
హైదరాబాద్: సంపద, సంతోషం, సుఖం అందించే దేవత లక్ష్మీదేవిని పూజిస్తూ చేసుకునే పవిత్ర వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ అతిపెద్ద జ్యువెలరీ బ్రాండ్– తనిష్క్ ‘ఆర్ణ’ పేరుతో ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను ఆవిష్కరించింది.
ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఈ కలెక్షన్‌లో ప్రత్యేకమైన నెక్‌వేర్, హరామ్, వంకీలు, నడుము వడ్డాణాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్‌సహా అత్యంత నాణ్యమైన, విభిన్న డిజైన్‌లతో కూడిన బంగారం, కలర్ స్టోన్స్, ముత్యాల ఆభరణాలు ఉన్నాయి. తనిష్క్ ఆభరణాల ఎక్స్చేంజ్‌పై 20 శాతం వరకూ తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని సంస్థ అన్ని షోరూమ్‌లలో లభ్యమవుతుందని తనిష్క్ ప్రకటనలో పేర్కొంది.