
కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్
సీమ్యాట్ పరీక్ష స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని మేనేజ్‌మెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
సీమ్యాట్ పరీక్ష స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని మేనేజ్‌మెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
మెరుగైన స్కోర్‌కు:
2015-16 విద్యా సంవత్సరానికి సీమ్యాట్ మొదటి పరీక్షను గత సెప్టెంబర్‌లో నిర్వహించారు. రెండో పరీక్షకు షెడ్యూల్ వెలువడింది. అయితే మొదటి పరీక్షకు హాజరైన అభ్యర్థులు కూడా రెండో పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా రెండు పరీక్షల్లో సాధించిన మెరుగైన స్కోర్‌ను 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
నాలుగు విభాగాలుగా:
పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి..
విభాగం - ప్రశ్నలు - మార్కులు
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్
డేటాఇంటర్‌ప్రిటేషన్ - 25 - 100
లాజికల్ రీజనింగ్ - 25 - 100
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ - 25 - 100
జనరల్ అవేర్‌నెస్ - 25 - 100
మొత్తం - 100 - 400
సమాధానాలను గుర్తించడానికి మూడు గంటల సమయం (180 నిమిషాలు) కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పుకు ఒక మార్కు కోత విధిస్తారు.
ప్రిపరేషన్ ఇలా:
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్:
ఈ విభాగంలో ప్రధానంగా అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అంటే.. శాతాలు, లాభనష్టాలు, రేషియోస్, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ (ప్రధానంగా ఎత్తులు-దూరాలు), స్టాటిస్టిక్స్, క్వాడ్రియాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబులిటీ, నంబర్ సిస్టమ్ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్:
ఇందులో ముఖ్యంగా క్రిటికల్ రీజనింగ్‌లో భాగంగా ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్, ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్స్, ఇన్‌ఫెరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి సంబంధిత భావనలను ఆయా చాప్టర్ల నుంచి, క్యాట్ మెటీరియల్ నుంచి అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరక్షన్, వొకాబ్యులరీ బేస్డ్ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి సారించాలి.
లాజికల్ రీజనింగ్:
ఈ విభాగంలో లీనియర్ అరేంజ్‌మెంట్, సర్క్యులర్ అరేంజ్‌మెంట్, సెలెక్షన్స్, డిస్ట్రిబ్యూషన్ పజిల్స్, కంపారిజన్స్, బైనరీ లాజిక్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, కూడికలు-తీసివేతలు... ఇలా అన్నింటిపై ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ అవేర్‌నెస్:
ఈ విభాగంలో వివిధ బ్యాంకులు, కంపెనీలు- ప్రారంభించిన సంవత్సరాలు, ఆయా కంపెనీల అధినేతలు, రిజర్వ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వరల్డ్‌బ్యాంక్ సంబంధిత ప్రశ్నలు, ముఖ్యమైన ఆర్థిక సమావేశాలు-అవి జరిగిన ప్రదేశాలు, వ్యక్తులు-అవార్డులు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్, మనోరమ ఇయర్‌బుక్ వంటి పుస్తకాలను చదివితే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
సమాచారం:
అర్హత: 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 5, 2015.
కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 19-22, 2015.
వెబ్‌సైట్: www.aicte-cmat.in