబై: టాటా సన్స్ అధినేత రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ను ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు.LET'S PRAY AND Send HEALING THOUGHTS AND WARM WISHES TO SHRI RATAN TATA Ji.Get well soon Legend 🙏 pic.twitter.com/cHAq66ziAB— Bhushan Mittal 🇮🇳 (@bhushan8360) October 9, 2024ఇటీవల దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. -
కాళీనది ఉగ్రరూపం.. ఉత్తరాఖండ్ అతలాకుతలం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లెక్కలేనన్ని ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఉగ్రరూపాన్ని దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడ్డివాములు నదుల్లోకి చేరుతున్నాయి. రోడ్లపై చేరిన చెత్తాచెదారం రహదారులను మూసేస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దులోని ధార్చులలో గల కాళీనది ఉగ్రరూపాన్ని దాల్చింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం కావాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.ఎన్డిఆర్ఎఫ్ బృందం కాళీనది పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాళీనదిలోని నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. కాళీనది ఉగ్ర రూపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకంతకు నదిలో పెరుగున్న నీటి మట్టాన్ని ఈ వీడియోలలో గమనించవచ్చు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కూలిపోవడంతో పాటు పలు రహదారులు మూసుకుపోయాయి. రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. भारत नेपाल बॉर्डर : उत्तराखंड के धारचूला में फटा बादल, SDRF को अलर्ट मोड पर रखा गया#CloudBurst | #Dharchula | #Uttarakhand | #HeavyRain | #SDRF pic.twitter.com/wLlWQYMGrA— NDTV India (@ndtvindia) July 12, 2024 -
స్లొవాకియా ప్రధానిపై కాల్పులు
ప్రేగ్: స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై హత్యాయత్నం జరిగింది. ఆయన బుధవారం మధ్యాహ్నం హండ్లోవా నగరంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ భవనం బయట గుమిగూడిన అభిమానులకు అభివాదం చేస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో ఆయనపై నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఫికోను హుటాహుటిన బాన్స్క్ బై్రస్టికాలోని ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రధాని అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తూటాలు పొట్టలోంచి దూసుకుపోయినట్టు చెబుతున్నారు. ఫికో తలకు, ఛాతీకి కూడా గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అనుమానితున్ని ప్రధాని బాడీగార్డులతో పాటు అభిమానులు నిర్బంధించినట్టు సమాచారం. దీన్ని దేశ ప్రజాస్వామ్యంపైనే దాడిగా అధ్యక్షురాలు జుజానా కపుటోవా అభివరి్ణంచారు. దుండగునిగా భావిస్తున్న 71 ఏళ్ల అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అతను రచయిత అని, ప్రత్యర్థి పారీ్టకి చెందిన రాజకీయ కార్యకర్త అని రకరకాలుగా వార్తలొస్తున్నాయి. దుండగుడు తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాడికి కారణం తెలియరాలేదు. దాడి సమయంలో స్లొవాకియా పార్లమెంటు సమావేశాలు జరుగుతు న్నాయి. ఘటనపై స్పీకర్ ప్రకటన అనంతరం సభ వాయిదా పడింది. మూడు వారాల్లో యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఫికో పారీ్టతో కూడిన అతివాద పక్షాల కూటమిదే పై చేయి అవుతుందని భావిస్తున్న వేళ ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.రష్యా అనుకూలుడు ఫికో రష్యా అనుకూలునిగా పేరుబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు. గత సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రష్యా అనుకూల, అమెరికా వ్యతిరేక ప్రచారంతో తన జాతీయవాద సంకీర్ణ కూటమికి విజయం సాధించిపెట్టి మూడోసారి ప్రధాని అయ్యారు. వెంటనే ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లొవాకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరపడుతుందని, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రతను ఆయన ప్రమాదంలోకి నెడతారని విమర్శకులు అంటున్నారు. ఫికో విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజధానిలో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరిగింది. ఫికో, దేశాధ్యక్షుడు కపుటోవా రాజకీయ ప్రత్యర్థులు. ఫికో రాజకీయ మిత్రుడైన పీటర్ పలెగ్రినీ ఇటీవలే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెను ముప్పుకు ఫికోపై దాడి తాజా ఉదాహరణ అని పలెగ్రినీ అన్నారు. రాజకీయ అభిప్రాయాలను పోలింగ్ బూత్‌ల్లో కాకుండా ఇలా తూటాల ద్వారా వ్యక్తం చేస్తూ పోతే దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషి మట్టిపాలవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. చెకస్లొవాకియా 1992లో చెక్ రిపబ్లిక్, స్లొవాకియాగా విడిపోవడం తెలిసిందే. -
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్‌లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది. आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024 -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్‌దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు. -
తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చే వంకతో ఓ యువతిపై నడిరోడ్డుపై.. అదీ బైక్ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. తార్నక వద్ద లిఫ్ట్ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: కిక్ ఎక్కి.. దోస్తును చంపేశారు! -
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం
-
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్‌పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
కొండంత విషాదం: వెంటీలెటర్‌పై మరో నలుగురు
సాక్షి, జగిత్యాల/హైదరాబాద్ : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. మరోవైపు హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హెచ్చార్సీలో ఫిర్యాదు కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాద్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన హెచ్చార్సీని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రెషియా ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్‌ను అభ్యర్థించారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం ఆర్టీసి అధికారుల నిర్లక్ష్య కారణంగానే కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిందని, ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల పేదల కుటుంబాలు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. బుధవారం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. -
వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
-
క్షీణించిన లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్యం
-
విషమంగానే స్వాతి ఆరోగ్య పరిస్ధితి
-
ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యంపై ఆందోళన
-
ఇంకా విషమంగానే రాజేశ్వరీ ఆరోగ్యం
-
స్తంభించిన చెన్నై.. క్షణక్షణం ఉత్కంఠ!
-
జయ ఆరోగ్యం మరింత విషయం
-
పరిస్ధితిని ఉద్రిక్తంగా మారుస్తాయి
-
అధికార పార్టీలో అంతర్మథనం
► ఎమ్మెల్యేలకే అధికారమంటూ ప్రచారం ► ఆందోళనలో పాత నేతలు ► కరణంకు కార్పొరేషన్ పదవి, గొట్టిపాటికి నియోజకవర్గ బాధ్యతలు..? ► అన్నా, దివి శివరాంల పరిస్థితి అయోమయం ► అమీతుమీకి సిద్ధమవుతున్న పాత నేతలు ► పజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒక పక్క టీడీపీ పాత నేతలు.. కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల పట్ల ఆ పార్టీ అధిష్టానం పూటకో తీరున వ్యవహరిస్తుండటంతో పాత నేతల్లో అంతర్మథనం మొదలైంది. తాజాగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అంటూ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరగడం పాత నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. అధిష్టానం వైఖరిపై పాత నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అమీతుమీకి సిద్ధపడాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పాత నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పదవులు ఎర వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం బలరాంకు ఆర్టీసీ లేదా మరో ఇతర కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ గతంలోనే చంద్రబాబు తనకు చెప్పారని ఇటీవల కరణం సైతం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కరణంకు కార్పొరేషన్ పదవి అప్పగించి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ దీనికి అంగీకరిస్తాడా... అన్నది అనుమానమే. చిన్న వయస్సులోనే వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుంటే కరణం బలరాం చూస్తూ ఊరుకుంటారా..? అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పక్కనపెట్టి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే సమయంలోనే అశోక్‌రెడ్డికి చంద్రబాబు, చినబాబు లోకేష్‌లు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే అన్నా రాంబాబును మెల్లగా గిద్దలూరు రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే రాంబాబును బుజ్జగించేందుకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా... లేదా... అన్నది వేచి చూడాల్సిందే...? ప్రాధాన్యతనివ్వకపోతే రాంబాబు తన వర్గీయులతో కలిసి అధిష్టానంతో తేల్చుకునేందుకు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకొని ఇప్పటికే పాత నేత దివి శివరాంకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పోతుల రామారావు, దివి శివరాంల మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. శివరాం వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు పోతుల అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు నేతలు పోతుల వైపు మళ్లారు. పోతులను బలోపేతం చేసి శివరాంను బలహీనుడ్ని చేసి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శివరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా... లేదా... అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ నామినేటెడ్ పదవి కట్టబెట్టకపోతే శివరాం పార్టీలో కొనసాగుతారా అన్నదీ సందేహమే. జిల్లా స్థాయిలో ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు అధిష్టానం కట్టబెడుతుందా... అన్నది అనుమానమే. నాయకుల సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన తమకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు అడ్డు తగులుతుంటే కార్యకర్తలు సహించే పరిస్థితి ఉండదు. అయితే ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గీయులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ పోటీ పడి గొడవలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పాత నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గిస్తే అది క్షేత్ర స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కార్యకర్తల పక్షాన నిలిచి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు పాత నేతలు సిద్ధపడనున్నట్లు సమాచారం. -
9వ రోజుకు చేరిన ముద్రగడ దీక్ష
రాజమండ్రి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ముద్రగడ మాత్రం వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే యూరిన్‌లో కీటోన్ బాడీసీ్ పెరగడంపై ముద్రగడకు వివరించామని, కీటోన్ బాడీస్ పూర్తిగా తొలగాలంటే మూడు, నాలుగురోజుల సమయం పడుతుందన్నారు. ఆయనకు గతరాత్రి సెలైన్లు ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు బీపీ 140/80, బ్లడ్ షుగర్ 119, హిమోగ్లోబిన్ 8.8గా ఉంది. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఇక మంత్రుల వ్యాఖ్యలు, వైద్యానికి ముద్రగడ నిరాకరణ, ఆయన ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది. -
ముద్రగడ ఆరోగ్యంతో సర్కార్ ఆటలు!
కాపు ఉద్యమ నేత ఆరోగ్యం మరింత విషమం సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఎనిమిది రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యంతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడుతోంది. ఓవైపు అధికారులను పంపి, చర్చలంటూ వైద్యానికి ఒప్పించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు మంత్రులతో ఎగతాళి వ్యాఖ్యలు చేయించి ముద్రగడ వైద్యానికి నిరాకరించే స్థితికి కారణమైంది. ఇప్పుడాయన వైద్యాన్ని పూర్తిగా నిరాకరించడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో చెప్పలేమని వైద్యులంటున్నారు. మంత్రుల వ్యాఖ్యలు, వైద్యానికి ముద్రగడ నిరాకరణ, ఆయన ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది.గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, యువకుల బైక్ ర్యాలీలు జరిగారుు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి వైద్యులు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయం స్పష్టమైంది. చర్చలు సానుకూలమయ్యూయన్న డీఐజీ గతంలోనూ, ఇప్పుడూ ముద్రగడ డిమాండ్ ఒక్కటే.. అరెస్టు చేసిన వారిని విడుదలచేయాలి, అరెస్టులు ఆపేయాలి. వీటిపై ముద్రగడ రెండోసారి ఆమరణదీక్ష ప్రారంభించిన వారం రోజుల తరువాత కానీ చంద్రబాబు దిగిరాలేదు. మంగళ, బుధవారాల్లో జరిగిన చర్చలు సానుకూలమయ్యూయని డీఐజీ శ్రీకాంత్ మీడియాకు చెప్పుకొచ్చారు. అరెస్టు చేసిన వారి విడుదలకు గాను బెయిల్ తేవడానికి సాంకేతికంగా సమయం పడుతుందన్నారు. తుని ఘటనలో లోతైన విచారణ జరిపాకే చర్యలన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా వైద్యానికి అంగీకరించాలని ముద్రగడను కోరారు. కాపు జేఏసీ కూడా నచ్చచెప్పగా ముద్రగడ వైద్యానికి సానుకూలత వ్యక్తం చేశారని, ఆయన రక్తనమూనాలు సేకరించి, వైద్యులు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారని బుధవారం అధికారులు చెప్పారు. కలత చెందిన ముద్రగడ అరెస్టు చేసిన 13 మంది బెయిల్‌పై విడుదలయ్యాక మాత్రమే దీక్ష విరమిస్తానని స్పష్టంచేసిన ముద్రగడ అందుకు అధికారులు అంగీకరించిన తర్వాతే వైద్యానికి ఒప్పుకున్నారు. ఈ తరుణంలో ముద్రగడ పెట్టిన డిమాండ్లను ఒప్పుకోలేదని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో దీక్ష విరమించినట్టేనని, ఏడు రోజులు దీక్ష చేసిన తరువాత కూడా వైద్య నివేదికలు సాధారణంగా ఎలా ఉన్నాయనే చర్చ కూడా ఉందని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలతో ముద్రగడ కలతచెంది గురువారం ఉదయం నుంచి వైద్యాన్ని నిరాకరించారు. బుధవారంలా కనీసం రక్త నమూనాలు తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఫ్లూయిడ్స్ పెట్టేందుకు ప్రయత్నించిన వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారని, తనను మానసికంగా వేధించవద్దని.. వదిలివేయాలని అన్నారని తెలియవచ్చింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని వైద్యులు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాలకొండయ్యకు మొరపెట్టుకుని, తమను ఆ విధుల నుంచి మార్చాల్సిందిగా అడుగుతున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను విశాఖ, లేదా హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో అధికారులున్నట్లు తెలిసింది. భౌతికంగా లేకుండా చేయడానికే.. సమస్య పరిష్కారమయ్యే సమయంలో చంద్రబాబు మెప్పు కోసం ఆ ఇద్దరు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసి, సమస్యను మళ్లీ మొదటికి తెచ్చి మరింత జటిలం చేశారని కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. స్వయంగా డీఐజీ స్థాయి అధికారి చెప్పాక కూడా మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేశారంటే ఆ మాటల వెనుక చంద్రబాబు ఉండవచ్చన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సమస్యను మరింత జటిలం చేసి ముద్రగడను భౌతికంగా లేకుండా చేసి, భవిష్యత్‌లో కాపు ఉద్యమాన్ని లేకుండా చేద్దామనే దురాలోచనతో సర్కారు ఉన్నట్టుగా కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సర్కారు గత ఎనిమిది రోజులుగా పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది. అసలు ఉద్యమమే లేదని నమ్మించేందుకు సాక్షి సహా పలు చానళ్ల ప్రసారాలను పూర్తిగా నిలిపివేయించింది. ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గానికే చెందిన మంత్రులతో ముద్రగడపై ఎదురుదాడి చేయించింది. ఇప్పుడు ఏకంగా ముద్రగడ ప్రాణాలతోనే చెలగాటమాడుతోంది. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం: సోమేశ్వరరావు, ముద్రగడ వియ్యంకుడు ముద్రగడ పద్మనాభంతోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్య బాగా క్షీణించింది. రక్త, మూత్ర పరీక్షల్లో ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. అయినా ముద్రగడ పట్టు వీడడంలే దు. జాతికోసం తాను చనిపోయినా ఫర్వాలేదని అంటున్నారు. ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. బాబును నమ్మి మరోసారి మోసపోయూం.. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయామని కాపు నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరు నేపథ్యంలో కాపు నేతలు పరిస్థితిని ఎప్పడికప్పుడు సమీక్షిస్తున్నారు. వాస్తవానికి రా్రష్ట్ర స్థాయి కాపునేతలు ఇచ్చిన రెండు రోజుల గడువు గురువారంతో ముగిసింది. ముద్రగడ వైద్యానికి అంగీకరించారని, చర్చలు సానుకూలమయ్యాయని తెలుసుకుని వారు సమావేశాన్ని వాయిదా వేశారు. మంత్రుల వ్యాఖ్యలు, ముద్రగడ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో రాజమహేంద్రవరంలో చర్చలు జరిపిన కాపు జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర కాపు నేతలతో మాట్లాడుతున్నారు. -
వీధికుక్కల స్వైర విహారం
మెదక్ జిల్లా దుబ్బాకలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు -
పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 12 గంటల సమయంలో గొడవ పడుతున్న నలుగురు యువకులను పెట్రోలింగ్ పోలీసులు మందలించి పంపించేశారు. గంట తర్వాత తిరిగి వారు అక్కడకు చేరుకోగా, రాకేశ్ అనే వ్యక్తిపై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. -
ఆర్కే లక్ష్మణ్ పరిస్థితి విషమం
-
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి విషమం!
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సిడ్నీలో స్థానిక జట్లతో క్రికెట్ ఆడుతున్న సందర్భంగా అతని తలకు బంతి తాకింది. సియాన్ అబోట్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఫిలిప్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయమైంది. బంతి తలకు తాకగానే అతడు కుప్పకూలిపోయాడు. దాంతో హ్యూస్ ను హుటాహుటీన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. కాగా హ్యూస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ క్లార్క్.... హ్యూస్ ఆరోగ్యంపై వాకబు చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు హ్యూస్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్‌లోనే ఉన్నారు. కాగా ఫిల్ హ్యూస్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు. గతనెల పాకిస్తాన్‌తో జరిగిన వన్డేల్లో అతను పాల్గొన్నాడు. అలాగే టీమిండియాతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు హ్యూస్ పేరు పరిశీలనలోకి వచ్చింది. -
ఆసీస్ క్రికెటర్ హ్యూగ్స్ పరిస్థితి విషమం
-
కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్
సీమ్యాట్ పరీక్ష స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని మేనేజ్మెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. మెరుగైన స్కోర్‌కు: 2015-16 విద్యా సంవత్సరానికి సీమ్యాట్ మొదటి పరీక్షను గత సెప్టెంబర్‌లో నిర్వహించారు. రెండో పరీక్షకు షెడ్యూల్ వెలువడింది. అయితే మొదటి పరీక్షకు హాజరైన అభ్యర్థులు కూడా రెండో పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా రెండు పరీక్షల్లో సాధించిన మెరుగైన స్కోర్‌ను 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. నాలుగు విభాగాలుగా: పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. విభాగం - ప్రశ్నలు - మార్కులు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటాఇంటర్‌ప్రిటేషన్ - 25 - 100 లాజికల్ రీజనింగ్ - 25 - 100 లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ - 25 - 100 జనరల్ అవేర్నెస్ - 25 - 100 మొత్తం - 100 - 400 సమాధానాలను గుర్తించడానికి మూడు గంటల సమయం (180 నిమిషాలు) కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పుకు ఒక మార్కు కోత విధిస్తారు. ప్రిపరేషన్ ఇలా: క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్: ఈ విభాగంలో ప్రధానంగా అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అంటే.. శాతాలు, లాభనష్టాలు, రేషియోస్, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ (ప్రధానంగా ఎత్తులు-దూరాలు), స్టాటిస్టిక్స్, క్వాడ్రియాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబులిటీ, నంబర్ సిస్టమ్ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: ఇందులో ముఖ్యంగా క్రిటికల్ రీజనింగ్‌లో భాగంగా ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్, ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్స్, ఇన్ఫెరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి సంబంధిత భావనలను ఆయా చాప్టర్ల నుంచి, క్యాట్ మెటీరియల్ నుంచి అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరక్షన్, వొకాబ్యులరీ బేస్డ్ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి సారించాలి. లాజికల్ రీజనింగ్: ఈ విభాగంలో లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, సెలెక్షన్స్, డిస్ట్రిబ్యూషన్ పజిల్స్, కంపారిజన్స్, బైనరీ లాజిక్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, కూడికలు-తీసివేతలు... ఇలా అన్నింటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో వివిధ బ్యాంకులు, కంపెనీలు- ప్రారంభించిన సంవత్సరాలు, ఆయా కంపెనీల అధినేతలు, రిజర్వ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వరల్డ్‌బ్యాంక్ సంబంధిత ప్రశ్నలు, ముఖ్యమైన ఆర్థిక సమావేశాలు-అవి జరిగిన ప్రదేశాలు, వ్యక్తులు-అవార్డులు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్, మనోరమ ఇయర్‌బుక్ వంటి పుస్తకాలను చదివితే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. సమాచారం: అర్హత: 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 5, 2015. కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 19-22, 2015. వెబ్సైట్: www.aicte-cmat.in -
సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న వనస్థలిపురం వద్ద సీఎం కాన్వాయ్ ఢీకొనటంతో ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే హయత్‌నగర్ పద్మావతి కాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన సూర్య ప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడించారు. వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్య ప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
స్కీయింగ్ చేస్తూ గాయపడిన షుమాకర్