కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది.
రాజమండ్రి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ముద్రగడ మాత్రం వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే యూరిన్లో కీటోన్ బాడీసీ్ పెరగడంపై ముద్రగడకు వివరించామని, కీటోన్ బాడీస్ పూర్తిగా తొలగాలంటే మూడు, నాలుగురోజుల సమయం పడుతుందన్నారు. ఆయనకు గతరాత్రి సెలైన్లు ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు బీపీ 140/80, బ్లడ్ షుగర్ 119, హిమోగ్లోబిన్ 8.8గా ఉంది.
తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఇక మంత్రుల వ్యాఖ్యలు, వైద్యానికి ముద్రగడ నిరాకరణ, ఆయన ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది.