సాక్షి, ఏలూరు : జాతి.. మతం.. కులం.. వర్గం.. జిల్లాలో ఈ భేదాలన్నీ కనుమరుగయ్యూరుు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా కుటుంబ సభ్యుల తరహాలో ప్రజ లంతా ఒకే తాటిపైకి వచ్చారు. తెలుగు జాతి కలిసే ఉండాలని గళమెత్తి నినదిస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా జిల్లాలో చేపట్టిన ఉద్యమం శుక్రవారం 17వ రోజుకు చేరింది. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిన మహిళలు రోడ్లపైనే వ్రతాలు ఆచరించారు. సమైక్రాంధ్ర కోసం ప్రార్థించారు. ఏపీ ఎన్జీవోలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఏలూరు నగరంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. డీపీవో కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు, పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ధర్నాలు జరిగారుు.
రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 13వ రోజుకు చేరాయి. వసంతమహల్ సెంటర్‌లో గాయత్రీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. సీఆర్‌ఆర్ విద్యాసంస్థలు, రెవె న్యూ, సర్వేయర్లు, మన కోసం సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కలయిక సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రెండో రోజూ కొనసాగింది.
కొవ్వూరులో మహాధర్నా
కొవ్వూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహిం చారు. రోడ్డు కం రైలు వంతెనపై 3 గంటల పాటు వేలాది మంది సమైక్యవాదులతో మహా ధర్నా జరిగింది. విభజన నిర్ణయూన్ని నిరసిస్తూ కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకున్నారు. దేవరపల్లిలో వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆయనను పరామర్శించి సంఘీభావం తెలిపారు. భీమవరంలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు రోడ్లపై కూరగాయలు అమ్మారు. అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు రిలే దీక్షలు చేశారు.
రోడ్డుపైనే వరలక్ష్మి వ్రతాలు
ఇళ్లల్లో ఆచరించే వరలక్ష్మి వ్రతాలను చాలాచోట్ల రోడ్లపై నిర్వహించారు. భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్‌లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వొద్దని ప్రార్థించారు. పాల కొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో రోడ్లపై వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. సమైక్యవాదులు రోడ్లపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. మోకాళ్లపై నడక, ఆటలు, ముస్లింల మానవహారం వంటి కార్యక్రమాలు పాలకొల్లులో జరిగారుు. పెరవలి మండలం కాపవరం, వీరవాసరంలో జాతీయ రహదారిపై వంటావార్పు చేశారు. వీరవాసరంలో వీఆర్వోలు చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. ఆర్టీసి సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు.
విద్యార్థులు వాలీ బాల్ ఆడారు. ఉండి సెంటర్‌లో నాయూ బ్రాహ్మణులు, ఎన్జీవోలు రాస్తారోకో నిర్వహిం చారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో వైఎన్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు వంటావార్పు చేశారు. ఈనెల 17, 18 తేదీల్లో ఆచంట మండల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. మార్టేరులో సీనియర్ సిటిజన్లు ధర్నా నిర్వహిం చారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య సంఘీభావం తెలిపారు.
రోడ్డెక్కిన న్యాయవాదులు, ముస్లింలు
తణుకులో న్యాయవాదులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నిడదవోలులో ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించి సమైక్యాంధ్రను పరిరక్షించాలని అల్లాను ప్రార్థిస్తూ తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద వందలాది ముస్లింలు గంటసేపు నమాజు చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉంగుటూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభి షేకం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా పార్థసారథి విద్యానికేతన్ స్కూల్ ఉపాధ్యాయులు దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రధాన రహదారిపై విద్యార్థులకు పాఠాలు బోధిం చారు. పెదవేగి మండలం కవ్వగుంటలో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
దేవరపల్లిలో లారీ ఓనర్స్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. నల్లజర్ల కూడలిలో అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిం చారు. వేగవరం గ్రామస్తులు వేగవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిపారు. సంగీత కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయానికి తాళాలు వేశారు. చింతలపూడి మండలంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు పోరాటం ఆగదన్నారు. లింగపాలెంలో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన చేసిన ఉద్యోగులు అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. కామవరపుకోటలో రోడ్డుపై దుస్తులు కుట్టి టైలర్లు నిరసన వ్యక్తం చేశారు.
మహా పోరాటం
Published Sat, Aug 17 2013 12:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement