ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు.
కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment