
న్యూఢిల్లీ: మూడేళ్లలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే సన్నాహాలు ఆరంభించింది. ఇందులో భాగంగా కేబినెట్ మంత్రులతో దాదాపు 19 రాష్ట్రాల్లో ఎక్కడికక్కడా యాత్రలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. కేబినెట్‌లోని 43 మంత్రులు ఆగస్టు 16 నుంచి ఆరంభించాలని భావిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం.
మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు సుమారు 300– 400 కిలోమీటర్ల దూరం నుంచి ఆరంభించి 3,4 లోక్‌సభ నియోజకవర్గాల గుండా తమ సొంత జిల్లాలకు యాత్ర చేపడతారు. మొత్తం 15000 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. తెలంగాణ, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళ నాడు, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటకల్లో యాత్రలు సాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment