అందరూ బాగా రాయాలని కోరుకోండి
ఎగ్జామ్ టిప్స్
* ఆత్మవిశ్వాసం రావాలంటే మంచి ప్రిపరేషన్‌ను మించిన మార్గం లేదు. అందుకనే ఎలా చదివితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని అనుకుంటున్నారో అలాగే చదవండి.
* హార్డ్ వర్క్ కంటే హార్ట్ వర్క్ ముఖ్యం. చేసే పనిని ఆనందిస్తూ, మనస్ఫూర్తిగా చేస్తే అలసటకు చోటుండదు.
* పరీక్షల సమయంలో నమ్మకమైన స్నేహితులను ఎంచుకోండి. మీరేం చదువుతున్నారో ఎలా చదువుతున్నారో వారికి చెప్పండి. వారు ఎలా చదువుతున్నారో తెలుసుకోండి. పరస్పరం ఉత్సాహపరచుకోవడం మేలు చేస్తుంది.
* ఎనర్జీ మేనేజిమెంట్ కూడా ముఖ్యమే. దీనికి మంచి ఆహారం, సరిపడా నిద్ర, వ్యాయామం అవసరం. రోజూ 3సార్లు గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. రాత్రి పూట తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోండి. లేకపోతే భుక్తాయాసంతో నిద్ర ముంచుకు వస్తుంది.
* మీకే కాకుండా మీ తోటి విద్యార్థులు అందరికీ బాగా మార్కులు రావాలి అని కోరుకోండి. దీని వల్ల మీకు ప్రశాంతత లభించి చదివేది మరింత బాగా మనసుకు హత్తుకుంటుంది.
* పంచేంద్రియాల ద్వారానే మెదడు నేర్చుకుంటుంది. కాబట్టి వాటిని మీ వశం చేసుకోవాలి. దేహానికి వ్యాయామం, స్నానం, నాలుకకు ఏలకులు, వాసనకు అగరువత్తులు, చెవులకు నిశ్శబ్దం లేదా మాటలు లేని శాస్త్రీయసంగీతం, కనులకు ఎదురుగా కనపడేలా మీ లక్ష్యం... ఇలా ఏర్పరచుకోగలిగితే ఇంద్రియాలను వశం చేసుకోగలుగుతారు.