Varalakshmi vratam
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం (ఫొటోలు)
-
వరలక్ష్మి వ్రతం పూజలో సీనియర్ హీరోయిన్ లయ (ఫోటోలు)
-
లక్ష్మీపూజ.. తెలుగింటి ఆడపడుచుల పండుగ!
నగర జీవనంలో ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతే కనిపిస్తుంటుంది. ఆధునిక పోకడలతో మనవైన సంప్రదాయాలను పక్కనపెట్టేస్తున్నారు అనుకునే వారి ఆలోచనలకు నగరవాసులు ఎప్పుడూ కొత్త అర్థాలను చెబుతూనే ఉన్నారు. తెలుగింటి ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ బద్దంగా ఆచరించే వేడుకలలో మొట్టమొదటి వేడుక శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ పూజ. నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం సాంప్రదాయ వస్త్రధారణతో చూడముచ్చటగా అలంకరించుకుని.. తెలుగింటి వంటలు ప్రసాదాలుగా చేసి, పచ్చని తోరణాలతో, పుష్పాలతో అమ్మవారి అలంకరణలో వైభవంగా తమదైన సృజనకు మెరుగులు దిద్దుతున్నారు. – సాక్షి సిటీబ్యూరోపర్యావరణ అలంకరణ.. మట్టి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు నింపి, పువ్వులతో అలంకరించి, వాటి మధ్యలో అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారు. లిల్లి, నందివర్ధనం, మల్లెలు, తెల్ల చామంతి, తామర పువ్వులతో పాటు డెకార్ పువ్వులను కూడా వాడుతున్నారు. వాడిన ప్రతి వస్తువునూ రీ సైక్లింగ్ విధానంతో పర్యావరణ అనుకూలంగా మార్చుతున్నారు.తోరణపు కళ.. బ్యాక్ డ్రాప్స్..నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఇంటికి శోభని, శుభాన్ని కలుగజేసే వరి తోరణాలతో పాటు ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్ తోరణాలనూ అలంకరణకు ఉపయోగిస్తున్నారు. అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్లో వాడుకోవడానికి ఐదారు అడుగుల ఎత్తున్న ఫ్రేమ్‌లు రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. పచ్చని కళ రావాలంటే విస్తరాకులు, కొబ్బరి ఆకులు, తమలపాకులు, ఇలా ఏదైనా ఆకులతో చేసే బ్యాక్ డ్రాప్‌ను వాడుతున్నారు. పట్టు చీరలు, ఇండోర్ మొక్కలు, రాగి, ఇత్తడి పాత్రలు అలంరకణలో చేరాయి.భక్తిని అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందో వరలక్ష్మీ వ్రతం రోజున ఇంటి కళను బట్టి తెలిసిపోతుంది. వారం పది రోజుల ముందు నుంచే అమ్మవారి అలంకరణకు కావాల్సిన వస్తువుల ఎంపిక మొదలవుతుంది. వీటిని పూజా స్టోర్స్, ఆన్లైన్, జనరల్ స్టోర్స్, బేగం బజార్, డెకార్ ప్లేస్‌లకు వెళ్లి నచి్చనవి ఎంపిక చేసుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒక్కో డిజైన్ సెట్‌కి సాధారణంగా 2 నుంచి 10 వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి లాంటి వేడుకలకే కాదు పండగల్లోనూ కలర్‌ఫుల్ థీమ్‌తో చేసే అలంకరణలో మహిళలు తమదైన ప్రత్యేకతను చూపుతున్నారు. ముందే అడిగి.. ఐదేళ్ల క్రితం అమ్మవారి అలంకరణ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు డెకరేట్ చేస్తారు అని వెదికేవారు. అలా మేం పదిహేనేళ్లుగా వరలక్ష్మీ పూజలకు డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు సోషల్‌మీడియాలోని వీడియోలు చూసి సొంతంగా ఎవరికి వారు క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. వారి సొంతంగానే డిజైన్ చేసుకుంటున్నారు. ఈ ఆలోచన వల్ల ఆన్లైన్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. యువత తమ భక్తిని చాలా అందంగా చూపుతున్నారు. ఎలాంటి డిజైన్స్ కావాలో ముందే అడిగి మరీ అలంకరణ చేయించుకుంటున్నారు.– కల్పనారాజేష్, డెకార్ బై కృష్ణఆర్గానిక్ మెటీరియల్స్.. నా ఎంపిక ప్రతి వస్తువూ తిరిగి ఉపయోగించుకునేలా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌కి తాజా పువ్వులు వాడతాం. అమ్మవారికి కట్టే చీర హ్యాండ్లూమ్దే ఎంచుకుంటాం. తిరంగా స్టైల్లో అమ్మవారి అలంకరణ చేశాను. అమ్మవారికి ముఖం, కాళ్లూ చేతులు కొని పెట్టి, వాటిని మొత్తం సెట్ చేసి, మేమే అలంకరిస్తాం. తాంబూలాన్ని వస్త్రంతో చేసిన బ్యాగ్‌లో/ తాటాకు బుట్టలలో పెట్టి ఇస్తుంటాం. ప్రతి వస్తువూ ఆర్గానిక్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.– ప్రతిమ, వైష్ణవి రాపర్తి, వెస్ట్మారేడుపల్లిపాజిటివ్ వైబ్రేషన్స్..బిజీ జీవనంలోనూ అమ్మవారి పూజ ప్రత్యేకంగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ముందునుంచే అమ్మవారి అలంకరణకు సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకోవడం, వీలైనంతగా ముందురోజే సిద్ధం చేసుకోవడం జరుగుతుంటుంది. ప్రతియేటా ఒక ప్రత్యేకమైన కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. పిల్లలు కూడా ఈ పనిలో భాగం అవుతుంటారు. ఈ విధానం వల్ల వారిలో సృజన పెరుగుతుంది, భక్తి కూడా అలవడుతుంది.– డాక్టర్ శిరీషారెడ్డి, తార్నాక -
Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!
వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.పూర్ణాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – అర కేజీ,బెల్లం – అరకేజీ,యాలక్కాయలు – పది,బియ్యం – రెండు కప్పులు,పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.తయారీ..– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి.– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.భక్ష్యాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,బెల్లం తురుము – రెండు కప్పులు,యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు,మైదా – రెండు కప్పులు,గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు,నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,ఉప్పు – చిటికెడు.తయారీ..– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. – నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.– మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. -
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి వేళాయె
అలంకరణ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ సృజనాత్మకతను జోడిస్తూ.. మనసారా వేడుకుంటూ చేసే వరలక్ష్మి వ్రతాల్లో అలంకరణే ప్రత్యేక ఆకర్షణ. సిరుల తల్లి కట్టురొట్టు నుంచి నైవేద్యం వరకూ ప్రతిదీ కొత్తగా ఉండాలనుకుంటారు. అమ్మవారితోపాటు దీపాలు, కలశాలు, ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని కొనేందుకు మహిళలు చొరవ చూపడంతో మార్కెట్ కళకళలాడుతోంది.కడప కల్చరల్: సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నెల 16న శుక్రవారం ఈ వ్రతం నిర్వహించనున్నారు. ఇళ్లలో పవిత్ర కలశాన్ని ప్రతిష్టించి అమ్మవారి మూర్తిని దానిపై ఉంచి పూజలు చేస్తారు. ఇప్పటి నుంచే వ్రతానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు మహిళలు చొరవ చూపుతున్నారు. దీంతో గత వారం రోజులుగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, చిల్లర సరుకులు వంటి అనేక వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. అనేక పెద్ద, చిన్న వస్త్ర వ్యాపారులు శ్రావణమాసం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించటంతో మహిళలు కొనుగోలు చేయటానికి రావటంతో కళకళలాడుతున్నాయి. బంగారం.. కొనుగోలుకు ఆసక్తికలశం వద్ద కొత్తగా కొన్న బంగారు వస్తువులను ఉంచడం ఆనాటి సంప్రదాయంగా వస్తోంది. పండగ నాటికి బంగారం ఖరీదు పెరుగుతుందనే భావనతో మహిళలు ముందే కొద్దో గొప్పో బంగారం కొనుగోలు చేస్తారు. ఈ పండగ కోసమని బంగారు వ్యాపారులు ప్రత్యేకంగా తక్కువ ధర గల చిన్న వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవి రూపం గల బంగారు కాసులు, చిన్న డాలర్లు, అమ్మవారి రూపాలను ఒకటి నుంచి రెండు, మూడు గ్రాముల బరువుగల వస్తువులను విక్రయాలకు సిద్ధం చేశారు. వాటితోపాటు వెండితో చేసిన అమ్మవారి ముఖ రూపాలను అందుబాటులో ఉంచారు. కాసులు, బరువును బట్టి రూ. 2000 నుంచి రూ. 7,000 వరకు విక్రయిస్తున్నారు. బంగారు కాసులు, ముక్కు పుడకలు, చిన్న డాలర్లు, చిన్న కమ్మలకు గిరాకీ ఉందని జ్యువెలరీ దుకాణాల యజమానులు తెలిపారు. ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం కోసం మహిళలు చిన్న వస్తువులైనా కొంటారని తెలిపారు. దీనికి తోడు గత రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో వ్యాపారం జోరందుకున్నదని వ్యాపారులు చెబుతున్నారు. -
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం.. బంగారు ఆభరణాల కలెక్షన్
హైదరాబాద్: సంపద, సంతోషం, సుఖం అందించే దేవత లక్ష్మీదేవిని పూజిస్తూ చేసుకునే పవిత్ర వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ అతిపెద్ద జ్యువెలరీ బ్రాండ్– తనిష్క్ ‘ఆర్ణ’ పేరుతో ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఈ కలెక్షన్లో ప్రత్యేకమైన నెక్‌వేర్, హరామ్, వంకీలు, నడుము వడ్డాణాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్సహా అత్యంత నాణ్యమైన, విభిన్న డిజైన్లతో కూడిన బంగారం, కలర్ స్టోన్స్, ముత్యాల ఆభరణాలు ఉన్నాయి. తనిష్క్ ఆభరణాల ఎక్స్చేంజ్పై 20 శాతం వరకూ తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని సంస్థ అన్ని షోరూమ్‌లలో లభ్యమవుతుందని తనిష్క్ ప్రకటనలో పేర్కొంది. -
శ్రావణ శుక్రవారం : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
-
నాలుగు తరాల మహిళలతో వరలక్ష్మి వ్రతం: ఉపాసన
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆగస్ట్20న వరలక్ష్మీ వ్రతం కాగా, శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శుక్రవారం సందర్భంగా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది. ఇక ఈ పూజలో నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు.వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. ఆ విధంగా మెగా జనరేషన్స్ మహిళలు అందరూ ఒకే చోటకు చేరారు. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో.. నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఓ వైపు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే మరో వైపు వ్యాపారాలు, హాస్పిటల్ వ్యవహారాలను కూడా చూస్తున్నారని అంటుంటారు. ఇవే గాక సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం
అత్తిలి : ‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం.. శ్రీరంగ ధామేశ్వరీం.. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం’ అంటూ మహిళా లోకం సిరుల తల్లిని కీర్తించింది. ‘శ్రీలక్ష్మి.. జయలక్ష్మి.. జయము నీయవే. సతతము నిను అర్చింతుము సిరులనివ్వవే’ అంటూ ప్రార్థించింది. వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం ఇంటింటా ఘనంగా నిర్వహించారు. అత్తిలిలోని విజయ చాముండేశ్వరి అమ్మ వారిని లక్ష్మీదేవి రూపంలో అలంకరించిన దృశ్యమిది. -
రాజరాజేశ్వరి ఆలయానికి వెల్లువెత్తిన భక్తులు
మహేశ్వరం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తారు. దాదాపు 200ల మంది దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, 2 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. -
మల్లన్న సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు
శ్రీశైలం : శైవ మహాక్షేత్రంలో రెండవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి మండపాలలో కలశాలను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ,గాజులు, జాకెట్‌పీస్‌లతో కలశాన్ని అలంకరించి శాస్త్రోక్త రీతిలో వేదమంత్రోచ్ఛరణల మధ్య వరలక్ష్మీ వ్రతనోములను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలలో 1300 ల మందికి పైగా ముత్తైదువులు పాల్గొని వ్రతాన్ని నిర్వహించుకున్నట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. ముత్తైదువులందరికీ దేవస్థానం తరఫున అమ్మవారి శేషవస్త్రాలు, పూలు, గాజులు, ప్రసాదాలను అందజేశారు. అలాగే వ్రతాన్ని ఆచరించుకున్న వారందరికీ శ్రీశైలప్రభ సంచికను ఇచ్చి ప్రత్యేక దర్శన క్యూ ద్వారా ఉచిత దర్శనం, అనంతరం భోజన సౌకర్యాన్ని కల్పించారు. రానున్న 3,4 శ్రావణ శుక్రవారాల(సెప్టెంబర్ 2, 9తేదీలు)లో కూడా భక్తుల కోరిక మేరకు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ పేర్కొన్నారు. -
నేడు వరలక్ష్మీ వ్రతం
-
మహా పోరాటం
సాక్షి, ఏలూరు : జాతి.. మతం.. కులం.. వర్గం.. జిల్లాలో ఈ భేదాలన్నీ కనుమరుగయ్యూరుు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా కుటుంబ సభ్యుల తరహాలో ప్రజ లంతా ఒకే తాటిపైకి వచ్చారు. తెలుగు జాతి కలిసే ఉండాలని గళమెత్తి నినదిస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా జిల్లాలో చేపట్టిన ఉద్యమం శుక్రవారం 17వ రోజుకు చేరింది. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిన మహిళలు రోడ్లపైనే వ్రతాలు ఆచరించారు. సమైక్రాంధ్ర కోసం ప్రార్థించారు. ఏపీ ఎన్జీవోలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఏలూరు నగరంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. డీపీవో కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు, పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ధర్నాలు జరిగారుు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 13వ రోజుకు చేరాయి. వసంతమహల్ సెంటర్లో గాయత్రీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. సీఆర్ఆర్ విద్యాసంస్థలు, రెవె న్యూ, సర్వేయర్లు, మన కోసం సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కలయిక సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రెండో రోజూ కొనసాగింది. కొవ్వూరులో మహాధర్నా కొవ్వూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహిం చారు. రోడ్డు కం రైలు వంతెనపై 3 గంటల పాటు వేలాది మంది సమైక్యవాదులతో మహా ధర్నా జరిగింది. విభజన నిర్ణయూన్ని నిరసిస్తూ కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకున్నారు. దేవరపల్లిలో వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆయనను పరామర్శించి సంఘీభావం తెలిపారు. భీమవరంలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు రోడ్లపై కూరగాయలు అమ్మారు. అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు రిలే దీక్షలు చేశారు. రోడ్డుపైనే వరలక్ష్మి వ్రతాలు ఇళ్లల్లో ఆచరించే వరలక్ష్మి వ్రతాలను చాలాచోట్ల రోడ్లపై నిర్వహించారు. భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వొద్దని ప్రార్థించారు. పాల కొల్లు గాంధీబొమ్మల సెంటర్లో రోడ్లపై వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. సమైక్యవాదులు రోడ్లపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. మోకాళ్లపై నడక, ఆటలు, ముస్లింల మానవహారం వంటి కార్యక్రమాలు పాలకొల్లులో జరిగారుు. పెరవలి మండలం కాపవరం, వీరవాసరంలో జాతీయ రహదారిపై వంటావార్పు చేశారు. వీరవాసరంలో వీఆర్వోలు చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. ఆర్టీసి సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు వాలీ బాల్ ఆడారు. ఉండి సెంటర్లో నాయూ బ్రాహ్మణులు, ఎన్జీవోలు రాస్తారోకో నిర్వహిం చారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో వైఎన్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు వంటావార్పు చేశారు. ఈనెల 17, 18 తేదీల్లో ఆచంట మండల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. మార్టేరులో సీనియర్ సిటిజన్లు ధర్నా నిర్వహిం చారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కిన న్యాయవాదులు, ముస్లింలు తణుకులో న్యాయవాదులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నిడదవోలులో ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించి సమైక్యాంధ్రను పరిరక్షించాలని అల్లాను ప్రార్థిస్తూ తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద వందలాది ముస్లింలు గంటసేపు నమాజు చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉంగుటూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభి షేకం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా పార్థసారథి విద్యానికేతన్ స్కూల్ ఉపాధ్యాయులు దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రధాన రహదారిపై విద్యార్థులకు పాఠాలు బోధిం చారు. పెదవేగి మండలం కవ్వగుంటలో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. దేవరపల్లిలో లారీ ఓనర్స్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. నల్లజర్ల కూడలిలో అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిం చారు. వేగవరం గ్రామస్తులు వేగవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిపారు. సంగీత కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయానికి తాళాలు వేశారు. చింతలపూడి మండలంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు పోరాటం ఆగదన్నారు. లింగపాలెంలో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన చేసిన ఉద్యోగులు అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. కామవరపుకోటలో రోడ్డుపై దుస్తులు కుట్టి టైలర్లు నిరసన వ్యక్తం చేశారు. -
జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం
వేర్పాటు వద్దంటూ నడిరోడ్డుపై శ్రావణ వరలక్ష్మీ పూజలు రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని కోరుతూ పవిత్ర శ్రావణ శుక్రవారం రోజు సీమాంధ్రలోని జిల్లాల్లో మహిళలు నడిరోడ్డుపై వరలక్ష్మీ వ్రతాలు చేపట్టారు. సామూహిక పూజలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ‘వేర్పాటు’ ప్రకటన వచ్చిన దరిమిలా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా పదిహేడో రోజు శుక్రవారం కూడా ఉద్ధృతంగా సాగింది. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా సమైక్యవాదులు లెక్కచేయక పోరాటాన్ని సాగించారు. - సాక్షి నెట్వర్క్ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో హోరెత్తిస్తున్న సమైక్యవాదుల నిరసనలకు తోడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, సకజల జన అందోళనలు మిన్నంటడంతో 13జిల్లాల్లో జనజీవనం స్తంభిస్తోంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతకొనసాగుతోంది. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియాగాంధీ, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవిల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. విభజన విషయంలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సమైక్య వాదులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాఫీస్ సెంటర్లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో మహిళలు రోడ్డుపై శ్రావణ లక్ష్మీ పూజలు చేపట్టారు. నెల్లూరులో ట్రాన్స్‌కో ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించి సమైక్యాంధ్ర స్లిప్‌లు పెట్టి తాంబూలాలు పంచారు. అనంతపురంలో ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షా శిబిరంలోనే మహిళా ఉపాధ్యాయులు మహాలక్ష్మి వ్రతాన్ని పాటించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో, వైఎస్సార్ జిల్లా కడపలోనూ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పూజారుల ఆధ్వర్యంలోనూ సమైక్యలక్ష్మి పేరిట శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అర్ధశిరోముండనం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకుని కాంగ్రెస్ వేర్పాటు వాదంపై నిరసన తెలిపారు. కొవ్వూరులోని ఉభయగోదావరి జిల్లాల నడుమ గల రోడ్ కం రైల్ వంతెనపై జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి 3 గంటలపాటు మహాధర్నా చేశారు. విభజిస్తే వరికి ఉరే తణుకులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఎండిన వరి దుబ్బలను చేతపట్టుకుని రాష్ట్రాన్ని విభజిస్తే ‘వరి పంటకు ఉరి’ పడుతుందంటూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈనెల 22న భీమవరంలో 50వేల మంది రైతులతో మహాసభ నిర్వమించనున్నట్లు రైతు సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎంవీ సూర్యనారాయణరాజు ఆకివీడులో ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదని రాజకీయేతర ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజనకు వైఎస్ బీజం వేశారని కొందరు రాజకీయ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ బస్సు యాత్రలు ప్రారంభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు ప్రారంభించారు. రాజమండ్రిలో వీఎల్ పురం సాయిబాబా ఆలయం వద్ద ఉదయం ప్రారంభమైన యాత్ర తొలిరోజు లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు జరిగింది. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డు వెంకట రమణచౌదరి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ యాత్ర తొలిరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మామిడికుదురు వరకు సాగింది. ఈ యాత్రలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి కాకినాడలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున భగ్నం చేసి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎడతెరపి లేని వర్షంలోనూ.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు వీఆర్సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండు ఎదుట వంటా వార్పు నిర్వహించారు. ఆర్టీసీ అద్దె బస్సుల ర్యాలీ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బస్సుయాత్రను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రారంభించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులతో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేశారు. కృష్ణా కరకట్ట దిగ్బంధం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసిఆర్ దిష్టిబొమ్మతో ప్రధాన వీధుల వెంట శవయాత్ర నిర్వహించారు. అనంతరం మూడు గంటలపాటు కృష్ణా కరకట్టను దిగ్బంధించి పెద్దఎత్తన ఆందోళన చేయటంతో, భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ-పులిగడ్డల మధ్య గంటలసేపు రాకపోకలు స్తంభించాయి. మచిలీపట్నంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వర్షంలో తడుస్తూనే దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. వాల్మీకుల భారీ ప్రదర్శన అనంతపురం జిల్లా పెనుకొండలో పార్టీలకు అతీతంగా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ఎత్తున సమైక్యర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో, ముస్లింలు సోదలు భారీ ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో రైతులు ఎద్దులబండ్లు కట్టుకుని పట్టణమంతా సమైక్యనినాదాలతో ర్యాలీ తీశారు. అనంతపురం నగరంలో డీఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్కేయూ విద్యార్థులు వర్శిటీ నుంచి కలెక్టరేట్ సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో జోరు వానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాజిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారాలు, ఆందోళనలతో హోరెత్తించారు. కడపలో, రాయచోటిలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టి నడిరోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురంతోపాటు జిల్లాలో పలుచోట్ల రహదారులను దిగ్బంధం చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సామూహిక సెలవులు తీసుకుని రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. చీపురుపల్లిలో రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర మంత్రుల ఫొటోలపై గంగిరెద్దులు అని రాసి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రక్తం చిందించైనా.. తిరుపతి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో శుక్రవారం సమైక్యాంధ్ర చార్ట్‌కు రక్తపు తిలకం దిద్దారు. రక్తం చిందించైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చిత్తూరు జిల్లాలోని 13 ఆర్టీసీ డిపోల్లో బస్సులు రోడ్డెక్కలేదు. పుంగనూరులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, గోకుల్ కూడలిలో ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు మహాత్ముని బాటలో మేమూ.. అంటూ నోటికి మాస్క్‌లు, చెవుల్లో దూది, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. జీతాలు రాకుంటే ఉద్యమం దెబ్బతింటుంది.. ఎన్జీవోలపై టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు కర్నూలు జిల్లాలో జోరువానలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనై ఎగిసింది. కర్నూలులోని పాతబస్తీలో చిన్న వ్యాపారుల సంఘం నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్జీవోల సమ్మెకు ఇది తగిన సమయం కాదని, వారు పునరాలోచించుకోవాలని సూచించారు. రెండు నెలలు జీతాలు రాకపోతే ఎన్జీవోల ఉద్యమం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనకుండా చిత్తశుద్ధితో పాల్గొనాలని సూచిం చారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు వర్షంలో తడుస్తూ మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలులో ‘తెలంగాణ’ అధికారులకు సన్మానం ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరిలను ఘనంగా సన్మానించారు. నగర ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కొట్టారంటూ ఎపీఎన్జీఓల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరులో ఆందోళనకారులు అటవీశాఖ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆగని మృత్యుఘోష శుక్రవారం ఒక్కరోజే ఆరుగురి కన్నుమూత సాక్షి నెట్వర్క్: ‘వేర్పాటు’ భయంతో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. ఒక్క శుక్రవారం రోజునే సీమాంధ్ర జిల్లాల్లో ఆరుగురు గుండెపోటుతో మృత్యువాత వడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నాలుగు రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని దోబీఘాట్‌కు చెందిన పగిళ్ల నాగరాజు (24) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గూబగుండం గ్రామానికి చెందిన నాగరాజు(34) టీవీలో విభజన, ఉద్యమం వార్తలు చూస్తూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. ఇదే జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన పందికోన జయన్న(48) రాష్ట్రం విడిపోతే తనకు జీవనాధారం పోతుందేమోనన్న బెంగతో గుండె ఆగి శుక్రవారం కన్నుమూశాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా నార్పల మండలం నాయునిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని సాయిరాం(47), పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పెయింటర్ అంజన్‌రెడ్డి (36), శెట్టూరు మండలం మాకొడికి చెందిన నేసే కిష్టప్ప (42) గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విమానం మోత! విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సు సర్వీసులు రద్దుచేసిన విషయం విదితమే. ఇక రైళ్ళలో విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో విజయవాడ నుంచి ముఖ్య నగరాలకు వెళ్లే విమానాల చార్జీలు మోతమోగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రయాణికులకు అనువైన గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్వేస్ ధరలకు రెక్కలొచ్చాయి. గన్నవరం-హైదరాబాద్‌కు గతంలో ఉన్న రూ.2,600 టికెట్ రూ.7 వేలకు పెరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ టికెట్ రూ.5,800 నుంచి రూ.12 వేలకు, బెంగళూరు టికెట్ రూ.2,700 నుంచి రూ.6 వేలకు, చెన్నైకు రూ.2,800 ఉన్న ధర దాదాపు రూ.6 వేలకు పెరిగాయి. టికెట్ల ధర మూడింతలు పెరిగినప్పటికీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబసభ్యులు విమానయానానికి పోటీపడుతుండటం గమనార్హం. కేశినేనీ.. ఇదేం పని? సాక్షి, విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తరహాలోనే ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారు. సమైక్యవాదిగా ఉదయం పూట ఉద్యమంలో పాల్గొని బంద్‌లు చేయిస్తున్నారు. రాత్రయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్ని యథావిధిగా నడిపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 22 బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు జోరుగా నడుస్తున్నాయి. సమైక్య ఉద్యమంలో ఆయన పాల్గొంటూనే, తనకు వచ్చే లక్షల రూపాయల ఆదాయానికి గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తుకోలేకపోతున్నామని, ఇప్పుడు నాని వంటి వారి చర్యలతో ప్రజల్లో పార్టీ చులకనైపోతోందని ఆవేదన చెందుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులు నడపటాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. కేశినేని ట్రావెల్స్ బస్సుల్ని తొలుత ఆపేస్తే మిగిలిన ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఆయన దారిలోకే వస్తాయని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు.