
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆగస్ట్20న వరలక్ష్మీ వ్రతం కాగా, శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శుక్రవారం సందర్భంగా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది.
ఇక ఈ పూజలో నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు.వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. ఆ విధంగా మెగా జనరేషన్స్ మహిళలు అందరూ ఒకే చోటకు చేరారు. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో.. నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఓ వైపు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే మరో వైపు వ్యాపారాలు, హాస్పిటల్ వ్యవహారాలను కూడా చూస్తున్నారని అంటుంటారు. ఇవే గాక సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment