preparation
-
ఈ వెరైటీ వంటకాలను ఓసారి ట్రై చేయండి..!
బ్రింజాల్ పిజ్జా..కావలసినవి..వంకాయలు– 3 లేదా 4 (కొంచెం పెద్ద సైజువి తీసుకుంటే పిజ్జాలు బాగా వస్తాయి)ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్బేబీ టమాటో– 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)మోజరెలా చీజ్– అర కప్పువెల్లుల్లి తురుము, మిరియాల పొడి– తగినంతఉప్పు– తగినంత, తులసి ఆకులు– కొన్నితయారీ..– ముందుగా ఒక్కో వంకాయను శుభ్రం చేసుకుని గుండ్రంగా మూడు లేదా నాలుగు చక్రాల్లా కట్ చేసుకుని ఆలివ్ నూనెలో ముంచాలి.– అనంతరం వాటిని ఒక ట్రేలో వరుసగా పేర్చుకుని, వాటిపై కొద్దిగా మోజరెలా చీజ్ వేసి, ఐదు నిమిషాల పాటు ఓవెన్లో దోరగా బేక్ చేసుకోవాలి.– అనంతరం ముక్కలను బయటికి తీసి, వాటిపై మిరియాల పొడి, వెల్లుల్లి తురుము, చిన్నచిన్న టమాటో ముక్కలు, మోజరెలా చీజ్ చల్లుకోవాలి.– మరోసారి ఆ ట్రేను ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకోవాలి. వాటిని తులసి ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.పొద్దుతిరుగుడు లడ్డూ..కావలసినవి..పొద్దుతిరుగుడు గింజలు– 1 కప్పుబెల్లం తురుము– 1 కప్పునీళ్లు– పాకానికి సరిపడాకొబ్బరి తురుము– పావు కప్పునెయ్యి– 3 టేబుల్ స్పూన్లుతయారీ..– ముందుగా పొద్దుతిరుగుడు గింజలను నేతిలో దోరగా వేయించి, మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసుకుని పాకం పెట్టుకోవాలి.– చల్లారాక వడకట్టుకుని, అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పొద్దుతిరుగుడు గింజల పొడి, కొబ్బరి తురుము వేసుకుని, ముద్దలా చేసుకోవాలి.– అవసరం అయితే అదనంగా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.టమాటో హల్వా..కావలసినవి..టమాటోలు– 10, పంచదార– 1 కప్పునెయ్యి– అరకప్పు, బొంబాయి రవ్వ– ఒక కప్పునట్స్– రెండు గుప్పిళ్లు, ఫుడ్ కలర్– అభిరుచిని బట్టిఏలకుల పొడి– అర టీస్పూనుతయారీ..– ముందుగా టమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసుకుని గుజ్జులా చేసుకుని, బౌల్లోకి వేయాలి.– ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నట్స్, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.– ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.– నీళ్లు మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.– రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమాటో గుజ్జు, పంచదార, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.– ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఫుడ్ కలర్, ఏలకుల పొడి చల్లి, బాగా కలిపి దించేయాలి.– తరువాత బౌల్ లోపల కాస్త నెయ్యి రాసి, సగానికి పైగా హల్వాని వేయాలి.– తర్వాత నట్స్ చల్లుకుని, మిగిలిన హల్వా కూడా పైన వేసుకుని పరచుకోవాలి. గాలికి చల్లారి దగ్గరపడిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: -
Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!
వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.పూర్ణాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – అర కేజీ,బెల్లం – అరకేజీ,యాలక్కాయలు – పది,బియ్యం – రెండు కప్పులు,పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.తయారీ..– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి.– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.భక్ష్యాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,బెల్లం తురుము – రెండు కప్పులు,యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు,మైదా – రెండు కప్పులు,గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు,నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,ఉప్పు – చిటికెడు.తయారీ..– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. – నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.– మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
లాజిక్ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్ కొట్టు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అత్యంత కీలకమైంది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఇందులో అర్హత కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు. మెయిన్స్‌లో మంచి ర్యాంకు వ చ్చి, అడ్వాన్స్‌డ్‌లో రాకపోయినా ఆనందించే వాళ్లూ ఉంటారు. అయితే, జేఈఈలో విజయం సాధించడానికి కృషితో పాటు కొన్ని లాజికల్ అంశాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఏ ర్యాంకుతో ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే అవగాహన ఉండదు. మెయిన్స్ ర్యాంకుతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఈసారి మారిన సిలబస్ కొంత ఒత్తిడిని తగ్గించే వీలుంది. కాబట్టి మెయిన్స్ ర్యాంకుల పట్ల ఉన్న అపోహలు దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకు ఉంటేనే ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయని భావిస్తారు. దీంతో తుది దశ కౌన్సెలింగ్ వరకూ ఉండకుండా ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ర్యాంకర్లు కూడా రాష్ట్ర కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ప్రయత్నిస్తారు. కౌన్సెలింగ్ జిమ్మిక్కు పూర్తిగా అర్థమైతే తప్ప దీని నుంచి బయటపడటం కష్టం. అందుకే మెయిన్స్‌కు వెళ్లే విద్యార్థులు గత కొన్నేళ్ల ర్యాంకులు, సీట్ల వివరాలపై ముందే కొంత కసరత్తు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీ కూడా లక్ష్యం కావాలి..: మెయిన్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతను బట్టి ఓ అంచనాకు రావాలి. మూడేళ్ల కటాఫ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ర్యాంకు వస్తుందో గుర్తించాలి. దీని ఆధారంగానే ఏయే కాలేజీల్లో ఎంత వరకూ సీట్లు వచ్చాయనేది తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056 సీట్లు, ఐఐఐటీల్లో 5,643 సీట్లు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌తో భర్తీ చేసే 16,050 ఐఐటీ సీట్లను పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లను జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. కొన్నేళ్లుగా సీట్ల కేటాయింపును పరిశీలిస్తే, వరంగల్ నిట్‌లో సీఎస్ఈకి అబ్బాయిలకు 3,089 ర్యాంకు, అమ్మాయిలకు 3,971 వరకూ సీటు వస్తుంటే, ఏపీలో అబ్బాయిలకు 14,000 ర్యాంకు, అమ్మాయిలకు 28,000 ర్యాంకు వరకు సీటు వస్తోంది. ఒబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13,000 వరకూ, ఏపీలో 33,000 ర్యాంకు వరకూ సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకి గరిష్టంగా 97,139 వరకూ, ఎస్టీలకు 48,000 ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. సిలబస్ మారడంతో ఈసారి కొంత పోటీ ఉండొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాంకు, కాలేజీని టార్గెట్‌గా పెట్టుకోవాలన్నది జేఈఈ అధ్యాపకుల సూచన. బ్రాంచే టార్గెట్ అనుకుంటే... చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ కోసం ఎదురు చూస్తారు. అందుకే ఓపెన్ కేటగిరీలో ఈ బ్రాంచీ సీట్లకు పోటీ ఉంటుంది. ఒకవేళ బ్రాంచీనే లక్ష్యమైతే ఫలానా కాలేజీలో కావాలనే టార్గెట్ పెట్టుకోకూడదు. కొన్ని ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీకి కూడా 40,000 ర్యాంకు వ చ్చినా సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇవేంటో విద్యార్థులు తెలుసుకోవాలి. మెకానికల్ డివిజన్లో ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17,000 వరకూ, ఏపీలో 75,000 వరకూ ర్యాంకులకు సీటొచ్చే వీలుంది. రిజర్వేషన్ విభాగంలో ఏకంగా 2,96,201 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరు చ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా జేఈఈ ర్యాంకు గరిష్టంగా 50,000 దాటినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. కాబట్టి కోరుకున్న బ్రాంచీ, ఏ కాలేజీలో వస్తుందనే కసరత్తు చేయడం ముఖ్యం. ఈ లాజిక్ తెలిస్తే ప్రిపరేషన్ అందుకు తగ్గట్టుగా ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. -
‘వైఎస్సార్ పర్యావరణ’ భవనాలు సిద్ధం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. మటన్ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది. రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి? లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం.. లాలూ: అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం. రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ? లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు. మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభం
శ్రీనగర్: ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ విజయ్ కుమార్ బిధూరి. జులై 1 నుండి ఆగస్టు 31 వరకు సాగే ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఏర్పాట్లు షురూ.. రెండు నెలలపాటు జరిగే ఈ యాత్ర ఏర్పాట్ల విషయమై శ్రీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై 62 రోజులపాటు కొనసాగి ఆగస్టు 31న ముగుస్తుంది. దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండే యాత్ర ఆద్యంతం వారికి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దారి పొడవునా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. క్యాంపుల సామర్ధ్యాన్ని పెంచి ఒక్కోచోట సుమారు 75000 మందికి పైగా భక్తులకు వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నాము. వ్యర్ధాలను తొలగించడానికి ప్రతి క్యాంపులోనూ అంతర్గతంగా నిర్మించిన వ్యవస్థలను ఏర్పాటు చేశాము. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సుమారు 8-9 లక్షల మంది హాజరయ్యే అవకాశముందన్నారు. హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో.. రిజర్వేషన్ కౌంటర్లు, తత్కాల్ రిజర్వేషన్లు, సాంకేతిక సదుపాయాలు, వైఫై, విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలు, పారిశుధ్యం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లన్నిటినీ జమ్మూ డిప్యూటీ కమీషనర్ అవ్ని లవాస పర్యవేక్షణలో జరుగుతున్నాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా.. ప్రతీ ఏటా వైభవోపేతంగా జరిగే అమర్నాథ్ యాత్రకు దేశవిదేశాల నుంచి లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. హిమాలయాల నడుమ కోలాహలంగా జరిగే ఈ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి శివనామస్మరణ చేసి తరించాలనుకుంటారు భక్తులు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారని అంచనా. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ? -
'శిక్షణ' కాలం.. సర్కారు కొలువుల కోసం సిద్ధమవుతున్న యువత
సాక్షి, హైదరాబాద్: వరుసగా ప్రభుత్వ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెలువడటం, మరికొన్ని పోస్టులకూ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇటీవలే డిగ్రీ పూర్తిచేసిన వారి నుంచి ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిదాకా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో వ్యక్తిగతంగా సిద్ధమవడం కంటే కోచింగ్ సెంటర్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో తెరిచిన చిన్నపాటి శిక్షణ కేంద్రాలు మొదలు.. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత కోచింగ్ సెంటర్ల దాకా అన్నీ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు నిర్దిష్ట సబ్జెక్టులను ఎంచుకుని శిక్షణ తీసుకుంటుండగా.. మరికొందరు ప్యాకేజీ రూపంలో అన్నిరకాల కోచింగ్ పొందుతున్నారు. ఈ అవసరాలను గుర్తిస్తున్న కోచింగ్ సెంటర్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆదరాబాదరాగా తరగతులు.. చాలాచోట్ల గ్రూప్–1 మెయిన్స్ శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. మా ఇన్స్టిట్యూట్లో దాదాపు 40 శాతం సిలబస్ పూర్తిచేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. వాస్తవానికి వేగంగా సిలబస్ పూర్తి చేయాలన్న తొందర కోచింగ్ సెంటర్ నిర్వాహ కుల్లో కనిపిస్తోంది. ఆదరాబాదరాగా సిలబస్ పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తోంది. పరీక్షలు ప్రారంభమయ్యే వరకు శిక్షణ ఇస్తామని, రివిజన్ కూడా ఉంటుందని అంటున్నారు. – పి.అనూష,గ్రూప్–1 మెయిన్స్ అభ్యర్థి లోతైన అవగాహన అవసరం గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు ప్రత్యేక కోచింగ్ ఏమీ తీసుకో లేదు. మెయిన్స్ కోసం వారం రోజులుగా శిక్షణ æకేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజు అధికంగా చెప్తుండటంతో కాస్త ఆలోచనలో పడ్డాను. రెండు సబ్జెక్టులకు నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటున్నా.. పూర్తిస్థాయి శిక్షణకు కోచింగ్ కేంద్రాల కోసం చూ స్తున్నాను. చాలాచోట్ల లోతైన అవగాహన లేకుండా సాధారణ పద్ధతిలోనే శిక్షణ ఇస్తుండగా.. కొన్నిచోట్ల అంశాలను వివరిస్తూ చదువుకోవాలని సూచిస్తు న్నారు. ఏ విధానం సరైనదో అర్థంగాక గందరగోళంగా ఉంది. – షెహనాజ్, గ్రూప్–1 మెయిన్స్ అభ్యర్థి ఎక్కువగా గ్రూప్–1 అభ్యర్థులు ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్.. మెయిన్స్ పరీక్షలకు 25 వేల మందిని ఎంపిక చేసింది. ఈ అభ్యర్థుల్లో 65 శాతం మంది కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నట్టు అంచనా. గ్రూప్–1 మెయిన్స్ శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లు సగటున రూ.50 వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో ఈ ఫీజు మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తిచేసి శిక్షణ మొదలుపెట్టిన మెజారిటీ కోచింగ్ సెంటర్లు.. కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల ఇంగ్లిష్ మీడియం శిక్షణ ప్రారంభిస్తామని చెప్తున్నప్పటికీ స్పష్టత లేదని అభ్యర్థులు అంటున్నారు. కొన్ని సెంటర్లు ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ శిక్షణకు అనుమతిస్తున్నాయి. మెటీరియల్ కోసమూ ఖర్చు మరోవైపు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా చాలా కోచింగ్ సెంటర్లు ఎలాంటి స్టడీ మెటీరియల్ ఇవ్వడం లేదు. దీనితో అభ్యర్థులు బయటే కొనుక్కోవాల్సి వస్తోంది. గ్రూప్–1 మెయిన్స్ మెటీరియల్ కోసం ఒక్కో అభ్యర్థి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. గ్రూప్–2, ఇతర పరీక్షల మెటీరియల్ కోసం రూ.10 వేల నుంచి రూ.18వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదనంగా నోట్స్ కోసం మరో రూ.5 వేల వరకు వ్యయం అవుతోంది. సబ్జెక్టుల వారీ శిక్షణకూ డిమాండ్ గ్రూప్–2, గ్రూప్–3 కేటగిరీల్లో 2వేలకుపైగా ఉద్యోగ ఖాళీలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4 కేటగిరీలో అయితే 8 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గ్రూప్–2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్–3తో పాటు గ్రూప్–4 కొలువులకూ కోచింగ్ తీసుకుంటున్నారు. ఒకే తరహా సిలబస్ అన్నింటికీ వర్తించనుండటమే దీనికి కారణం. ప్రధాన శిక్షణ కేంద్రాలు కూడా గ్రూప్–2 శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. గ్రూప్–2 శిక్షణలో అన్ని సబ్జెక్టులకు ప్యాకేజీ రూపంలో సగటున రూ.25 వేల మేర ఫీజు వసూలు చేస్తుండగా.. కొన్నిచోట్ల రూ.30–40 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజులు ఎక్కువగా ఉండటంతో కొందరు అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా శిక్షణ తీసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాలు మినహా మిగతాచోట్ల ఇలా సబ్జెక్టు వారీ శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. చదవండి: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
ప్రణాళికా బద్ధంగా.. ప్రిపేర్ కావాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగమైన గ్రూప్–1కు సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రంగాల్లో రోజువారీ పరిణామాలపై సంపూర్ణ అవగాహన అవసరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావాలని పత్రికలు, పుస్తకాల ద్వారా తాము తెలుసుకున్న సమాచారానికి సైద్ధాంతిక అవగాహనను జోడించి ప్రిపేర్ కావాలని సూచించారు. ఏ సబ్జెక్టులోనైనా ఇవే ప్రధానమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో అభ్యర్థులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై..గతంలో గ్రూప్–1 సిలబస్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. కృష్ణా జలాల పరిరక్షణ యాత్రలో బిజీగా ఉన్నప్పటికీ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భావాన్ని అర్ధం చేసుకుంటూ చదవాలి పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రిపేర్ అయ్యే విధానాన్ని పక్కాగా రూపొందించుకోవాలి. ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ అయినందున సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలి. భావాన్ని (కాన్సెప్ట్‌ను) అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రస్తుతం ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. ఏ పేపరును, ఏ అంశాన్నీ విస్మరించవద్దు. మెయిన్స్ జనరల్ ఎస్సేలో గతంలో ఏ టాపిక్ అనేది చెప్పే వారుకాదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏ సబ్జెక్టు చదివినా జనరల్ ఎస్సేను దృష్టిలో పెట్టుకొని మౌలిక అంశాలను అర్థం చేసుకొని సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహనæ వచ్చేలా చదివితే సరిపోతుంది. జనరల్ ఇంగ్లిష్ విషయంలో భాష తెలిస్తే చాలు. అర్థం చేసుకుంటారా? పట్టు ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. ఇంగ్లిష్ సాహిత్యం తెలియాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలతో పాటు మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి. అది తెలియకుండా ముఖ్య అంశాలు అర్థం చేసుకోలేం. 1935లో బ్రిటిష్ పాలకులు చేసిన చట్టం నుంచే చాలా భాగాలను మన రాజ్యాంగంలోకి తీసుకున్నామనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం స్వాతంత్య్ర సంగ్రామం నుంచి పుట్టింది. స్వాతంత్య్ర సంగ్రామం ప్రజాస్వామిక విలువలు, ఆకాంక్షలతో కూడింది. దాని ప్రాతిపదికనే రాజ్యాంగాన్ని రాసుకున్నాం. బ్రిటిష్ వారిది నిరంకుశ రాజ్యాంగం.. మనది మౌలికంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, సామాజిక న్యాయం విస్తృత పరిచే లక్ష్యాలతో రాసుకున్నది. మౌలికమైన ఈ అంశాలు అర్ధమైతే మిగతావి సులభంగా అర్ధమవుతాయి. రాజ్యాంగ ప్రవేశిక దానికి అద్దం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం తెలుసుకోవాలి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో వచ్చిన మార్పులపై అవగాహన ముఖ్యం. ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ నుంచి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వరకు ఎలా పరిణామం చెందామన్నది తెలుసుకోవాలి. నిజాం ఏలుబడిలో దన్నుగా ఉన్నది గ్రామాల్లోని భూస్వాములే. ఆ తర్వాత ప్రజా పోరాటాలతో విముక్తి చెందడం, వేల ఎకరాలు ఉన్న పెద్ద భూస్వాములు అంతరించిపోయి చిన్న భూస్వాములు ఉనికిలోకి రావడం, 1970 తర్వాత దేశ స్థాయిలో సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, 20 సూత్రాల పథకం, భూసంస్కరణలు.. వీటన్నిటిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ఏ మేరకు ఆధునిక దేశంగా ఏర్పడ్డాం... అయినా ఇంకా వెనుకబడి ఉన్న రంగాలేంటి.? మార్పు జరగాలంటే చేయాల్సిందేమిటి? అనేవి ప్రధానంగా ఆలోచిస్తూ ఇండియన్ ఎకానమీని చదవాలి. పొలిటికల్ ఎకానమీని ప్రభావితం చేసే రాజకీయ అంశాలేంటి.. ఉపాధి కల్పన ఏ రంగంలో ఎక్కువుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పురోభివృద్ధికి ఏం చేయాలన్న ప్రశ్నలను అనుబంధంగా చూసుకోవాలి. ప్రతి పేపరులో స్వాతంత్య్రానికి పూర్వం పరిస్థితులు, స్వాతంత్య్రానంతరం తలెత్తిన మార్పులు, ఈ మార్పులు దేశాన్ని ఎటు తీసుకెళుతున్నాయి.. దాని వల్ల లాభపడిన వ్యవస్థలు ఏంటి? అనేవి కీలక అంశాలుగా ఉంటాయి. ఇంటర్వ్యూలు ఉంటేనే మంచిది గ్రూప్–1కు ఇంటర్వ్యూలు ఉంటేనే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జిల్లాకు ఉన్నతాధికారిని ఎంపిక చేసే క్రమంలో అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఇంటర్వ్యూ ద్వారానే సాధ్యం అవుతుంది. పాలన నైపుణ్యాలు అక్కడే తెలుస్తాయి. సివిల్స్‌కు సైతం పోటీ పడేలా సిలబస్ టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత ఆ కమిషన్ నియమించిన సిలబస్ కమిటీ గ్రూప్–1 సిలబస్‌ను నాలుగు ప్రధాన భాగాలుగా రూపొందించింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ సిలబస్‌కు సారూప్యత ఉండేలా ఈ సిలబస్‌ను తయారు చేశాం. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వారు గ్రూప్–1 రాసేలా, గ్రూప్–1కు సిద్ధమయ్యే వారు సివిల్స్‌కు సైతం పోటీపడేలా, జాతీయ స్థాయి పోకడలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్‌ను రూపొందించాం. తెలంగాణలో విభాగాధిపతిగా, జిల్లా ఉన్నతాధికారిగా వ్యవహరించే పరిపాలన అధికారికి తెలంగాణ కోణం కచ్చితంగా తెలిసి ఉండేలా చూశాం. తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, గత పరిణామాలు, తొలి, మలి ఉద్యమాలు వంటి వాటిపై అవగాహనను పరిశీలించేలా సిలబస్‌ను ఖరారు చేశాం. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు వంటి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, రాజనీతి శాస్త్రం, భారత రాజ్యాంగం వంటి అంశాలను మరో విభాగంగా తీసుకొని సిలబస్‌ను రూపొందించాం. ఇంటర్ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే పూర్తిగా ఆయా రంగాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని ఏమీ లేదు. ఫోకస్ అంతా సైంటిఫిక్ మెథడ్ ఎలా డెవలప్ అయిందన్నదే. సైన్స్ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? పురోభివృద్ధికి ఎలా దోహదపడుతోందన్నది చూసుకుంటే చాలు. తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరు తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా ఓ పేపరు ఉంది. నిజాం పాలన, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం, ముల్కీ ఉద్యమం, దేశంలో విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందాలు, వాటి అమలులో వైఫల్యాలు, 1948 తర్వాత సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాటాలు, తొలి, మలి దశ ఉద్యమాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మనుషుల ఒప్పందం, దాని వల్ల న్యాయం జరగకపోవడం, 1969 ఉద్యమం, మలి దశ ఉద్యమాలతో పాటు వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకోవడం, దాని పూర్వ చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. 1948కి ముందు ఏముంది? ఆ తర్వాత ఎలా అభివృద్ధి చెందాం, ఇప్పుడున్న రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. -
ఉక్రెయిన్‌కు అంత సత్తా ఎక్కడిది?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనని అందరూ అనుకున్నారు. ఏదో నాలుగైదు రోజుల్లో ఉక్రెయిన్‌ని రష్యా స్వాధీనం చేసుకుంటుందని అంచనాలు కట్టారు. కానీ అందరి లెక్కలు తప్పాయి. రెండు వారాలైనా ఉక్రెయిన్ దండు రష్యా దండయాత్రని సమర్థంగా అడ్డుకుంటోంది. నాటో తన బలగాలు దింపకపోయినా, నో–ఫ్లై జోన్‌ని ప్రకటించడానికి నిరాకరించినా ఉక్రెయిన్ పోరాటాన్ని ఆపలేదు. చావో రేవోకి సిద్ధమై యుద్ధం చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ ఈ స్థాయి పోరాటపటిమను ఎలా చూపిస్తోంది? ఉక్రెయిన్‌కి కలిసొచ్చే అంశాలేమిటి? రష్యా చేసిన తప్పిదాలేంటి? సన్నద్ధత పశ్చిమ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంది. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న దగ్గర్నుంచి ఉక్రెయిన్ ఆత్మ రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి నాటో సైనికులతో శిక్షణనిచ్చింది. ‘ఏ క్షణంలో రష్యా దాడికి దిగినా ఎదుర్కోవడానికి 8ఏళ్లుగా ఉక్రెయిన్ ప్రణాళికలు రచిస్తోంది. ఆయుధాల పెంపు, బలగాలకు శిక్షణ, వ్యూహరచన వంటి అంశాల్లో బలంగా నిలిచింది’అని జార్జ్‌టౌన్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డౌగ్లస్ చెప్పారు. స్థానబలం స్థానబలానికి మించిన బలం ఏదీ లేదంటారు. సరిగ్గా ఇక్కడే రష్యా ఉక్రెయిన్‌ని తక్కువ అంచనా వేసింది. సోవియెట్ యూనియన్‌గా ఉన్న రోజుల్లో ఉక్రెయిన్ భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేసుకుందే తప్ప, ఇన్నేళ్లలో ఆ ప్రాంతం ఎంత మారిపోయిందో, స్థానికంగా ఉక్రెయిన్ బలగాల ప్రాబల్యం ఎలా పెరిగిందో తెలుసుకోలేకపోయింది. ప్రజలే ఆయుధాలు చేతపట్టి తిరుగుబాటు చేస్తారని గ్రహించుకోలేక ఇప్పుడు కదన రంగంలో గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారిపోవడంతో ఉక్రెయిన్ బలగాలు ఎటు నుంచి వచ్చి మీద పడతాయో తెలుసుకోలేక రాజధాని కీవ్‌ను పదిహేను రోజులైనా స్వాధీనం చేసుకోలేకపోతోంది. ‘ఉక్రెయిన్‌లో మార్పుల్ని అంచనా వేయడంలో రష్యా విఫలమైంది. వీధి వీధిలోనూ, ప్రతీ భవంతిలోనూ అన్నిచోట్లా రష్యా బలగాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’అని కాలేజీ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ ప్రొఫెసర్ స్పెన్సర్ మెరెదిత్ చెప్పారు. సంఘీభావం పౌర నివాసాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని లక్ష్యం గా చేసుకొని రష్యా బలగాలు దాడి చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్ ప్రజలతో ప్రపంచదేశాల్లో రష్యా పై ఒక కసి పెరిగింది. ప్రాణాల మీదకొస్తున్నా అధ్యక్షుడు జెలెన్స్కీ లెక్కచేయకుండా కీవ్‌లో ఉంటూ అందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించారు. దీంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ఆయుధాలు చేతపూని ఎదురుదాడికి దిగారు. రష్యా భీకరమైన దాడులకు ఎదురుదాడికి దిగడం తప్ప ఉక్రెయిన్‌కు మరో మార్గం లేదని రిటైర్డ్ ఫ్రెంచ్ కల్పనర్ మైఖేల్ గోయా అభిప్రాయపడ్డారు. ఆయుధాలే ఆయుధాలు రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత నాటో బలగాలు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆయుధాలను లెక్కకు మించి సరఫరా చేస్తున్నాయి. నాటోలో సభ్యత్వం లేకపోయినప్పటికీ స్వీడన్, ఫిన్లాండ్ సహా 20కిపైగా దేశాలు వేల సంఖ్యలో యుద్ధట్యాంక్ విధ్వంసక ఆయుధాలను పంపించాయి. దాడి మొదలయ్యాక రోజుకో కొత్త రకం ఆయుధాలు ఉక్రెయిన్‌కు అందుతున్నాయి. 2,000కు పైగా స్ట్రింగర్ మిస్పైల్ (మ్యానన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్), 17 వేలకు పైగా యుద్ధ ట్యాంక్ విధ్వంసక తేలికపాటి ఆయుధాలు, 2,000 యుద్ధట్యాంక్ విధ్వంసక క్షిపణులను పశ్చిమ దేశాలు సరఫరా చేశాయి. గ్రనేడ్లు, రాకెట్లు, ఇతర ఆయుధాలు భారీ సంఖ్య లో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ప్రతీ ఒక్కరి చేతిలో ఆయుధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. రష్యా తప్పిదాలు ఉక్రెయిన్‌ని కొట్టడం ఏమంత పెద్ద పని కాదని రష్యా తేలిగ్గా తీసుకుంది. ఎక్కువగా బలగాలను మోహరించలేదు. మూడు రోజుల్లో రాజధాని కీవ్ వశమైపోతుందని భావించడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికాలోని రష్యా స్టడీస్ ప్రోగ్రామ్ ఎట్ ది సెంటర్ ఫర్ నేవల్ అనాలిసస్ డైరెక్టర్ మైఖేల్ కోఫ్మన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్ని బలగాలను మోహరించినప్పటికీ ఈలోగా ఉక్రెయిన్ చేతుల్లోకి ఆయుధాలు వచ్చి చేరాయి. నైతిక స్థైర్యం రష్యా సైన్యానికి ఊహించని నష్టం జరగడంతో సైనికులు నైతిక స్థైర్యం తగ్గిపోయింది. యుద్ధభూమిలో వేల సంఖ్యలో మరణాలు, క్షతగాత్రులతో పాటు చాలామందికి తాము యుద్ధానికి వెళుతున్నామన్న విషయం తెలీదు. పుతిన్ ప్రభుత్వం సైనికులకు అసలు విషయం చెప్పకుండా దాచి కదనరంగానికి పంపడం తప్పిదేమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రకృతి నుంచి లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ►ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
మోగనున్న బడిగంట: ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం!
శేరిలింగంపల్లి: కరోనా వ్యాప్తితో మూతపడ్డ పాఠశాలలను సెప్టెంబర్ 1 నుంచి తెరిచి తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీహెచ్ఎంసీ అధికారులు, ఎంఈఓ ఆధ్వర్యంలో శానిటేషన్, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ రెండు రోజులుగా పరిశుభ్రతా పనులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇక ఆన్లైన్ తరగతులకు స్వస్తి పలకాలని నిర్ణయించడంతో విద్యార్థులంతా పాఠశాలలకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో.. ► ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణను శుభ్రం చేయించే బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. ► తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు శానిటైజ్ చేస్తున్నారు. ► వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్, జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు వెంకన్న, సుధాంషుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులు ఈ పనులను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలోని ప్రభుత్వపాఠశాలల వివరాలు: ►శేరిలింగంపల్లి ప్రాంతంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 14,332 మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ►మొత్తం 13 జెడ్పీహెచ్ఎస్లలో 6,232 మంది విద్యార్థులు, నాలుగు యూపీఎస్ స్కూళ్లలో 908 మంది విద్యార్థులు, 43 ప్రాథమిక పాఠశాలల్లో 7,192 మంది విద్యార్థులు చదువుతున్నారు. ► శేరిలింగంపల్లి మండలంలో ప్రైవేటు పాఠశాలలు 261 ఉండగా, వాటిల్లో 90 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. సురభికాలనీ పాఠశాలలో పరిశుభ్రత పనులు, పాపిరెడ్డికాలనీలోని గ్రౌండ్‌ను చదును చేస్తున్న దృశ్యం పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలి. పాఠశాలలన్నింటినీ జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో పరిశుభ్రం చేసి శానిటైజ్, చేయిస్తున్నాం. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కోవిడ్ నిబంధనలను విధిగా అందరూ పాటించాల్సిందే. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి స్కూళ్లు తెరిచేలా శానిటైజ్ చేయించి సిద్ధం చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తాం. -కె.వెంకటయ్య, మండల విద్యాధికారి శేరిలింగంపల్లి ఉపాధ్యాయులు పాటించాల్సిన అంశాలివీ... ♦ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని పాఠ శాల ఆవరణ అంతా పరిశుభ్రంగా మార్చాలి. ♦ పాఠశాలలోని తరగతి గదులు శుభ్రం చేయించాలి. ♦ పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలి. ♦ పాఠశాల ఆవరణలో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, సంపులను క్లీనింగ్ చేయించాలి. ♦ విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలి. ♦ ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్ నిబంధనలన్నీ విధిగా అందరూ పాటించాలి. ♦ పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారీ, భౌతిక దూరం పాటిస్తూ వారు భుజించేలా చూడాలి. విద్యార్థులు పాటించాల్సిన అంశాలు: ♦ ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి. ♦ పాఠశాలలో భౌతిక దూరం పాటించాలి. ♦ చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ♦ కోవిడ్ నిబంధనలన్నీ తప్పక పాటించాలి. -
2024కు రెడీ అవుతున్న బీజేపీ
న్యూఢిల్లీ: మూడేళ్లలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే సన్నాహాలు ఆరంభించింది. ఇందులో భాగంగా కేబినెట్ మంత్రులతో దాదాపు 19 రాష్ట్రాల్లో ఎక్కడికక్కడా యాత్రలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. కేబినెట్లోని 43 మంత్రులు ఆగస్టు 16 నుంచి ఆరంభించాలని భావిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం. మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు సుమారు 300– 400 కిలోమీటర్ల దూరం నుంచి ఆరంభించి 3,4 లోక్‌సభ నియోజకవర్గాల గుండా తమ సొంత జిల్లాలకు యాత్ర చేపడతారు. మొత్తం 15000 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. తెలంగాణ, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళ నాడు, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటకల్లో యాత్రలు సాగనున్నాయి. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ చికెన్: ఓ లుక్కేయండి మరి!
వివిధ రెస్టారెంట్లలో దొరికే ఫ్రైడ్ చికెన్ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ చికెన్‌ను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చదవండి! కావాల్సిన పదార్థాలు చికెన్ డ్రమ్‌స్టిక్స్: ఆరు, కోడిగుడ్డు: ఒకటి, ఉప్పు: రుచికి సరిపడా, తెల్ల మిరియాల పొడి: రెండు స్పూన్లు, మైదా: ఒక కప్పు, కారం: ఒక స్పూను, అల్లం తురుము: ఒక స్పూను, వెల్లుల్లి తురుము: ఒక స్పూను, ఉల్లిపాయ పేస్టు ఒక స్పూను, వాము పొడి: ఒక స్పూను, బరకగా దంచిన ఎండు మిరపకాయల పొడి: ఒక స్పూను, తులసి ఆకుల పొడి: ఒక స్పూను, బ్రెడ్ స్లైసులు: మూడు, ఆయిల్: డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ ►ముందుగా చికెన్ డ్రమ్‌స్టిక్ పీసులను ఒక గిన్నెలో తీసుకుని కొద్దిగా ఉప్పు, అరస్పూను మిరియాల పొడి వేసి డ్రమ్స్టిక్స్కు పట్టించి, మారినేట్ చేసుకోవాలి. ►ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో గుడ్డు పగుల కొట్టి సొన వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి మరింత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు మరోక గిన్నె తీసుకుని.. మైదా, ఉప్పు, కారం, అల్లం, వెల్లులి, ఉల్లిపాయ, వాము పొడి, బరకగా దంచిన ఎండు మిరపకాయల పొడి, ఒకటిన్నర స్పూను తెల్లమిరియాల పొడి, తులసి ఆకుల పొడిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ►బ్రెడ్ స్లైస్‌లు మూడు తీసుకుని వాటి చుట్టూ ఉన్న అంచును కట్ చేయాలి. తరువాత మధ్యలో తెల్లని స్లైస్‌ను కాస్త బరకగా ఉండేలా పొడి చేసి పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. మరోపక్క మారినేట్ చేసుకున్న చికెన్ పీస్ తీసుకుని, ముందుగా మసాలాలన్ని కలిపి పెట్టుకున్న పొడిలో ముంచాలి, తరువాత గుడ్డు సొన మిశ్రమంలో ముంచాలి. చివరిగా బ్రెడ్స్లైస్ పొడిలో ముంచాలి. ఇలా ముక్కకు ఈ మూడు రకాల మిశ్రమాలను కోటింగ్‌లా పట్టిన తరువాత మరుగుతున్న ఆయిల్లో వేసి సన్నని మంటమీద డీప్ ఫ్రై చేసుకోవాలి. పీస్‌లు బాగా ఉడికి క్రిస్పీగా వేగితే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. కాస్త వేడిగా ఉన్నప్పుడు ఈ ఫ్రై తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చూశారా ఫ్రైడ్ చికెన్ తయారు చేయడం ఎంత సులభమో, ఇంకెందుకాలస్యం... వెంటనే మీరుకూడా ట్రై చేసి రుచిచూడండి. గమనిక: ఉప్పు మూడుసార్లు వేసేటప్పుడు ఎంతెంత వేస్తున్నామో గమనించి రుచికి సరిపడా వేసుకోవాలి. -
ట్రెండింగ్: 'కాల్కస్' ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్‌కు అద్భుత స్పందన
‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’ అనే లక్ష్యంతో పాఠశాల స్థాయి అకడమిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల నుండి సివిల్ ఎంట్రన్స్ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా కేవలం 99 రూపాయలకే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో CALCUS EDUCATIONAL INSTITUTE ఆధ్వర్యంలో ‘IIT-IIM ALUMNI’ సహకారంతో విడుదలైన ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’నకు విద్యార్ధుల నుండి అద్భుత స్పందన వస్తోందని కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, జెఈఈ, నీట్, టీచింగ్, సీబీఎస్ఈ, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ వంటి పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్ధులు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు కాల్కస్ ఎడ్యుకేషనల్ వాణీ కుమారి వెల్లడించారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1325 విభాగాలతో 42 వేలకు పైగా ప్రాక్టీస్ టెస్ట్‌లు కాల్కస్ ఇండియా యాప్‌లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేవీపీవై, ఎన్సీఓ, ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండారైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్ అండ్ పోలీస్, ఎస్ఎస్సీ, టీచింగ్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, లా-కామర్స్-ఆర్ట్స్, సివిల్స్ లాంటి మొదలైన పరీక్షలకు సంబదించిన ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు వీలుగా ఉండేలాగా 42600కు పైగా మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్నపత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను 25 బండిల్స్ (కాటగిరీలు) రూపంలో పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ఉచిత ప్రాక్టీస్ టెస్ట్స్ యాప్ విడుదల సందర్భంగా, కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్ధుల కోసం పరిమిత సంఖ్యలో ఉచిత టెస్టులను ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం అపరిమిత టెస్టులు కావాలనుకున్నవారు వార్షిక ప్లాన్ కొరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చును. ఏడాదికి రూ.99 ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగాప్రాక్టీసు చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, యాప్ విడుదల సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ ముందుగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, త్వరలో ఈ ఆఫర్ గడువు ముగుస్తుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్లో మాత్రమే లభ్యమయ్యే Calcusindia App ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు Calcusindia వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చును. (అడ్వర్టోరియల్) -
రూ.99కే ‘కాల్కస్ ఇండియా’ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్
ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చెయాలంటే విడిగా అనేకరకాల సీడీ మెటీరియల్స్‌ను కొనుక్కోవాలి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల స్థాయి నుంచి సివిల్స్ ఎంట్రెన్స్ స్థాయి వరకు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్న పత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాప్‌లో మొత్తం 1324 విభాగాల్లో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లతో కూడిన 25 బండిళ్లను అందుబాటులో ఉంచామని ‘కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్’ వ్యవస్థాపకురాలు వాణీకుమారి తెలిపారు. 1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లు కాల్కస్ ఇండియా యాప్‌లో అన్ని రకాల పోటీ పరీక్షలను పొందుపరిచారు. ఇందులో సీబీఎస్సీ, ఐసీఎస్సీ, కేవీపీవై,ఎన్సీఓ,ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్, రైల్వే, పోలీసు, డిఫెన్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, టీచింగ్, ప్రభుత్వ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టెట్, స్కిల్స్, ఎపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సివిల్స్ ఎంట్రెన్స్ వంటి మరిన్ని1324 రకాల పోటీ పరీక్షలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు సంస్థ వ్యవస్థాసకురాలు వాణి కుమారి తెలిపారు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తెలుగులో కూడా ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షల నోటిఫికేషన్ల ఆధారంగా పొందుపరిచారు. ఏడాదికి రూ.99 ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదవుతున్నా కేవలం రూ.99తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అన్ని రకాల పశ్న పత్రాలను కొనుక్కోవాలి. కానీ, ఈ యాప్‌లో ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. యాప్ విడుదల సందర్భంగా పరిమిత టెస్ట్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఉచిత ప్రాకీస్టు చేసి ఇంకా కావాలనుకుంటే రూ. 99తో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అందరికీ విద్య- అందుబాటు ధరలో! ‘‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’’ అనే లక్ష్యంతో రూ.99కే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాణీకుమారి తెలిపారు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ‘calcusindia’అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.calcusindia.comను సందర్శించండి లేదా 9133607607కి ఫోన్ చేయవచ్చు. -
లాక్డౌన్: సర్కారీ ఉద్యోగాలకు ఇలా తయారవ్వండి!
కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మార్చి 25 నుంచి మూడు వారాల పాటు విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పటికి లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఇప్పటికే ఇళ్లకే పరిమితమయ్యి అడుగు బయట పెట్టే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది డిప్రెషన్లోకి వెళుతుండగా, చాలా మంది ఇది ఇలాగే కొనసాగుతుందేమో అని భయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో కచ్ఛితంగా మార్పు వస్తుంది. కానీ కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు కూడా తారుమారయ్యాయి. ఇప్పుడు ఉద్యోగాల కొరత మరింత ఎక్కువయ్యింది. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఒక్కటే మార్గం. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటంతో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారికి చాలా సమయం దొరికింది. మరి ఈ సమయంలో జాబ్ కొట్టడానికి ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం. (గవర్నమెంట్ జాబ్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://allgovernmentjobs.in/latest-government-jobs) ఆన్లైన్ ద్వారా నేర్చుకోండి: ఈ 21వ శతాబ్ధంలో ఇంటర్నెట్ లేకుండా మనం మన జీవితాల్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరి చేతితో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఇంటర్నెట్ను సోషల్ మీడియా సైట్స్ చూడటానికి కాకుండా ఎడ్యూకేషన్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించండి. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారి కోసం చాలా వెబ్సైట్లు తక్కువ రేటుకు లేదా ఉచితంగానే స్టడీ మెటీరియల్స్, ఆన్లైన్ వీడియో క్లాస్‌లు అందిస్తున్నాయి. వాటిని ఈ లాక్డౌన్ కాలంలో సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు సబెక్ట్ నేర్చుకోవచ్చు. బుక్స్ చదవండి: గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి యేడాది పరీక్షలు సంబంధించిన సిలబస్ మార్పు చేస్తూనే ఉంటారు. ఈ సిలబస్ వరకు చదివితే సరిపోతుంది అనేది గవర్నమెంట్ జాబ్ కొట్టేవారి విషయంలో సరికాదు. యూపీఎస్సీకి లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి పరీక్షలకు ప్రిపేర్ వారికి ఎంత సమయం ఉన్న సరిపోదు. ఏదో ఒక విషయం నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. ఒకేసారి ప్రిలిమ్స్‌కి మెయిన్స్‌కి సంసిద్ధం కావాలి. దీని కోసం పుస్తకాలు చదువుతూ సబెక్ట్లపై లోతైన అవగాహన పెంచుకోవాలి. జనరల్ నాలెడ్జ్ పై పట్టుసాధించడం: గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో జనరల్ అవేర్నెస్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటివి ప్రిపేర్ అవుతూ తేలికగానే ఉంటుందని జనరల్ నాలెడ్జ్ పార్ట్‌ని వదిలేస్తారు. కానీ జనరల్ అవేర్నెస్పై గ్రిప్ ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి చాలా మెటీరియల్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి: నిత్యం మన చుట్టూ జరిగే విషయాల నుంచే చాలా ప్రశ్నలు పరీక్షల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్‌కి కరెంట్ఎఫైర్స్ అనేవి చాలా ముఖ్యం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల కరెంట్ ఎఫైర్స్‌పై పట్టు రావడంతో పాటు పదజాలాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలు రాయడం: పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టైం మెనేజ్మెంట్ అనేది చాలా కీలకం. ఇచ్చిన టైం లోగా ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నాం. అసలు మనం ఏ సబెక్ట్‌లో వీక్‌గా ఉన్నాం. ఏ పార్ట్‌ని ఇంఫ్రూవ్ చేసుకోవాలి అనేది రోజు మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా తెలుస్తోంది. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు చాలా వరకు ఏ విషయం మీద ఫోకస్ పెట్టాలి అనే దానిని తెలుసుకోగలుగుతారు. మాక్‌టెస్ట్‌ల్లో చేసే తప్పులు అసలు ఎగ్జామ్‌లో చేయకుండా చూసుకుంటూ మంచి మార్క్‌లు సాధిస్తారు. వ్యాయమం చేయడం: మనం చదువుకుంటూ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటి లేకపోతే శరీరం బద్దకంగా తయారవుతుంది. ప్రస్తుతం లాక్డౌన్లో మనం బయటకి వెళ్లి అడుకోవడం లాంటివి చేయలేం కాబట్టి ఇంట్లోనే ఉండి వ్యాయమం చేస్తూ ఫిట్‌గా ఉండాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం చురుకుగా పనిచేయగలం. ఇలాంటి సమయంలో మనం ఇంట్లో ఉండి ప్రభుత్వానికి సహకరిద్దాం. అదేవిధంగా పరిస్థితులు కచ్ఛితంగా మాములుగా వస్తాయి. ప్రభుత్వపరీక్షలు కొనసాగుతాయి. ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ మొదలుపెడదాం. -
ఇంట్లోనే సులువుగా మాస్కు తయారీ
-
కేక్ తయారీ విధానం
స్వీట్ కార్న్ కేక్ కావలసినవి: స్వీట్ కార్న్ – 3 కప్పులు బటర్ – అర కప్పు, అరటిపండు గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు పంచదార – ఒక కప్పు మొక్కజొన్న పిండి – అర కప్పు గుడ్లు – 3 (తెల్లసొన మాత్రమే) నీళ్లు – కొద్దిగా వెనీలా ఎక్స్ట్రాక్ట్ – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా స్వీట్ కార్న్, పంచదార రెండూ కలిసి మిక్సీ పెట్టుకుని ముద్దలా చేసుకోవాలి. అందులో కరిగించిన బటర్, గుడ్ల తెల్లసొన, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, మొక్కజొన్న పిండి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక ట్రేలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని, సమాంతరంగా చేసుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద ట్రేలో ఆ ట్రేను పెట్టుకుని.. అడుగున నీళ్లు నింపుకుని.. రెండూ కలిపి, ఓవెన్లో పెట్టి ఉడికించుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఐస్‌క్రీమ్ స్కూపర్‌తో తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీ బ్రెడ్ బోండా కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 12 నీళ్లు – 1 కప్పు బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి ముద్ద చేసుకోవాలి) పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ – అర టీ స్పూన్ పసుపు – కొద్దిగా ఆలివ్ నూనె, నిమ్మరసం – 1 టీ స్పూన్ చొప్పున కొత్తిమీర గుజ్జు –1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో.. బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర గుజ్జు, ఆలివ్ నూనె, ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లను నాలుగువైపులా (బ్రౌన్ కలర్ భాగం) తొలగించి.. ఒక్కో బ్రెడ్ స్లైస్‌ని నీళ్లలో బాగా తడిపి.. బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న బాల్ పరిమాణంలో తీసుకుని, అందులో పెట్టుకోవాలి. తర్వాత ఆ స్లైస్‌ని నాలుగు వైపుల నుంచి కలుపుతూ.. గుండ్రంగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లతో తడి చేసుకుంటూ బంగాళదుంప మిశ్రమం కనిపించకుండా క్లోజ్ చెయ్యాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. డేట్స్ శాండ్విచ్ కావలసినవి: ఖర్జూరం – అర కప్పు (గింజలు తొలగించి, మిక్సీ పట్టుకోవాలి) బ్రెడ్ స్లైస్ – 6 (త్రిభుజాకారంలో ఒక్కో స్లైస్‌ని రెండు ముక్కలు చొప్పున కట్ చేసుకోవాలి) వాల్నట్స్ 2 టేబుల్ స్పూన్(మిక్సీ పట్టుకోవాలి) బాదం – 3 టేబుల్ స్పూన్ (నానబెట్టి, పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి) బ్రెడ్ పౌడర్ – పావు కప్పు మొక్కజొన్న పిండి – పావు కప్పు బటర్ – పావు కప్పు (కరింగించి) గడ్డ పెరుగు – 2 కప్పులు(ఒక మంచి క్లాత్‌లో మొత్తం పెరుగు వేసుకుని, రెండుమూడు సార్లు గట్టిగా పిండి, 3 గంటల పాటు ఓ పక్కగా వేలాడదీయాలి. 3 గంటల తర్వాత నీటిశాతం తగ్గి, క్రీమ్‌లా తయారవుతుంది) జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ – అభిరుచిని బట్టి.. ఖర్జూరం ముక్కలు – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు (అదనంగా తీసుకోవాలి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం గుజ్జు, బాదం పేస్ట్, వాల్నట్ పేస్ట్, క్రీమ్‌లా సిద్ధం చేసుకున్న పెరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దలో ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ ఇలా నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసుకుని అటు ఇటు ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండేసి త్రిభుజాకారపు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని కొద్దికొద్దిగా ఖర్జూరం మిశ్రమాన్ని పెట్టుకుని.. రెండువైపులా గ్రిల్ చేసుకుంటే అదిరే రుచి మీ సొంతవుతుంది. -
పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజ్ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నెజ్ కెమెరాలు వినియోగించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలపై అధికారులతో ఎన్నికల సంఘం చర్చలు నిర్వహించింది. మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికల నియమావళికి ఎలాంటి అసౌకర్యం,ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హెల్ప్‌లైన్ కమ్ కంట్రోల్ రూంను ఏర్పా టు చేసింది. ఇందుకోసం మూడు ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్లను కేటాయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమకున్న ఫిర్యాదులను 040–29802895, 040–29802897 నంబర్లకు ఫోన్ చేసి చెప్పవచ్చని, 040–29801522 నంబరుకు ఫ్యాక్స్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది. -
‘స్థానిక సమరానికి సన్నాహాలు!
స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగు కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ పత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. దీంతో రెండు..మూడు నెలల్లో ఎన్నికలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలను ముమ్మరం చేసింది. మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు అవసరమయ్యే కసరత్తును అధికారులు ముమ్మరం చేయడం చూస్తుంటే అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితాను సైతం అధికారులు తయారు చేశారు. ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలోని 39 మండలాల పరిధిలో 924 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధమైంది. దీంతో గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొద్ది రోజుల తేడాతో పూర్తి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం ఏక్షణంలో షెడ్యుల్ ప్రకటించినా ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. జిల్లాలో 924 గ్రామపంచాయతీల్లో 18,2730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,85,005 మంది పురుష, 9,17,654 మంది మహిళ, 71 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురు చూపులు ! పంచాయతీ రిజర్వేషన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 60 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించవలసి ఉంది. దానికి చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ కోసం ఆర్డెన్స్‌గాని లేదా అసెంబ్లీలో సవరణ అయినా చేయవలసి ఉంది. దాని తర్వాత రిజర్వేషన్ల విధి విధానాల ప్రకటన వెలువడుతోంది. ప్రభుత్వ విధి విధానాల తరువాత రెవెన్యూ డివిజనల్ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని పంచాయతీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసే అవకాశాలున్నాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్ పత్రాలు ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా అవసరమయ్యే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. మొత్తం 26 టన్నుల బ్యాలెట్ పత్రాలు అవసరంగా అధికారులు గుర్తించారు. సర్పంచ్ ఓటుకు గులాబి, వార్డు సభ్యునికి తెలుపు రంగు బ్యాలెట్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అలాగే అదనంగా మరో పది శాతం బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంచనున్నారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ‘కౌరు’ నామినేషన్
తణుకు : తణుకు మునిసిపల్ పరిధిలోని మూడో వార్డు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. వార్డు కౌన్సిలర్ గుబ్బల రామారావు కుటుంబ సభ్యులకు టికెట్టు ఇవ్వడం ద్వారా ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తొలుత భావించినప్పటికీ ఆశావాహుల ఒత్తిడితో టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఏపీపీ, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు బుధవారం తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి, మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. భారీ ర్యాలీగా.. మునిసిపల్ పరిధిలోని 3వ వార్డు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. ప్రధాన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రధాన పక్షాలైన టీడీపీ, వైఎస్సార్ సీపీ నుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉండటంతో పోరు నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. గురువారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బు«ధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. మూడోవార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మునిసిపల్ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారాం, అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దాల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గుర్రాల సత్య ప్రియ, పట్టణ కన్వీనర్ కలిశెట్టి శ్రీనివాసు, పార్టీ రాష్ట్ర నాయకులు పెన్మత్స రామరాజు, మద్దిరాల రామ సతీష్, బూసి వినీత, నాయకులు పెన్మత్స సుబ్బరాజు, నరసింహమూర్తి రాజు, వీరవల్లి పాలేశ్వరరావు, పోలిశెట్టి వెంకన్నబాబు, అడ్డాల రమేష్, బెజ్జవరపు సాక్షి గోపాలరావు, చెల్లంకి వెంకటేశ్వరరావు, ఆర్వీవీ రమణ, పైబోయిన సత్యనారాయణ, చింతాడ సంజీవరావు, వి.సీతారాం, గంటా బాబి, బసవా గణేష్, కొమ్మోజు రామకృష్ణ, కేతా కృష్ణ, చదలవాడ యేసయ, మట్టా వెంకటేష్, రంబ నాగేశ్వరావు, గుర్రాల నాగేంద్ర, ఎలిపే సరోజిని పాల్గొన్నారు. -
కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ న్యూశాయంపేట : జిల్లాల కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల విభజన, నూతన జిల్లాల ఏర్పాటు, జిల్లాల ప్రారంభోత్సవాల గురించి శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 11న ఉదయం 10.30గంటలకు నూతన జిల్లాల కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపనతో కేటాయించిన మంత్రులతో జిల్లా ప్రారంభోత్సవం చేసిన తర్వాత భవన సముదాయ ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. నూతన జిల్లాల ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించి, జిల్లా కలెక్టర్లు నూతన ఫైళ్లను కూడా పరిశీలించి ఆమోదించే ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం నూతన జిల్లా కేంద్రాల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. 10న ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే అధికారులకు సిబ్బంది ఆర్డర్ టూ సర్వ్ ఉత్తర్వులు జారీ ఉంటుందని, వెంటనే విధులకు హాజరై కార్యాలయ బాధ్యతలు స్వీకరించి అదేరోజు పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రతిపాదిత మూడు జిల్లాలతోపాటు జనగామ జిల్లాలోని కార్యాలయాల్లో అవసరమైన భవనాలను సిద్ధం చేసి ఫర్నిచర్, ఇతర సామగ్రి ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతనంగా ప్రకటించిన జనగామ జిల్లాకు నిధులు విడుదల చేయాలని కోరారు. జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీఆర్ఓ కె.శోభ, జిల్లా పరిషత్ సీఈఓ విజయగోపాల్, సీపీఓ రామచంద్రరావు పాల్గొన్నారు. -
నిర్విఘ్నంగా నిమజ్జనానికి!
– వినాయక ఘాట్ వద్ద ఏర్పాట్లు పూర్తి – నగరమంతా భద్రత కట్టుదిట్టం – రంగంలోకి వజ్ర వాహనం – అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ========================== మొదటి ఊరేగింపు: ఉదయం 9.30 గంటలకు రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభం. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్, ఎస్పీ ఆకె రవికష్ణ హాజరు. రెండో ఊరేగింపు: మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారి చౌరస్తా నుంచి ప్రారంభం. మూడో ఊరేగింపు: చెన్నమ్మ సర్కిల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం. ఉత్సవాన్ని వీక్షించే జనం: లక్ష మంది నగరంలో వినాయక విగ్రహాలు : రెండు వేలకు పైగా నిమజ్జనానికి వినియోగించే క్రేన్లు: 6 పాల్గొనే ప్రభుత్వ శాఖలు.. ఆర్అండ్బీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, అగ్నిమాపక ============== కర్నూలు: వినాయక ఉత్సవాల్లో అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. వాడావాడా ఏకమై జరిపే సంబరానికి సర్వం సిద్ధమైంది. శోభాయాత్రకు వీధులన్నీ అలంకరించుకున్నాయి. మంగళవారం కర్నూలులో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రణాళిక రూపొందించారు. కర్నూలులో నిమజ్జన వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వినాయకఘాట్ వద్ద గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఘాట్‌కు ఇరువైపులా మిరిమిట్లు గొలిపే వందకుపైగా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు తావులేకుండా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. వినాయకఘాట్ మందిరాన్ని పూలు, విద్యుత్‌దీపాలు, మామిడి తోరణాలతో అలంకరించారు. కేసీ కెనాల్ నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు కాషాయవర్ణం పతాకాలతో అలంకరించారు. రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్ వరకు ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం కేసీ కెనాల్లో పది అరిగిళ్లు నిర్మించారు. రోప్స్, టైర్‌ట్యూబ్‌లతో పాటు 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కేసీ కెనాల్లో ఆరు అడుగుల నీరు ప్రవహిస్తోంది. భారీ విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం చేయాలంటే 8 అడుగుల నీటి ప్రవాహం అవసరం. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి విజ్ఞప్తి మేరకు నీటి పారుదల శాఖ అధికారులు మరో రెండు అడుగుల నీరు వదలడానికి అంగీకరించారు. భద్రత కట్టుదిట్టం.. వినాయక నిమజ్జనం, బక్రీద్ పండుగలు ఒకే రోజు వచ్చినందున పోలీసు యంత్రాంగం నగరంలో భద్రత కట్టుదిట్టం చేసింది. సోమవారం ఎస్పీ ఆకె రవికష్ణ, జిల్లా పోలీసు పేరెడ్ మైదానంలో బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిమజ్జనం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సిబ్బంది అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు మొత్తం మూడు వేలకుపైగా సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. ప్రత్యేక పెట్రోలింగ్ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి విగ్రహం వద్ద ఓ పోలీసు తోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదుగురితో కూడిన ప్రత్యేక బందాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అల్లరి మూకలను నియంత్రించేందుకు వజ్రావాహనాన్ని రంగంలోకి దించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు సెక్టార్ ఇంచార్జిలు క్షేత్రస్థాయి సిబ్బందికి సెట్ ద్వారా సమాచారం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీడియో, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలను తరలించే బాధ్యతలను ఆయా స్టేషన్ల పరిధిలో కాలనీల వారీగా పోలీసులకు అప్పగించారు. సివిల్ పోలీసులతో పాటు నాలుగు ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, ఐదు ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి ముందు రోజు మద్యం షాపులతో పాటు, బాణసంచా విక్రయించే దుకాణాలను మూసివేయించారు. మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శించే వారు, సంబంధంలేని వ్యక్తులపై రంగులు చల్లే ఆకతాయిలపై నిఘా కోసం మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ఒకే రోజు రెండు పండుగలు ఉన్నందున కర్నూలు నగరాన్ని బాంబ్, డాగ్‌స్వా్కడ్ బందాలు జల్లెడపట్టాయి. రామ్మూర్తి, గోపాల్, ఇనాయతుల్లా ఒక బందం, అంజన్‌బాబు, బాలయ్య, ప్రసాద్, సుబ్రమణ్యం మరో బందం, శ్రీనివాసులు, సత్యం, భాస్కర్లు మూడో బందంగా ఏర్పడి నగరమంతా విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. యామిని, టీనా, జాని డాగ్‌లతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకె రవికృష్ణ సోమవారం వినాయక ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: ఎస్పీ ఆకె రవికృష్ణ జిల్లాలో ఈ ఏడాది 4వేలకుపైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. నంద్యాల, ఆదోనిలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు పూర్తయ్యాయి. కర్నూలులో కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్న పుటేజీల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నియమావళి పాటించాలి కర్నూలు(టౌన్): నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రూపొందించిన నియామావళిని తప్పకుండా పాటించాలనిసమితి కార్యాధ్యక్షుడు కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక బుధవారపేటలోని కేశవ మెðlూరియల్ ఉన్నత పాఠశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఊరేగింపులో కాషాయ జెండాలు, టోపీలు ధరించాలన్నారు. ఈ ఏyది షోలాపూర్ నుంచి తలపాగాలు తెప్పించామన్నారు. ఊరేగింపులో మత్తు పానీయాలు సేవించడం, బాణసంచా కాల్చడం నిషేధించినట్లు చెప్పారు. మహిళలు విలువైన బంగారు నగలు ధరించకూడదన్నారు. పిల్లలు వెంట ఉంటే వారి జేబుల్లో పేరు, చిరునామా, సెల్‌నెంబర్ వివరాలను ఉంచాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పాదచారులపై రంగులు చల్లకూడదన్నారు. వినాయక ఉత్సవాలు, బక్రీద్ పండుగ ఒకేరోజు వస్తున్నందుకు హిందు, ముస్లింలందరు కలిసి మెలిసి పండగలను విజయవంతం చేద్దామన్నారు.సమావేశంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు క్రిష్టన్న, సందడి సుధాకర్, రంగస్వామి, కాళింగి నరసింహవర్మ పాల్గొన్నారు.