సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నెజ్ కెమెరాలు వినియోగించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలపై అధికారులతో ఎన్నికల సంఘం చర్చలు నిర్వహించింది. మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికల నియమావళికి ఎలాంటి అసౌకర్యం,ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) హెల్ప్‌లైన్ కమ్ కంట్రోల్ రూంను ఏర్పా టు చేసింది. ఇందుకోసం మూడు ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్లను కేటాయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమకున్న ఫిర్యాదులను 040–29802895, 040–29802897 నంబర్లకు ఫోన్ చేసి చెప్పవచ్చని, 040–29801522 నంబరుకు ఫ్యాక్స్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment