
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఈ నెల 27న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ల ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఈ ఎన్నికలకు సంబందించి ఈ నెల 25న ఎన్నికల సంఘం అధికారులు నోటిఫికేసన్‌ను ఇవ్వనున్నారు. కాగా రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి: ముగిసిన మున్సిపోల్స్
ఈ ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. 129 పురపాలికల్లో మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఓటేసిన వారిలో మహిళలు 69.94 శాతం, పురుషులు 68.8 శాతం, ఇతరులు 8.36 శాతం మంది ఓటర్లు ఉన్నారు.
చదవండి: ఎవరి లెక్క వారిదే