‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’ అనే లక్ష్యంతో పాఠశాల స్థాయి అకడమిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల నుండి సివిల్ ఎంట్రన్స్ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా కేవలం 99 రూపాయలకే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో CALCUS EDUCATIONAL INSTITUTE ఆధ్వర్యంలో ‘IIT-IIM ALUMNI’ సహకారంతో విడుదలైన ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’నకు విద్యార్ధుల నుండి అద్భుత స్పందన వస్తోందని కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, ఏపీపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, జెఈఈ, నీట్, టీచింగ్, సీబీఎస్‌ఈ, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ వంటి పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్ధులు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు కాల్కస్ ఎడ్యుకేషనల్ వాణీ కుమారి వెల్లడించారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని టెస్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
1325 విభాగాలతో 42 వేలకు పైగా ప్రాక్టీస్ టెస్ట్‌లు
కాల్కస్ ఇండియా యాప్‌లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, కేవీపీవై, ఎన్‌సీఓ, ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండారైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్ అండ్ పోలీస్, ఎస్ఎస్‌సీ, టీచింగ్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, లా-కామర్స్-ఆర్ట్స్, సివిల్స్ లాంటి మొదలైన పరీక్షలకు సంబదించిన ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు వీలుగా ఉండేలాగా 42600కు పైగా మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్నపత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను 25 బండిల్స్ (కాటగిరీలు) రూపంలో పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు.
ఉచిత ప్రాక్టీస్ టెస్ట్స్
యాప్ విడుదల సందర్భంగా, కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్ధుల కోసం పరిమిత సంఖ్యలో ఉచిత టెస్టులను ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం అపరిమిత టెస్టులు కావాలనుకున్నవారు వార్షిక ప్లాన్ కొరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చును.
ఏడాదికి రూ.99
ఒక బండిల్‌లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగాప్రాక్టీసు చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, యాప్ విడుదల సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, త్వరలో ఈ ఆఫర్ గడువు ముగుస్తుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమయ్యే Calcusindia App ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు Calcusindia వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చును. (అడ్వర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment