లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం
అత్తిలి : ‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం.. శ్రీరంగ ధామేశ్వరీం.. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం’ అంటూ మహిళా లోకం సిరుల తల్లిని కీర్తించింది. ‘శ్రీలక్ష్మి.. జయలక్ష్మి.. జయము నీయవే. సతతము నిను అర్చింతుము సిరులనివ్వవే’ అంటూ ప్రార్థించింది. వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం ఇంటింటా ఘనంగా నిర్వహించారు. అత్తిలిలోని విజయ చాముండేశ్వరి అమ్మ వారిని లక్ష్మీదేవి రూపంలో అలంకరించిన దృశ్యమిది.