Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం! | Method Of Preparing Special Dishes For Varalakshmi Vratha Bhakthi | Sakshi
Sakshi News home page

Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!

Published Fri, Aug 16 2024 8:03 AM | Last Updated on Fri, Aug 16 2024 8:03 AM

Method Of Preparing Special Dishes For Varalakshmi Vratha Bhakthi

వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.

పూర్ణాలు..
కావలసినవి..
పచ్చిశనగ పప్పు – అర కేజీ,
బెల్లం – అరకేజీ,
యాలక్కాయలు – పది,
బియ్యం – రెండు కప్పులు,
పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,
ఉప్పు – రుచికి సరిపడా,
ఆయిల్‌ – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ..
– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.
– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.
– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్‌ రానివ్వాలి.
– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.
– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.
– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్‌లో డీప్‌ ఫ్రై చేయాలి.
– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.

భక్ష్యాలు..
కావలసినవి..
పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,
బెల్లం తురుము – రెండు కప్పులు,
యాలకుల పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు,
మైదా – రెండు కప్పులు,
గోధుమ పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు,
నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,
ఉప్పు – చిటికెడు.

తయారీ..
– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. 
– నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్‌ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.
– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.
– మైదాలో గోధుమ పిండి, టేబుల్‌ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.
– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.
– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.
– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.
– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.
– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.
– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement