మహేశ్వరం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తారు. దాదాపు 200ల మంది దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, 2 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.