Tanishq Jewellers
-
వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం.. బంగారు ఆభరణాల కలెక్షన్
హైదరాబాద్: సంపద, సంతోషం, సుఖం అందించే దేవత లక్ష్మీదేవిని పూజిస్తూ చేసుకునే పవిత్ర వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ అతిపెద్ద జ్యువెలరీ బ్రాండ్– తనిష్క్ ‘ఆర్ణ’ పేరుతో ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఈ కలెక్షన్లో ప్రత్యేకమైన నెక్‌వేర్, హరామ్, వంకీలు, నడుము వడ్డాణాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్సహా అత్యంత నాణ్యమైన, విభిన్న డిజైన్లతో కూడిన బంగారం, కలర్ స్టోన్స్, ముత్యాల ఆభరణాలు ఉన్నాయి. తనిష్క్ ఆభరణాల ఎక్స్చేంజ్పై 20 శాతం వరకూ తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని సంస్థ అన్ని షోరూమ్‌లలో లభ్యమవుతుందని తనిష్క్ ప్రకటనలో పేర్కొంది. -
నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ రూపొందించి యాడ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళ సీమంతం వేడుక థీమ్‌తో రూపొందిన ఈ ప్రకటనపై ఓ వర్గం నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. లవ్ జీహాదీని ప్రోత్సహించేలా ఉన్న ఈ యాడ్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ విమర్శల వర్షం కురిసింది. అంతేగాక దీని కారణంగా తనిష్క్ భారీ నష్టం చవిచూస్తుందని, #BoycottTanishq పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసి ఆగ్రహం ప్రదర్శించారు. (చదవండి: యాడ్ తొలగించిన తనిష్క్.. వివరణ) దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన సంస్థ..‘‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్ చేయడమే తమ ఏకత్వం(ఈ పేరుతోనే కొత్త కలెక్షన్ ప్రవేశపెట్టింది) క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం’’ అని వివరణ ఇచ్చింది. అంతేగాకుండా మనోభావాలు గాయపడినందుకు చింతిస్తున్నామని పేర్కొంటూనే, తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు దృష్ట్యా ఈ యాడ్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. గుజరాత్లో కొంతమంది నిరసనకారులు తనిష్క్ స్టోర్‌కు వెళ్లి మరీ క్షమాపణ కోరాల్సిందిగా బెదిరింపులకు దిగారు. అంతేకాదు, ఈ వీడియో తొలగించినంత మాత్రాన, చేసిన తప్పు ఒప్పైపోదని, ఇకపై తనిష్క్ జువెలరీ కొనే ప్రసక్తే లేదంటూ మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. వీరి అభిప్రాయం ఇలా ఉంటే, ఇంకొంత మంది మాత్రం, యాడ్ తొలగించినందుకు తనిష్క్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉంటాయని, మతసామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉన్న ఈ వీడియోను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక ఈ వివాదానికి మూలకారణంగా భావిస్తున్న మతాంతర వివాహం గురించి, అటువంటి పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని జంటలు మాత్రం ఈ యాడ్ తమకు చక్కగా సరిపోతుందంటూ పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో అంతగా తప్పుపట్టాల్సిన విషయం ఏముందని, కులాలు, మతాలు వేరైనంత మాత్రాన, ప్రేమానురాగాలు, ఆప్యాయతల్లో మార్పు ఉండదని, మంచి మనసు ఉంటే అంతా కలిసి సంతోషంగా ఉండవచ్చని తమ వైవాహిక జీవితంలోని ఆనందపు క్షణాలను సోషలల్ మీడియాలో పంచుకుంటున్నారు. నా ఒడి నింపే వేడుక నటి- డైరెక్టర్ రసికా అగాషే, నటుడు మహ్మద్ జీషన్ ఆయుబ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనిష్క్ యాడ్ దుమారం నేపథ్యంలో తన సీమంతం నాటి ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘నా ఒడి నింపే కార్యక్రమం.. లవ్ జిహాద్ అని ఏడుపు లంకించుకునే ముందు ప్రత్యేక వివాహ చట్టం అని ఒకటి ఉంటుంది. దాని గురించి తెలుసుకోండి’’అని తనదైన శైలిలో చురకలు అంటించారు. ఆమెతో పాటు నటి, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ సతీమణి మినీ మాథుర్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భిన్నసంస్కృతుల కలయికగా నిలిచిన తన వివాహం తనకెన్నో సంతోషాలను, అవధులు లేని ప్రేమను పంచిందని, ద్వేష భావాన్ని విడనాడితే అంతా బాగుంటుందని పేర్కొన్నారు. ఇక వీరితో పాటు నిఖిల్ పర్వాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన జరా ఫరూఖీ అనే నెటిజన్ కూడా నాలుగేళ్ల క్రితం జరిగిన తన పెళ్లినాటి ఫొటోలను పంచుకున్నారు. ‘‘మతం మారితే ఏం మారుతుంది’’అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక మరో జంట 44 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఎన్నోకష్టాలకు ఓర్చి ఇప్పుడు ఓ ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామంటూ గోవాలోని తమ ఇద్దరి మతాచారాల మొదటి అక్షరాలు కలిసివచ్చేలా ఇంటి పేరును (హమ్- మనం)హెచ్యూఎమ్ అని పెట్టుకున్నట్లు వెల్లడించారు. -
అందుకే ఆ యాడ్ తొలగించాం: తనిష్క్
న్యూఢిల్లీ: ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ యాడ్‌కు సంబంధించిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ వెనక్కి తగ్గింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ వీడియోను 24 గంటల్లోపే తొలగించింది. ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq ట్రెండ్ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్..) ఈ మేరకు తమ యాడ్ కారణంగా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని పేర్కొంటూ సంస్థ అధికార ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్ చేయడమే ఏకత్వం క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కానీ ఇందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేకమైన స్పందనలు వచ్చాయి, ఇందుకు మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. దానితో పాటు మా ఉద్యోగులు, స్టోర్ సిబ్బంది, భాగస్వాములు అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ యాడ్‌ను వెనక్కి తీసుకుంటున్నాం’’అని వివరణ ఇచ్చారు. కాగా తనిష్క్ యాడ్ తొలగించగానే మరికొంత మంది నెటిజన్లు.. ‘‘మతసామరస్యాన్ని పెంపొందించేలా ఉన్న ఈ యాడ్‌లో తప్పేమీ లేదు. అయినా దీనిని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదు’’అంటూ వాపోయారు. రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝా వంటి ప్రముఖులు సైతం ఈ యాడ్‌ను సమర్థిస్తూ టాటా గ్రూప్, తనిష్క్ మేనేజ్మెంట్కు అండగా నిలిచారు. కాగా ఈ యాడ్‌పై ట్రోలింగ్ కారణంగా టాటా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడినట్లు బిజినెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యాడ్‌లో ఏముంది? ముస్లిం కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళకు సీమంతం చేసేందుకు అత్తింటి వాళ్లు సిద్ధపడతారు. దీంతో ఆశ్చర్యంలో మునిగిపోయిన కోడలు.. ‘‘ ఇలాంటి వేడుకలు మీ ఇంట్లో చేయరు కదా.. మరి ఇదేంటి?’’అని తన అత్తమ్మను అడుగుతుంది. ఇందుకు స్పందించిన ఆమె.. ‘‘కూతురిని సంతోషపెట్టేందుకు ప్రతి ఇంట్లోనూ ఇలాగే చేస్తారు. అంతే కదా’’అంటూ ప్రేమను చాటుకుంటుంది. అంతా కలిసి ఎంతో సంతోషంగా ఫంక్షన్లో పాల్గొంటారు. రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక అంటూ తనిష్క్ ఈ యాడ్‌ను రూపొందించింది. -
కేవలం ఆమె కోసమే; సిగ్గు పడండి!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం రూపొందించిన ప్రకటనే ఇందుకు కారణం. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ పొందుపరిచింది. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు) ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఈ యాడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉందని, ఇక నుంచి తనిష్క్ ఆభరణాలను కొనే ప్రసక్తే లేదంటూ #BoycottTanishq హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘‘కాస్తైనా సిగ్గు ఉండాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి యాడ్లు రూపొందించడం ఇకనైనా ఆపేయండి’’ అంటూ ఓ నెటిజన్ మండిపడగా.. ‘‘అయినా ప్రతీ యాడ్లోనూ హిందూ కోడలే ఎందుకు కనిపిస్తోంది. ముస్లిం కోడలిని చూపించవచ్చు కదా. నిజాన్ని చూపించే దమ్ము ఉందా. ఊరికే అడుగుతున్నా’’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఇంకొంత మంది మాత్రం సృజనాత్మకతకు ఎల్లలు ఉండవని, అయినా ఈ ప్రకటనను అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు. మతసామరస్యాన్ని పెంచే ఇలాంటి యాడ్లను ప్రశంసించకపోగా ట్రోల్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. Shame on Tanishq. Stop showing shit and propaganda disguised as advertisement. If u haven't the balls to show reality, please refrain from such moral platitudes #BoycottTanishq — মধুলিকা #Hindulivesmatter (@heartgoesboop) October 12, 2020 Why i see Hindu daughter in law everywhere....why dont you show Muslim daughter in law anywhere. Just Asking #BoycottTanishq — Ranzy Singh (@ranzysingh) October 12, 2020 -
‘తనిష్క్’ కేసులో రెండో నిందితుడు ఆనంద్
-
‘తనిష్క్’ చోరీ కేసులో రెండో నిందితుడు ఆనంద్
‘తనిష్క్’ చోరీ కేసులో రెండో నిందితుడు.. రహస్యంగా విచారణ సాక్షి, గుంటూరు/హైదరాబాద్: తనిష్క్ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు గంటినపాటి ఆనంద్ కూడా పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ పశ్చిమ మండల పోలీసులు మంగళవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షోరూమ్ సీసీ కెమెరాల్లో చిక్కింది ఆనంద్ అని నిర్ధారించిన పోలీసులు అతడిని రహస్య ప్రదేశానికి తరలించి వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దోపిడీ తర్వాత రెండు బంగారు గాజు లతో హైదరాబాద్ నుంచి పారిపోయిన ఆనంద్ సోమవారం రాత్రి విజయవాడకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి వినుకొండ, ఈపూరులో ఉంటున్న బంధువులకు ఫోన్ చేయడంతో వారే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన కిరణ్‌ను పంజాగుట్ట పోలీసులు మంగళవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా ఈపూరుకే చెందిన ఆనంద్.. కిరణ్‌కు బంధువు కావడం గమనార్హం. గతంలో మూడుసార్లు అక్కడ చిన్నచిన్న చోరీలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫిర్యాదుదారులు రాజీ పడటంతో కేసులు నమోదు కాలేదని తెలిసింది. కిరణ్ కొద్దిరోజుల క్రితం ఆనంద్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి తన గదిలోనే ఉంచుకుంటున్నాడు. తనిష్క్ షోరూమ్‌కు 2009లో కొన్ని మరమ్మతులు చేశారు. ఈ పనుల కాంట్రాక్టు చేపట్టిన కాంట్రాక్టర్ కృష్ణ కూడా గుం టూరు జిల్లా వాసి, నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందిన వారే కావడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం వెనుక ఇటుకలతో మూసివేసిన కిటికీ ఉన్నట్లు కాంట్రాక్టర్ ద్వారా వీరికి తెలిసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. తామిద్దరమే చోరీలో పాల్గొన్నట్టు ఆనంద్ వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఆనంద్ పారిపోవడంతో భయపడిన కిరణ్ బంగారాన్ని విక్రయిం చడం తేలిక కాదని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రెండు ఉంగరాలను విక్రయించడానికి సాయంత్రం వరకు ప్రయత్నించాడు. ఏ దుకాణంలోకి వెళ్లినా దొరికిపోతాననే భయంతో రోడ్డుపై కనిపించే వారికి అమ్మేందుకు యత్నించాడు. చివరికి రూ.40 వేలు ఖరీదు చేసే ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తికి రూ.12 వేలకు విక్రయించినట్టు తెలిసింది. -
తనిష్క్ చోరీ కేసులో కిరణ్ అనే వ్యక్తి లొంగుబాటు
హైదరాబాద్ : తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీ కేసులో కిరణ్ అనే ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఈ చోరీకి పాల్పడినట్లు ఆవ్యక్తి చెబుతున్నాడు. కిరణ్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా చోరీ జరిగిన రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సంస్థకు చెందిన మరో వ్యక్తి, జ్యువెలర్స్‌కు చెందిన మరొకరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మాజీ తాజా ఉద్యోగులకు సంబంధించి సమాచారం సేకరించటంతో పాటు మరికొన్ని అనుమానలను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. షోరూమ్‌కు చెందిన కొన్ని రికార్డుల్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తనిష్క్ జ్యువెలర్స్‌లో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే నిన్న ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
రూ.5.97 కోట్లే...!
తనిష్క్’లో చోరీ సొత్తు పోలీసులకు తెలిపిన యాజమాన్యం సీసీఎస్ బృందాల దర్యాప్తు ముమ్మరం పాత నేరస్తుల వివరాల సేకరణ సాక్షి, సిటీబ్యూరో : పంజగుట్ట పరిధిలోని తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తమ షోరూమ్ ధరని చెప్పడంతో వీటి మార్కెట్ విలువ రూ.8 కోట్ల వరకు ఉండచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతుచిక్కని ‘కన్నం’ విధానం బంగారం దుకాణంలో చోరీ జరిగిన తీరును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. వెనుక వైపు అనువైన ప్రాంతాన్ని దుండగులు ఎలా గుర్తించారన్న దానితో పాటు లోపలకు ప్రవేశించిన తరవాత నేరుగా స్విచ్‌బోర్డ్ వద్దకు వెళ్లి లైట్లను ఎలా ఆర్పగలిగారు? అనే వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మూడో పిల్లర్‌కు పక్కగా, రెండు షెల్ఫ్‌లకు మధ్యలో కచ్చితంగా రంధ్రం చేడయం, స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉందో వారికి తెలియడం వెనుక తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ సెక్యూరిటీ గార్డులు, ఉద్యోగులతో పాటు సంస్థకు మరమ్మతులు చేసిన మేస్త్రీల వివరాలు రాబడుతున్నారు. ఇది కచ్చితంగా బయటి రాష్ట్రాలకు చెందిన ముఠాల పనిగా చెప్పలేమని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నమని సీసీఎస్ అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకూ సమాచారం దర్యాప్తులో భాగంగా పాత నేరగాళ్ల వివరాలను సేకరిస్తున్న పోలీసులు వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. చోరీ కోసం దుకాణంలోకి ప్రవేశించిన దొంగ ఎడమకాలు కుంటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ తరహా అంగవైకల్యం కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన దోపిడీ దొంగ గతంలో ఎస్సార్‌నగర్ స్టేట్‌హోమ్ సమీపంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో దోపిడీకి పాల్పడ్డాడు. అలాగే పంజగుట్టలోని ఉన్న జాయ్ అలుక్కాస్ షోరూమ్‌లో 2006లో చోరీ చేసిన ముంబై వాసి వినోద్రాంబోలీ సింగ్‌ను అనుమానితుల జాబితాలో చేర్చారు. వీరిద్దరి వివరాలను కోరుతూ యూపీ, ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాంబోలీసింగ్ను ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో ఉన్న మరికొన్ని, బీహార్ తదితర పోలీసులకు తనిష్క్లో రికార్డు అయిన సీసీ కెమెరా ఫీడ్‌ను పంపాలని నిర్ణయించారు. అన్ని కోణాల్లో ఆరా ఈ చోరీలో దుండగులు ఆధారం విడిచిపెట్టకపోవడంతో పోలీసులు సెల్‌ఫోన్, సిగ్నల్ వంటివి విశ్లేషిస్తూ సాంకేతికంగా, సంప్రదాయ పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ తరహా చోరీలు చేసేవారి (ఎంఓ క్రిమినల్స్) వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి వచ్చిన వాళ్లు ఎక్కడో ఒకచోట షెల్టర్ తీసుకుని ఉంటారనే అనుమానంతో నగరంలోని లాడ్జిలు, హోటళ్లలోనూ వివరాలు సేకరిస్తున్నారు. మరోపక్క ఘటనాస్థలి నుంచి నిపుణులు పదుల సంఖ్యలో వేలిముద్రలు సేకరించారు. శని-ఆదివారాల్లో తనిష్క్లో పని చేసే వారి వేలిముద్రల్ని సేకరించి విశ్లేషిస్తున్నారు. షోరూమ్ సీసీ కెమెరాల్లో వారం రోజులుగా రికార్డైన ఫీడ్, చుట్టు పక్కల దుకాణాల్లోదీ సేకరించి విశ్లేషించడం ప్రారంభించారు. -
పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’
నగరం నడిబొడ్డున.. పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’ లోపల గంటకుపైగా తీరిగ్గా గడిపిన వైనం పక్కా ప్రొఫెషనల్స్ పనేనా? 9 కౌంటర్ల నుంచి రూ.23 కోట్ల విలువైన 30 కేజీల పసిడి తస్కరణ సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పంజగుట్టలోని తనిష్క్ జ్యువెలర్స్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారం, విలువైన రాళ్లు పొదిగిన నగల్ని మూటగట్టుకుపోయాడు. పక్కా ప్రొఫెషనల్ నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసును నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)కు బదిలీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి.. దొంగ మొదట స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి లైట్లన్నీ ఆర్పాడు. దీన్నిబట్టి అంతకుముందు దుకాణం లోపలి నుంచి కూడా రెక్కీ చేశాడా? లేదా తెలిసిన వారు సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన రహదారిపైనే దుకాణం పంజగుట్ట కూడలి నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ ముగింపు దగ్గర తేజస్విని ప్లాజా ఉంది. ఇందులో టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన తనిష్క్ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇది సెల్లార్+జీ+టూ భవనం కాగా... సెల్లార్లో పార్కింగ్, కింది అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వజ్రాభరణాల విక్రయ విభాగాలు, రెండో అంతస్తులో సంస్థ పాలనా కార్యాలయం ఉన్నాయి. కింది అంతస్తులోనే ప్రధాన ద్వారం ఉంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసివేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ వచ్చి దుకాణం తెరిచి లోపలకు వెళ్లారు. నగల విక్రయ విభాగంలోని 9 కౌంటర్లలో ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా.. రంధ్రం పరిమాణంతో పాటు ఇతర ఆధారాలను బట్టి పోలీసులు 25-30 ఏళ్ల మధ్య వయస్కుడైన బక్కపలుచని వ్యక్తి లోపలకు వచ్చినట్లు నిర్ధారించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడిన దుండగుడు గంటా పదిహేను నిమిషాల పాటు తచ్చాడుతూ, తీరిగ్గా చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు ఎడమకాలు కుంటుతున్నట్లు గుర్తించారు. ముఖకవళికలు తెలియకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, పాదముద్రలు చిక్కకుండా కాళ్లకు పాలథిన్ కవర్లు ధరించాడు. రంధ్రంలోంచి లోపలకు వస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా పాదాల పై భాగంలో గోనెసంచులు కట్టుకున్నాడు. లోపల మొత్తం 15 కౌంటర్లు, డిస్ప్లేలు ఉండగా, తొమ్మిది కౌంటర్లలోని బంగారాన్ని ఖాళీ చేశాడు. డిస్ప్లేల జోలికి పోలేదు. పోలీసు జాగిలాలకూ ఆధారం దొరక్కుండా.. వెంట కారం తీసుకెళ్లి, అవి వాసన పీల్చే అవకాశం లేకుండా పలుచోట్ల చల్లాడు. పై అంతస్తులో వజ్రాభరణాలున్నాయని, దుండగుడు అక్కడికీ వెళ్లి ఉంటే చోరీ సొత్తు విలువ భారీగా ఉండేదని పోలీసులు చెప్పారు. దాదాపు 30 కేజీల సొత్తు తస్కరణకు గురైంది. చోరీ తీరును అధ్యయనం చేసిన పోలీసులు.. బయట మరో ఇద్దరైనా కాపు కాసి ఉంటారని అనుమానిస్తున్నారు. రంధ్రం నుంచి ముందు చేతులు పెట్టిన దొంగ ఆ తరవాత తలపెట్టి లోపలకు రావడం సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసు జాగిలం దుకాణం లోపలకెళ్లి చోరీ జరిగిన భవనం వెనక వైపు తిరిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న టోపాజ్ భవనం పక్క సందులోకి వెళ్లింది. ‘పాత కిటికీ’ని పగులగొట్టి లోపలకు.. తేజస్విని ప్లాజాకు వెనుక వైపు ఓ కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని ప్రహరీగోడకు, తేజస్విని ప్లాజా గోడకు మధ్య రెండడుగుల ఖాళీ సందు ఉంది. కాంప్లెక్స్ ప్లాజా కంటే ఎత్తులో ఉండటంతో, దాని గ్రౌండ్ ఫ్లోర్ దీని ఫస్ట్‌ఫ్లోర్‌కు సమాన ఎత్తులో ఉంది. కాగా, జ్యువెలర్స్ నిర్వాహకులు.. భద్రత నిమిత్తం భవనం గోడలకు ఎవరూ రంధ్రం వేయడం సాధ్యం కాకుండా లోపల ఇనుప మెష్‌లు ఏర్పాటు చేశారు. అయితే కింది అంతస్తులోని బంగారం విభాగంలో మూడో పిల్లర్ పక్కన గతంలో కిటికీ ఉండేది. కొన్నేళ్ల క్రితం దీన్ని మూసేయడంతో అక్కడ ఇనుప మెష్ ఏర్పాటుకు ఆస్కారం లేకపోయింది. భవనం ఎడమ వైపు కాంప్లెక్స్‌కు దారితీసే మార్గం నుంచి సందు వరకు చేరుకున్న దుండగుడు.. బయటి వైపు నుంచి పాత కిటికీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడే రంధ్రం చేసి లోపలకు చొరబడ్డాడు. పాత నేరగాళ్ల పనిగా అనుమానం.. తనిష్క్ జీఎం మణికందన్ ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ రూ.12 కోట్లు) చోరీ అయినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాత నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు నగరం, ఇతర రాష్ట్రాల ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో దొంగ కుంటుతున్నట్లు ఉంది. నిజంగానే అంగవికలుడా? లేక పోలీసుల దృష్టి మరల్చడానికి అలా చేశాడా? అనేది పరిశీలిస్తున్నారు. సీసీఎస్ అధికారులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్యాప్తు చేయడంతో పాటు ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. పంజగుట్ట ప్రాంతంలోని ట్రాఫిక్ కెమెరాలు, పబ్లిక్ ప్లేసులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివార్లలోని టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సంస్థకు చెందిన వారు చోరులకు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, సీఐ తిరుపతిరావు, డీఐ సత్తయ్య పరిశీలించారు. అనురాగ్ శర్మ మాట్లాడుతూ... సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిర్లక్ష్యం ఖరీదు! ఘటనలో సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో పూర్తిగా నిద్రపోయి ఉంటారని భావిస్తున్నారు జ్యువెలర్స్‌ను రాత్రి మూసివేసేట ప్పుడు నగలు, బంగారాన్ని కౌంట ర్లు, డిస్ప్లేల్లోంచి తీసి కట్టుదిట్టమైన చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు. తనిష్క్ నిర్వాహకులు ఆ పని చేయలేదు రూ.కోట్ల విలువైన సరుకు ఉండే, లావాదేవీలు చేసే ఈ దుకాణం బయట, వెనుక సీసీ కెమెరాల్లేవు పక్కా రెక్కీ చేశాకే చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఘటనకు రెండ్రోజుల ముందు దుకాణానికి కస్టమర్లా వచ్చి వెళ్లిన ఓ అనుమానితుడిని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒకరోజు ముందు ఓ అనుమానితుడు దుకాణం వద్ద తచ్చాడాడని స్థానికులు చెబుతున్నారు శుక్రవారం రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. దుకాణం వెనుక వైపు సందులో గడ్డపారలు, ఇతర వస్తువులతో రంధ్రం చేయడం సాధ్యం కాదు. దీన్నిబట్టి దుండగులు డ్రిల్లింగ్ మిషన్ వాడినట్లు పోలీసులు తేల్చారు. ఈ శబ్దాన్ని సెక్యూరిటీ గార్డులు వినలేదు తొమ్మిది అంగుళాల మందం గల గోడకు 1.5 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో రంధ్రం చేశాడు. అంతసేపూ గార్డులు పసిగట్టలేదు ఒక్కో కౌంటర్లోనూ చోరీ తరవాత దొంగ ఆ సొత్తును బయట ఉన్న మరో వ్యక్తికి రంధ్రం ద్వారా అందిస్తున్నట్లు కెమెరాల్లో అస్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారమూ సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు ఉదయం సంస్థకు వచ్చిన మణికందన్ లోపలకు వెళ్లి గుర్తించే వరకు చోరీ అంశం సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు. దొంగలు దుకాణం ముందు కారం చల్లినా గార్డులు గుర్తించలేదు. -
తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’
నగరం నడిబొడ్డున.. పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’ లోపల గంటకుపైగా తీరిగ్గా గడిపిన వైనం పక్కా ప్రొఫెషనల్స్ పనేనా? 9 కౌంటర్ల నుంచి రూ.23 కోట్ల విలువైన 30 కేజీల పసిడి తస్కరణ సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పంజగుట్టలోని తనిష్క్ జ్యువెలర్స్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారం, విలువైన రాళ్లు పొదిగిన నగల్ని మూటగట్టుకుపోయాడు. పక్కా ప్రొఫెషనల్ నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసును నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)కు బదిలీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి.. దొంగ మొదట స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి లైట్లన్నీ ఆర్పాడు. దీన్నిబట్టి అంతకుముందు దుకాణం లోపలి నుంచి కూడా రెక్కీచేశాడా? లేదా తెలిసిన వారు సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన రహదారిపైనే దుకాణం పంజగుట్ట కూడలి నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ ముగింపు దగ్గర తేజస్విని ప్లాజా ఉంది. ఇందులో టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన తనిష్క్ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇది సెల్లార్+జీ+టూ భవనం కాగా... సెల్లార్లో పార్కింగ్, కింది అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వజ్రాభరణాల విక్రయ విభాగాలు, రెండో అంతస్తులో సంస్థ పాలనా కార్యాలయం ఉన్నాయి. కింది అంతస్తులోనే ప్రధాన ద్వారం ఉంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసివేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ వచ్చి దుకాణం తెరిచి లోపలకు వెళ్లారు. నగల విక్రయ విభాగంలోని 9 కౌంటర్లలో ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా.. రంధ్రం పరిమాణంతో పాటు ఇతర ఆధారాలను బట్టి పోలీసులు 25-30 ఏళ్ల మధ్య వయస్కుడైన బక్కపలుచని వ్యక్తి లోపలకు వచ్చినట్లు నిర్ధారించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడిన దుండగుడు గంటా పదిహేను నిమిషాల పాటు తచ్చాడుతూ, తీరిగ్గా చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు ఎడమకాలు కుంటుతున్నట్లు గుర్తించారు. ముఖకవళికలు తెలియకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, పాదముద్రలు చిక్కకుండా కాళ్లకు పాలథిన్ కవర్లు ధరించాడు. రంధ్రంలోంచి లోపలకు వస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా పాదాల పై భాగంలో గోనెసంచులు కట్టుకున్నాడు. లోపల మొత్తం 15 కౌంటర్లు, డిస్ప్లేలు ఉండగా, తొమ్మిది కౌంటర్లలోని బంగారాన్ని ఖాళీ చేశాడు. డిస్ప్లేల జోలికి పోలేదు. పోలీసు జాగిలాలకూ ఆధారం దొరక్కుండా.. వెంట కారం తీసుకెళ్లి, అవి వాసన పీల్చే అవకాశం లేకుండా పలుచోట్ల చల్లాడు. పై అంతస్తులో వజ్రాభరణాలున్నాయని, దుండగుడు అక్కడికీ వెళ్లి ఉంటే చోరీ సొత్తు విలువ భారీగా ఉండేదని పోలీసులు చెప్పారు. దాదాపు 30 కేజీల సొత్తు తస్కరణకు గురైంది. చోరీ తీరును అధ్యయనం చేసిన పోలీసులు.. బయట మరో ఇద్దరైనా కాపు కాసి ఉంటారని అనుమానిస్తున్నారు. రంధ్రం నుంచి ముందు చేతులు పెట్టిన దొంగ ఆ తరవాత తలపెట్టి లోపలకు రావడం సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసు జాగిలం దుకాణం లోపలకెళ్లి చోరీ జరిగిన భవనం వెనక వైపు తిరిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న టోపాజ్ భవనం పక్క సందులోకి వెళ్లింది. ‘పాత కిటికీ’ని పగులగొట్టి లోపలకు.. తేజస్విని ప్లాజాకు వెనుక వైపు ఓ కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని ప్రహరీగోడకు, తేజస్విని ప్లాజా గోడకు మధ్య రెండడుగుల ఖాళీ సందు ఉంది. కాంప్లెక్స్ ప్లాజా కంటే ఎత్తులో ఉండటంతో, దాని గ్రౌండ్ ఫ్లోర్ దీని ఫస్ట్‌ఫ్లోర్‌కు సమాన ఎత్తులో ఉంది. కాగా, జ్యువెలర్స్ నిర్వాహకులు.. భద్రత నిమిత్తం భవనం గోడలకు ఎవరూ రంధ్రం వేయడం సాధ్యం కాకుండా లోపల ఇనుప మెష్‌లు ఏర్పాటు చేశారు. అయితే కింది అంతస్తులోని బంగారం విభాగంలో మూడో పిల్లర్ పక్కన గతంలో కిటికీ ఉండేది. కొన్నేళ్ల క్రితం దీన్ని మూసేయడంతో అక్కడ ఇనుప మెష్ ఏర్పాటుకు ఆస్కారం లేకపోయింది. భవనం ఎడమ వైపు కాంప్లెక్స్‌కు దారితీసే మార్గం నుంచి సందు వరకు చేరుకున్న దుండగుడు.. బయటి వైపు నుంచి పాత కిటికీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడే రంధ్రం చేసి లోపలకు చొరబడ్డాడు. పాత నేరగాళ్ల పనిగా అనుమానం.. తనిష్క్ జీఎం మణికందన్ ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ రూ.12 కోట్లు) చోరీ అయినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాత నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు నగరం, ఇతర రాష్ట్రాల ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో దొంగ కుంటుతున్నట్లు ఉంది. నిజంగానే అంగవికలుడా? లేక పోలీసుల దృష్టి మరల్చడానికి అలా చేశాడా? అనేది పరిశీలిస్తున్నారు. సీసీఎస్ అధికారులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్యాప్తు చేయడంతో పాటు ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. పంజగుట్ట ప్రాంతంలోని ట్రాఫిక్ కెమెరాలు, పబ్లిక్ ప్లేసులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివార్లలోని టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సంస్థకు చెందిన వారు చోరులకు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, సీఐ తిరుపతిరావు, డీఐ సత్తయ్య పరిశీలించారు. అనురాగ్ శర్మ మాట్లాడుతూ... సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిర్లక్ష్యం ఖరీదు! ఘటనలో సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో పూర్తిగా నిద్రపోయి ఉంటారని భావిస్తున్నారు జ్యువెలర్స్‌ను రాత్రి మూసివేసేట ప్పుడు నగలు, బంగారాన్ని కౌంట ర్లు, డిస్ప్లేల్లోంచి తీసి కట్టుదిట్టమైన చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు. తనిష్క్ నిర్వాహకులు ఆ పని చేయలేదు రూ.కోట్ల విలువైన సరుకు ఉండే, లావాదేవీలు చేసే ఈ దుకాణం బయట, వెనుక సీసీ కెమెరాల్లేవు పక్కా రెక్కీ చేశాకే చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఘటనకు రెండ్రోజుల ముందు దుకాణానికి కస్టమర్లా వచ్చి వెళ్లిన ఓ అనుమానితుడిని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒకరోజు ముందు ఓ అనుమానితుడు దుకాణం వద్ద తచ్చాడాడని స్థానికులు చెబుతున్నారు శుక్రవారం రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. దుకాణం వెనుక వైపు సందులో గడ్డపారలు, ఇతర వస్తువులతో రంధ్రం చేయడం సాధ్యం కాదు. దీన్నిబట్టి దుండగులు డ్రిల్లింగ్ మిషన్ వాడినట్లు పోలీసులు తేల్చారు. ఈ శబ్దాన్ని సెక్యూరిటీ గార్డులు వినలేదు తొమ్మిది అంగుళాల మందం గల గోడకు 1.5 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో రంధ్రం చేశాడు. అంతసేపూ గార్డులు పసిగట్టలేదు ఒక్కో కౌంటర్లోనూ చోరీ తరవాత దొంగ ఆ సొత్తును బయట ఉన్న మరో వ్యక్తికి రంధ్రం ద్వారా అందిస్తున్నట్లు కెమెరాల్లో అస్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారమూ సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు ఉదయం సంస్థకు వచ్చిన మణికందన్ లోపలకు వెళ్లి గుర్తించే వరకు చోరీ అంశం సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు. దొంగలు దుకాణం ముందు కారం చల్లినా గార్డులు గుర్తించలేదు.